జూలై 12 ఆదివారం నుండి జూలై 18 శనివారం వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 2:33 AM GMT
జూలై 12 ఆదివారం నుండి జూలై 18 శనివారం వరకు

మేష రాశి :

ఈ రాశివారికి ధనలాభం, భూషణాలు, సర్వ సంపదలూ కలుగుతాయి శుక్ర, రాహువులు యోగ కారకులై వున్నారు కాబట్టి ఈ శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే శని, కేతుల స్థితి వలన రాజకీయ చిక్కులు తద్వారా శత్రువృద్ధి తప్పదు. వ్యయంల్లో ఉన్న కుజుడు కుటుంబ విషయాల్లో కష్టాలు కలిగిస్తాడు. 16 వ తేదీ తరువాత ఇతరులవల్ల కష్టం కలగటం తో పాటుగా గౌరవం తగ్గటం మిమ్మల్ని బాధ పెడుతుంది. గురు బలం కూడా పెరగడం వల్ల శ్రమకు తగినంత ఫలితం పొందుతారు. వారం మధ్యలో ధన వ్యయమున్నది అది దుర్వినియోగం కూడా కాబోతోంది. రవి శనులు సమ సప్తకంలొ పడడం వల్ల మీ సలహాలు రాజకీయ చతురత మీకే ఇబ్బందుల పాలు చేస్తాయి. తొమ్మిదో ఇంట్లో గురుడు ధనలాభం చేకూర్చిన మాట కటుత్వం వల్ల పేరు ప్రఖ్యాతులకు ఇబ్బందులు కలుగుతాయి. అశ్విని నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి ఫలితాలు చాలా బాగా ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకు నైధన తార కావడంతో అశుభ ఫలితాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి సాధన తారతో వారం ప్రారంభం కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : రవికి సూర్య నమస్కారాలు చేయించండి. శనికి జపము హోమము నల్ల నువ్వులు నల్లని వస్త్రం దానం చేయించండి.

వృషభ రాశి :

ఈ రాశివారికి కుటుంబ సౌఖ్యము ధన ప్రాప్తి స్వర్ణాభరణాల ప్రాప్తి శారీరిక సౌఖ్యం పొందనున్నారు. .కర్కాటక రాశి లోకి ప్రవేశిస్తున్న రవి సకల సంపదలు అందించనున్నాడు. కుజ బుధులు శుక్రుడు శరీర సౌఖ్యాన్ని ఇవ్వనున్నారు. అయితే శని, రాహు, కేతువులు మాత్రం మీకు అకారణ కలహాన్ని ఇచ్చి అనవసర వ్యయానికి కారణమవుతున్నారు. ఎంత పోగొట్టుకున్నా అంతకు అంతా తిరిగి సంపాదించుకొనే అవకాశం వుంది. రవి శనుల పరస్పర వీక్షణ పంతాలు పట్టింపులకు కారణమై హృద్రోగాల్నీ సూచిస్తోంది. లగ్నంలో శుక్ర చంద్రుల మానసిక ఆనందాన్ని కుటుంబ బాధ్యతలను తెలియజేస్తారు. అష్టమ గురుడు ధనం య్యాన్ని సూచిస్తూ ఉండగా బుధుడు అలంకార ప్రాప్తిని కలుగజేస్తాడు కాబట్టి స్థిరాస్తులు సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది కోర్టు వ్యాజ్యములు విషయంలో కాస్తంత సానుకూలంగా తీర్పులో వచ్చే అవకాశం ఉంది కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తార కాబట్టి శుభ ఫలితాలున్నాయి. రోహిణి నక్షత్రం వారికి ప్రత్యక్ తారతో వార ప్రారంభం కాబట్టి చేసే పని చెడు ఫలితాన్ని ఇస్తుంది. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి క్షేమ తార కాబట్టి అనుకూలంగా ఉంది.

పరిహారం : గోధుమలు ఎర్రని వస్త్రం దానం చేయించండి నవగ్రహ ప్రదక్షిణ మంచి ఫలితాన్నిస్తుంది శనికి నల్లనువ్వులు నువ్వుల నూనె దీపం శుభం కలిగిస్తాయి.

మిధున రాశి :

ఈ రాశివారికి ఉత్సాహమే ఊపిరిగా సంతోషంగా వారం గడుపుతారు. ఉద్యోగ వ్యాపార రీత్యా స్థాన చలనం ఉన్నా లాభము సంతోషము వీరికి దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాలు మాత్రమే కుంటుపడతాయి. అష్టమ శని ప్రభావం చేత కుటుంబంలో ఎవరో ఒకరు జీవితపు అంచులు వరకు ప్రయాణం చేస్తారు. లగ్నంలో రాహు ప్రభావము సప్తమంలో కేతు ప్రభావము వ్యక్తి గత అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి. అన్నదమ్ముల తగాదాలు బంధుమిత్రుల విరోధము మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి అయితే భార్యా బిడ్డల సౌఖ్యము మిమ్మల్ని ఆనందింపచేస్తుంది ద్వితీయ రవి అష్టమ శని మిమ్మల్ని క్రిందికి దిగజారుస్తారు. కానీ లగ్నం పైన గురు దృష్టి మాత్రమే సకాలంలో హెచ్చరికల అందించి మీకు ఆరోగ్యాన్ని సంఘాల్లో గౌరవ మర్యాదలను పెంచుతాడు. మృగశిర రెండు మూడు పాదాల వారికి క్షేమ తారైంది ఫలితాలు బాగున్నాయి. ఆరుద్రా నక్షత్ర జాతకులకు విపత్తార అయ్యింది వ్యతిరేకత ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు వారికి సంపత్తార అయింది ఆర్థిక మెరుగుదల ఉంది .

పరిహారం : శనికి జపం చేయించండి నల్లనువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రం దానం చేయండి. ప్రతిరోజూ నవగ్ర గ్రహాల దర్శనము శివ సందర్శనము శుభఫలితాలని ఇస్తాయి.

కర్కాటక రాశి :

ఈ రాశివారికి స్థాన చలనము కొద్దిపాటి ధన లాభమే ఉన్నాయి అయినా జీవితంలో ఒక ఆనందాన్ని చవి చూస్తారు. ఇంతకు ముందుకంటే మాత్రము ధనము సౌఖ్యము తక్కువనే చెప్పాల. ద్రవ్యలాభం ఉన్నప్పటికీ అనవసర వ్యయాలు పెరిగి అనారోగ్యాన్ని ఆలోచన విధానం మారడాన్ని మీరే గుర్తిస్తారు. గురుడు మిమ్మల్ని ఆలోచింప చేస్తాడు. కేతువు మీ యొక్క ఆలోచనా విధానాన్ని దైవ పరంగా మార్చి స్థిర మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు. కుజ బుధ శని ప్రభావాలు మిమ్మల్ని ఏ పని చేసినా కడకంటా వెళ్లనివ్వదు. ఎవరో ఒకరు మిమ్మల్ని అడ్డుకుని పనికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తాయని చెప్పి నిరుత్సా పరుస్తారు. దానితో మరికొంచెం వెనకడుగులు మీరు వేయడం మొదలుపెడతారు. పునర్వసు నాలుగో పాదం వారికి సంపత్తు తార అయింది ఆర్థిక మెరుగుదల ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయింది మధ్యమ ఫలితాలు ఉంటాయి.

పరిహారం : గురువారం నియమాన్ని పాటించండి గురుచరిత్ర దక్షిణామూర్తి స్తోత్రము శివ స్తోత్రాలు మంచి ఫలితాలనే ఇస్తాయి. ప్రతి రోజు లక్ష్మీ అష్టోత్తరం వినండి లేదా పారాయణ చేయండి ఆర్థిక పరిపుష్టి ఉంటుంది .

సింహ రాశి :

ఈ రాశివారికి కుటుంబ సౌఖ్యము ధన లాభము ఆనందం సంతోషము మిమ్మల్ని ఆనందపు టంచు లకి తీసుకువెళతాయి. మీలో నూతన ఉత్సాహము కార్యాచరణ రీతి మెరుగవుతాయి. మీ మాట ఒక శాసనంగా మారే రోజులు ఇవి ఎంత ప్రయత్నిస్తే అన్ని శుభ ఫలితాల్ని అంత త్వరగానూ అందరి వల్ల ఒకేసారి పొందగలుగుతారు. శస్త్రచికిత్స కుజ ప్రభావం చేత ఉన్నప్పటికీ దైవ చింతన చేత దాని తీవ్రత తగ్గుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు రాజకీయ ఒత్తిడులు వల్ల మాత్రమే ఉంటాయి తప్ప మరే రకంగానూ ఉండవు. ఉద్యోగంలో వ్యాపారంలో పదోన్నతులు స్థిరాస్తి సంపాదనలు ఇంట్లో కళ్యాణకార్య క్రమములో మిమ్మల్ని మరింత ఉత్సాహ ఆనందాలతో నింపి సంతోషపు వార్తలతో ఈ వారం కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. పదహారో తేదీ దాటాక ధనవ్యయము ఇబ్బందికర ఒత్తిడి ఉంది. ముందుగా జాగ్రత్త వహించండి. మఖా నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు నైధన తార అయ్యింది వ్యతిరేక ఫలితాలే కనిపిస్తున్నాయి. కృత్తిక ఒకటో పాదం వారికి సాధన తార అయింది సత్ఫలితాన్ని చవిచూస్తారు.

పరిహారం : సూర్యనమస్కారాలు యోగ సాధన మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కుజునికి జపం చేయించండి కందులు దానం చేయండి. అమ్మవారి పూజలు సుబ్రహ్మణ్య పూజ చేయించండి సత్ఫలితాలున్నాయి.

కన్యా రాశి :

ఈ రాశివారికి కార్య జయము ధన లాభము సౌఖ్యము ఉన్నాయి. మీకు ఎన్ని ఆటంకాలొచ్చినా మీ మనోధైర్యమే ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. కేతు ప్రభావం చేత గౌరవం భంగం కూడా జరగనున్నది రాహు ప్రభావం చేత ధనము వ్యయం కూడా ఉన్నది. అయినా మీకు పెద్దల యొక్క ఆశీస్సులు భగవంతుని కృప ఉంటాయి. అవి మిమ్మల్ని సన్మార్గంలో నడిపించి మీకు కుజుని వల్ల వచ్చే కార్య ఆటంకాలని రాహువు వల్ల వచ్చే ధన వ్యయాన్ని కూడా ఆప గలుగుతాయి. గురు ప్రభావము మిమ్మల్ని కొంచెం వెనుకకు లాగి మీ ఆలోచనలను సక్రమ మార్గంలో నిలవనివ్వదు. నిరంతర అర్చన సేవ అరాధనల ద్వారా గురు అనుగ్రహము దైవానుగ్రహము పొందాల్సిన అవసరం మీకు ఉంది. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఈ వారంలో ఆకస్మికంగా సూచించు పడవచ్చు లేదా నిర్ణయింప పడవచ్చు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తార అయింది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. హస్తా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది వ్యతిరేక ఫలితాలను ఎక్కువగా చవిచూస్తారు. చిత్త ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తార అయింది చాలా బాగుంటుంది.

పరిహారం : సప్తమ కుజ ప్రభావం తగ్గడానికి కందులు దానం చేయండి. ఖడ్గమాల పారాయణ చేయండి. కాలభైరవ స్తోత్రాలు మంచి ఫలితాలు ఇస్తాయి.

తులా రాశి :

ఈ రాశివారికి కార్య జయం ధనప్రాప్తి స్థిరాస్తి సంపాదనలు ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. భాగ్యంలో ఉన్న బుధ రవులు కష్టాన్ని సూచించినా పదహారో తేదీ దాటాక మీ ప్రతి పనిని ముందుకు నడిపించే సూచనలున్నాయి. శుక్రుడు అష్టమంలో ఉన్నప్పటికీ శుభ ఫలితాలని ఇస్తూ భూ వ్యవహారంలో విశేష ధన లాభాన్ని చేకూరుస్తాడు. దీర్ఘ రోగుల అయినట్లయితే చతుర్ధ శని ప్రభావం చేత మీకు ఇబ్బంది కలుగక తప్పదు. మీకు ఏకాగ్రత లోపం వల్ల చాలా పనులు వాయిదా పడతాయి. రవి శనుల పరస్పర దృష్టి మీ పనులకు కొంత ఆటంకంగా నిలుస్తుంది. కేతు ప్రభావం చేత స్థిరాస్తి వ్యవహారాలు భూ సంబంధమైన వ్యవహారాలు చక్కబడే అవకాశం తద్వారా ధన సంపాదనకు అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తారైంది విశేష శుభఫలితాలు ఉన్నాయి. స్వాతీ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది అశుభ ఫల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్ తారైంది ఆదాయం కూడా బాగుంటుంది.

పరిహారం : అర్ధాష్టమ శని దోష నివారణార్థం అని చెప్పి శనికి తైలాభిషేకం చేయించండి నల్లని వస్త్రదానం కూడా చేయండి. దత్తాత్రేయ చరిత్ర గురుచరిత్ర శుభ ఫలితాలను ఇస్తాయి.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి విశేష ధన లాభము కోరికలు నెరవేరే మార్గాలు ఉండడం వల్ల ఈ వారం శుభప్రదంగా గడిపే ప్రయత్నం చేస్తారు. రవి ప్రభావము అనారోగ్యాన్ని అధిక కష్టాన్ని శరీర తాపాన్ని సూచిస్తోంది. చంద్రుడు మానసికంగా మిమ్మల్ని వారాంతంలో కృంగ దీస్తారు అంతేకాదు గౌరవ మర్యాదలు కూడా భంగం వాటిల్లబోతోంది. శత్రువుల వల్ల భయము చోర బాధ అకారణ కలహము ఈ మూడు కుజ రాహు కేతువుల ప్రభావం చేత మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కుంగదీస్తాయి కానీ మీకు గురుని ప్రభావము గురు అనుగ్రహము దైవానుగ్రహము ఉన్నట్లయితే శుభ ఫలితాలని తొందరగా పొందగలుగుతారు. వారాంతంలో మీకు ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం వుంది జాగ్రత్త వహించండని హెచ్చరిక. విశాఖ నాలుగో పాదం వారికి సంపత్తార అయింది ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు జన్మతార అయ్యింది అనారోగ్య సూచన ఉంది. జ్యేష్టా నక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయింది చాలా మంచి ఫలితాలు పొందుతున్నారు.

పరిహారం : ఆంజనేయ స్వామికి పూజ చేయించండి సుందరకాండ పారాయణ హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఖడ్గమాలా సప్తశతి పారాయణాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

ధనూ రాశి :

ఈ రాశివారికి విశేష ధన లాభం ఉంది కానీ చేతికందే వరకు నమ్మలేము. వీరికి రవి ప్రభావము శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతోంది. ఒక్క బుధుడు మాత్రమే ధనలాభాన్ని చేకూర్చుతాడు. లగ్నంలో ఉన్న కేతువు సప్తమంలో ఉన్న రాహు ఇద్దరు వీరిని ఇబ్బందుల పాలు చేస్తారు. ద్వితీయ శని ప్రభావము వీరిపైనే ఎక్కువగా ఉండి అనవసరంగా ఖర్చులు పెరిగి స్థిరాస్తిని కూడా పోగొట్టుకునే స్థితికి రావలసి వస్తుంది. శుక్ర ప్రభావం చేత అపకీర్తి ఉంది ఏదో నింద పడి మీరు రక్షక భటుల చేతిలో కూడా దృష్టిలోనూ పడతారు. గురు ప్రభావం చేత స్థానాన్ని దాటి మీరు కొద్దిగా బయటపడే అవకాశం మాత్రమే ఉంది. ఏదైనా ఈ వారం మీరు అతి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాలు మున్ముందు కూడా ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నైదన తార అయింది ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి సాధన తార అయింది సత్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : శనికి నల్ల నువ్వులు నల్లని వస్త్రము నువ్వుల నూనె దీపదానము చేయండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయండి సత్ఫలితాలను మీరు త్వరగా పొందగలుగుతారు.

మకర రాశి :

ఈ రాశివారికి ధనలాభము బంధు దర్శనము సుఖజీవనం హాయిని ఆనందాన్ని ఇస్తాయి. వారం ప్రారంభంలోనే మీకు శత్రువులు బలాన్ని కోల్పోయి మీకు వశులవుతారు. అయితే పదహారో తేదీ తర్వాత ఒక విపత్కర పరిస్థితిలో అనారోగ్యాన్ని తెచ్చుకుని మీ కార్యము జరగాల్సిన రీతిలో కాక వ్యతిరేక పద్ధతిలోకి మారి ఇబ్బందిని కలగజేస్తుంది. జన్మశని ప్రభావమే దీనికి కారణము.లగ్నంలో శని మిమ్మల్ని అనేక రకాల పరీక్షలకు గురి చేసి చివరిలో ఫలితాన్ని మంచిగా ఇస్తాడు. ఈ వారంలో బుధుని యొక్క ప్రభావం చేత అలంకార ప్రాప్తిని తృతీయ ముందున్న కుజుని వల్ల సకల సౌఖ్యాలను భోగాలని అనుభవిస్తారు. బంధువులు మీకు మేలు చేసే మార్గంలో మంచి పనుల కోసం ధన వ్యయము తప్పదు. ఆరో ఇంట్లో ఉన్న రాహు ప్రభావం చేత సుఖ సౌఖ్యాలు మీకు అబ్బుతాయి. ఎన్ని చేసినా వ్యయ ముందున్న గురుడు మీ ఆలోచనలన్నీ పడగొట్టి వేస్తాడు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తార అయింది శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : శనికి రవికి జపములు చేయించండి గోధుమలు దానం చేయండి నల్లని నువ్వులు దానం చేయండి ప్రతిరోజూ శివాభిషేకం శివ దర్శనం శుభ ఫలితాలని ఇస్తాయి.

కుంభ రాశి :

ఈ రాశివారికి కొద్దిపాటి ధనలాభం కుటుంబ సౌఖ్యము స్త్రీ సౌఖ్యము ఈ వారంలో మిమ్మల్ని ధైర్యంతో ముందుకు నడిపిస్తాయి . అనుకోని వ్యక్తుల వల్ల మీకుండే ఆలోచనా విధానము లేదా కార్యదక్షత నశించి మిమ్మల్ని బాగా కుంగదీస్తారు. మీకు విపరీతమైన భయం మీ జీవితాల్లో చోటు చేసుకుంటుంది. ధనం ఎంతొస్తుందో అంతకు నాలుగు రెట్లు ధనం వ్యయం కనిపిస్తోంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త వహించండి. పాత వ్యక్తులైనా సరే ఒకసారి పరిశీలనాత్మకంగా చూడండి. మీ ఆలోచనా విధానం మీతో ఉన్నంత వరకు మీకు ఇబ్బంది ఉండదు. గురు ప్రభావం వల్ల మీరు ఆలోచనను చేయగలరు. కానీ వ్యయ మందున్న శని ప్రభావం చేత మీ ఆలోచన వెనకడుగు వేస్తుంది. అక్కడ మీరు ఇబ్బంది ఎదుర్కోవడం మొదలవుతుంది. మిమ్మల్ని భయపెట్టే వారే ఎక్కువగా మీకు తారసపడతారు. ధననష్టము ఉంది జాగ్రత్త వహించండి. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తార అయింది ఫలితాలు బాగున్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు విపత్తు తార అయింది ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్ తారైంది ఆర్థిక వనరులు కొంత సమకూరుతాయి.

పరిహారం : శని రవి లకు జపము దానము ధర్మము చేయండి. గురు అనుగ్రహం మీరు పొందితే మీకు చాలా శుభ ఫలితాలు వస్తాయి. గురు స్తోత్ర పారాయణ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ మంచిది.

మీన రాశి :

ఈ రాశివారికి శత్రు జయము విశేష ధన లాభము మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కానీ లగ్నంలో ఉన్న కుజుడు మీకు మహా విచారాన్ని కలిగిస్తాడు. కుటుంబపరంగా వయస్సు మళ్ళిన వారు ఇంట్లో ఉన్నట్లయితే వారి అనారోగ్య పరంగా మీకు ఇబ్బంది తప్పదు. గురు ప్రభావం చేత మీరు ఎక్కువ శ్రమపడతారు దానికి తగిన ఫలితాన్ని మాత్రమే పొందగలుగుతారు. మీరు ఊహించినంత సత్ఫలితాలు ఈ వారంలో కనిపించకపోవచ్చు. ధనవ్యయం ఎక్కువగా ఉంది. అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి గనుక మీరు ఆచి తూచి అడుగు వేయండి. రాహు ప్రభావం చేతను కేతు ప్రభావం చేతను గౌరవ భంగము అధిక ధన నష్టము ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా భగవ న్నామ స్మరణతో ముందుకు వెళ్లినట్లయితే మీరు సత్ఫలితాలు పొందగలుగుతారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి సంపత్ తారైంది ఫలితాలు చక్కగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్చత్ర జాతకులకు జన్మతార అయింది వ్యయము అనారోగ్య సూచనలు ఉన్నాయి. రేవతీ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి.

పరిహారము : కుజులకు కందులు దానం చేయించండి. సుబ్రహ్మణ్య అర్చన ఆంజనేయస్వామి అర్చన మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. నిమ్మకాయలు దండలు ఆంజనేయస్వామికి వేయండి సింధూర ధారణ చేయండి.

Next Story