హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. అరెస్ట్ చేశారు. ఇప్పుడు కస్టడీ అడుగుతున్నారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఉందన్నారు. కింది కోర్ట్‌లను పోలీసులు పట్టించుకోవడంలేదని రవి ప్రకాష్ తరపు న్యాయవాది రజినీకాంత్ రెడ్డి అన్నారు. అయితే..పీపీ మాత్రం తమకు ఈ రోజే కస్టడీకి ఇవ్వాలని వాదించారు. హైకోర్ట్ ఆదేశాలతోపాటు..కేసు తీవ్రత ఎక్కువ ఉన్నందున తీర్పు రేపు చెబుతామన్నది నాంపల్లి కోర్టు.

అలందా మీడియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు  టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవిప్రకాష్ చంచల్ గూడ జైల్లో ఉన్నారు. చంచల్ గూడ జైల్లో ఉన్న రవిప్రకాష్ ను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే..రవి ప్రకాష్ పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టినట్లు డీసీపీ సుమతి  చెప్పారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.