హైదరాబాద్ : రవి ప్రకాష్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సీతాఫల్ మండిలోని జడ్జి నివాసం నుంచి రవి ప్రకాష్‌ను చంచలగూడ జైలుకు తరలించారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ నెల 18 వరకు రవి ప్రకాష్‌కు రిమాండ్ విధించింది. అయితే..రవి ప్రకాష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల9న వాదనలు వింటామని కోర్ట్ స్పష్టం చేసింది.