'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో బ్లాక్ బస్టర్‌ అందుకున్నాడు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'రెడ్‌'. క్రైమ్‌ థిల్లర్‌గా తెర్కకెక్కుతోంది. 'నేను శైలజ' ఫేం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్.. సిద్దార్థ్, ఆదిత్య అనే రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. రామ్‌కు జంటగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ సందడి చేయనున్నారు.

RED Teaser

తాజాగా.. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. "క్రైం హిస్టరీలో ఇలాంటి కేసును చూడడం ఇదే ఫస్ట్ టైం" అనే డైలాగ్‌లో ఆరంభమైన ఈ టీజర్‌.. ఆద్యంతం ఆకట్టుకుంది. క్లాస్‌, మాస్‌ లుక్‌లో రామ్‌ ఆకట్టుకున్నాడు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాల తర్వాత కిషోర్‌ తిరుమల-రామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన తడమ్‌ కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోన్నట్లు సమాచారం.

Next Story