వెరైటీ సినిమాల దర్శకుడు అల్లరి రవిబాబు నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న తాజా థ్రిల్లర్ మూవీ ‘ఆవిరి’. నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. మున్నీ అనే ఒక చిన్న పాప, తన తల్లితండ్రులకు తెలియకుండా ఇంటి నుండి వెళ్ళిపోలనుకుంటుంది.

అయితే ఆశ్చర్యకరంగా ఒక ఆత్మ ఆ పాపను వశపరుచుకొని ఇంటి నుండి తీసుకెళ్లిపోవడం, ఆ తరువాత ఆ పాప ఎక్కడుందో తల్లిదండ్రులు ఏవిధంగా కనిపెట్టారు అనే వినూత్న కథాంశంతో సినిమా తెరకెక్కుతున్నట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ ట్రైలర్, సినిమా పై బాగా అంచనాలు పెంచేసింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై తెరక్కుతున్న ఈ సినిమాలో దర్శకుడు రవిబాబు కూడా ఒక పాత్రలో నటించడం జరిగింది. ఈ సినిమాను నవంబర్ 1 న రిలీజ్ చేయనున్నారు. ఈ ‘ఆవిరి’ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు ఆగాల్సిందే.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet