రవి ప్రకాష్ అరెస్ట్..కాసేపట్లో జడ్జి ముందుకు..!

హైదరాబాద్‌:  టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ ను కాసేపట్లో గాంధీ ఆసుపత్రి కి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం సికింద్రాబాద్ మారేడ్ పల్లి లోని జడ్జీ నివాసంలో రవి ప్రకాష్‌ను హాజరు పరుస్తారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదుతో రవి ప్రకాష్‌ను పోలీసులు ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కొన్ని నెలల క్రితమే అలందా మీడియా రవి ప్రకాష్ పై ఫిర్యాదు చేసింది. తరువాత ఆయన అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. కొన్ని రోజుల తరువాత రవి ప్రకాషే వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయారు. అప్పుడే అరెస్ట్ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి . అయితే..కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిళ్లో ఏమో కాని..రవి ప్రకాష్ ను చివరి నిమిషంలో అరెస్ట్ చేయలేదు. తరువాత  ఛానల్ పెట్టడానికి రెడీ అవుతున్నారనే వార్తలను కూడా ఆయన చుట్టూ ఉండే వారు విస్తృతంగా ప్రచారం చేశారు. మళ్లీ అలందా మీడియా రవి ప్రకాష్ , ఆయన మనుషులు రూ.18 కోట్లు తిన్నారని చీటింగ్ కేసు పెట్టడంతో కథ మొదటికి వచ్చింది. దీంతో పోలీపులు ఉదయాన్నే రవి ప్రకాష్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.