హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేయాలని రవి ప్రకాష్ కార్యాలయం నిర్ణయించింది. రవి ప్రకష్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  విజయసాయిరెడ్డిపై రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. ఏబీసీఎల్ సంస్థలో కొంత మందిచట్టవ్యతిరేకంగా ప్రవేశించారని రవి ప్రకాష్ కార్యాలయం ప్రకటించింది. వారే ఈ నీచమైన ఆరోపణలు చేయిస్తున్నారని రవి ప్రకాష్ ప్రతినిధులు ఆరోపించారు.  అడ్వొకేట్ రామారావు నెల రోజుల క్రితం పంపిన కాపీనే ఎంపీ విజయసాయి రెడ్డి తన లెటర్ హెడ్ పై పంపించారని రవిప్రకాష్ కార్యాలయం తెలిపింది.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.