ప్రభాస్ కు తన వాళ్లు అని అనిపిస్తే చాలు.. అభిమానం ఇలాగే ఉంటుంది మరి..!

By సుభాష్  Published on  6 Sep 2020 2:53 AM GMT
ప్రభాస్ కు తన వాళ్లు అని అనిపిస్తే చాలు.. అభిమానం ఇలాగే ఉంటుంది మరి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అనుచరులను ఎంతబాగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాల్లో నటించే వారినే ఎంతో కేరింగ్ గా చూసుకుంటూ ఉంటాడు. తాజాగా ప్రభాస్ తన జిమ్ ట్రైనర్ కు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చాడు. ఇంతకూ ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా..? రేంజ్ రోవర్ కారు..!

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ స్థాయి ఒక రేంజికి పెరిగిపోయింది. టాలీవుడ్ ను దాటుకుని వెళ్ళిపోయాడు. ఇక ప్రభాస్ ఏదైనా సినిమా తీస్తే.. అది తప్పకుండా దక్షిణాది భాషల్లోనూ, హిందీలోనూ కూడా విడుదలయ్యి తీరాల్సిందే..! ఇతర దేశాల్లో కూడా ఆయనకు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. విదేశాల నుండి ప్రభాస్ ను చూడడానికి వచ్చిన అభిమానులకు ఇచ్చిన ఆతిథ్యం అంతా ఇంతా కాదు. ఇప్పుడు తన ఫిజిక్ కోసం ఎంతో కష్టపడిన ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి రేంజి రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. లక్ష్మణ్ రెడ్డి కుటుంబం కారుతో ఉన్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ప్రభాస్ కు ఫిట్ నెస్ ట్రైనర్ గా లక్ష్మణ్ చాలా కాలం నుంచి ప‌నిచేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ప్రభాస్ లక్షల రూపాయలు విలువ చేసే రేంజ్‌రోవర్ కారును ఆయ‌న‌కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ కారుతో ల‌క్ష్మ‌ణ్ కుటుంబ‌స‌భ్యులు, ప్ర‌భాస్ ఫొటోలు దిగారు. ప్రభాస్ మంచి మనసుకు అభిమానులు మరో సారి ఫిదా అయిపోయారు.

ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే 'ఆది పురుష్' సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తూ ఉన్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించనున్నట్లు ఇటీవలే అప్డేట్ వచ్చింది.

Next Story