రాశిఫలాలు: ఏప్రిల్ 5 ఆదివారం నుండి ఏప్రిల్ 11శనివారం వరకు..

By అంజి  Published on  5 April 2020 8:23 AM GMT
రాశిఫలాలు: ఏప్రిల్ 5 ఆదివారం నుండి ఏప్రిల్ 11శనివారం వరకు..

మేష రాశి :-

ఈ రాశివారికి శుభ ఫలితాల్లో చిన్న మార్పులు ప్రారంభమయ్యాయి. విశేష ధన లాభం ఉంది. వీరిని వ్యతిరేకించే వారు కూడా పెరిగారు. రాజకీయ పరంగా ముందుకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బందులున్నాయి. శ్రమ ఎక్కువవుతుంది. ఆదాయం తగ్గే పరిస్థితి ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం ధనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది. లగ్నాధిపతి ఉచ్చ క్షేత్రంలో ఉండటం వల్ల ఆభరణాలుసంపాదించుకుంటారు. శని గురుల కలయిక మాత్రం శ్రమని తెలియజేస్తోంది. ఎంత కష్టపడినా ఎవరో ఒకరు ఆ ఫలితాన్ని తన్నుకు పోయే అవకాశం ఉంది. కుటుంబ పరంగా మాత్రం హాయిగా ఆనందంగా ఉంటారు. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఒక వార్త మాత్రం మిమ్మల్ని కలవర పెట్టొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అశ్విని వారికి జన్మ తారైంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. భరణి వారికి పరమ మిత్రతార అయింది మంచి ఫలితాలొస్తున్నాయి. కృత్తిక ఒకటో పాదం వారికి మిత్ర తారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారము :- సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజలు ఆంజనేయస్వామి పూజ చేసినట్లైతే మీకు ధైర్య స్థైర్యాలు వస్తాయి.

వృషభరాశి :-

ఈ రాశి వారికి లగ్నాధిపతి లగ్నంలో ఉండటం శుభ ఫలితాన్ని ఇస్తోంది. ఎవరితో ఏం మాట్లాడినా మీకు కలహ కారణంగా మారుతోంది. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. తలపెట్టిన కార్యాలన్నీ కూడా వెనక్కి వెళిపోతూనే ఉంటాయి. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్ వహించండి. ధనం కూడా పోతుందేమోనని పిస్తుంది.ఆంత ఇబ్బందిలేదు. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వారాంతంలో మాత్రం మీకు ధనలాభము కుటుంబంతో పాటు మంచి ఆనందము ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ జాతకానికి ఈ వారంలో శని స్థితి బావులేదు కాబట్టి ఆరోగ్య విషయంలోని మాత్రమే అధిక జాగ్రత్త వహించండి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్ర తారైంది చాలా శుభఫలితాలున్నాయి. రోహిణి వారికి నైధన తారైంది ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మృగశిర ఒక ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం :- చంద్రుడికి మీరు పెరుగు దానం చేస్తే బావుంటుంది. యోగ సాధన వల్ల మీరు మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ప్రాణాయామం చేయండి .

మిథున రాశి :-

ఈ రాశి వారికి మానసిక ధైర్యం చాలా అవసరము. ఎవరెన్ని చెప్పినా వీరికి మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతారు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా వీరికి నిరుత్సాహపరిచే మాటలే చెబుతారు. కాబట్టి స్వంతంగా చైతన్యం కలిగి ఉండటం చాలా అవసరము. గ్రహస్థితి కూడా అలాగే ఉంది. లగ్నంలో ఉన్న రాహు భయాన్ని కలిగిస్తుంటే చంద్రుడు అనారోగ్యాన్ని కార్య విఘ్నాన్ని సూచిస్తున్నాడు. వీరికి గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వటం తక్కువ. శని ఏకంగా అష్టమంలో ఉండటం వల్ల మరింత ఇబ్బందిని కలిగిస్తాడు. బుధ రవి శుక్రులే అంతో ఇంతో సంతోషం కలిగిస్తారు. వారాంతంలో కార్య జయం జరుగుతుంది. అయితే మీలో మీరు ఉత్సాహాన్ని నింపుకోవటం చాలా అవసరము మీకు పై నుండి ఎటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు లభించవు. కాబట్టి వారు మీరు మానసికంగా సంసిద్ధులై వుండండి. మానసిక ఆందోళన విడవండి.మృగశిర మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది చాలా బావుంది. ఆరుద్ర వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి జాగ్రత్త వహించండి. పునర్వసు ఒక ఒకటి రెండు మూడు పాదాల వారికి క్షేమ తారైంది కాబట్టి సుఖపడతారు.

పరిహారం:- రాశివారి రాహుకి జపం చేయి చేయించండి. నానవేసిన పెసలు బుధవారం నాడు బెల్లం వేసి ఆవుకి తినిపించండి.మంచి ఫలితాలు లభిస్తాయి.

కర్కాటక రాశి :-

ఈ రాశివారు ఈ వారంలో చాలా శ్రమకి ఓర్చుకోవాల్సి. సమయంకి చేతిలో ధనం కావలసినంత ఉండదు. అనారోగ్యమూ ఇబ్బంది పెడుతుంది. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంది. ప్రతి పని కూడా ఆటంక పడుతూ ఉంటుంది. గురుబలం వుండటం చేత అనుభవం చేత నీరు ముందుకు సాగిపోవాలి తప్ప ప్రయోజనం తక్కువ. కష్టానికి తగిన ఫలితం పొందలేరు. కష్టపడేది మీరు ఫలితం పొందేది ఇంకొకరు. ఈ రకంగా మీరు మహా విచారాన్ని పొందుతారు. శని ప్రభావం కూడా వ్యతిరేకంగా ఉంది. అమూల్యమైన వస్తువులను మీరు పోగొట్టుకుంటారు అనిపిస్తుంది మిత్రుల సహకారం తక్కువగా ఉంది పరిస్థితుల్ని మీరు అంచనా వేసుకోవడానికి చాలా శ్రమ పడతారు. మీ అంచనాలన్నీ తారుమారై పోతాయి. తోటి వారితోనే మీరు ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. పునర్వసు నాలుగో పాదం వారికి క్షేమ తార అయింది బావుంది. పుష్యమి వారికి విపత్తారైంది. ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆశ్రేష వారికి సంపత్ తారైంది ఆర్థికంగా బావుంటుంది.

పరిహారం :- మీరు దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజూ శివుని దర్శనం చేయండి.

సింహ రాశి:

ఈ రాశివారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లోని బయట ఎక్కడ చూసినా మీకు విశేష గౌరవ మర్యాదలు ఘన సన్మానాలు లభిస్తాయి ధన వ్యయం ఉన్నప్పటికీ కూడా ధనప్రాప్తి ఎక్కువగా ఉంది విశేషంగా సంపాదించుకుంటారు ఆలోచనల బా చాలా ఎక్కువగా ఉంటాయి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీరు పొందే సంతోషంఇంతా అంతా కాదు ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయలకు లోనవుతారు ఓ ప్రక్క మంచి ఆలోచనలు చేసిన చిన్న వ్యత వ్యతిరేకత ఉంది అయినా మీ జాతక రీత్యా అన్నీ కొట్టుకుపోతాయి మీరు చాలా ఉన్నత స్థితికి చేరగలుగుతారు మీ ఇబ్బంది మాత్రం ఇతరులకు చెప్ప లేనిది. అది మిమ్మల్ని బాధిస్తుంది. మఖవారికి జన్మతారైంది ఆరోగ్యం చూసుకోండి. పుబ్బ వారికి పరమ మిత్ర తారైంది చాలా బావుంది. ఉత్తర వారికి మిత్రతార అయింది. శుభ ఫలితాలు ఎక్కువ.

పరిహారం :- సూర్యనమస్కారాలు ఎక్కువగా చేయండి. చాలా మంచి ఫలితాలని పొందగలుగుతారు. అగ్నిని ప్రార్థించండి ఇంకా బావుంటుంది.

కన్యా రాశి :-

ఈ రాశివారికి ఎటు చూసినా విచారము గౌరవ భంగము ఈ రెండూ ఎక్కువగా ఉన్నాయి. మీకు మీరే శత్రువు లేమో ఆలోచించుకోండి . సప్తమంలో ఉన్న బుధుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. మీ ఆలోచనలు సరియైనవి కావు అని నిర్ణయం చేస్తాడు. అది మీరు గ్రహించలేరు అంగీకరించలేరు. పంచమంలో ఉన్న శని కుజ గురుల కలయిక మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది. ఇది మీలో విచారాన్ని కలిగిస్తుంది. ఒక్క సారిగా మీరు నిరుత్సాహాన్ని పొందుతూ ఉంటారు. శారీరకంగా మీరు ఎలా ఉన్నా మానసికంగా ధైర్యాన్ని గురుడు నుంచి పొందాలి. మీరు మానసిక ఒత్తిళ్లను వదులుకోవాలి. ధనలాభం అయితే ఉంది కానీ అందుకు తగిన ధన వ్యయం కూడా కనిపిస్తోంది. చంద్ర స్థితి బాగుంది కనుక ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి పరమ మిత్రతారైంది చాలా బావుంది. హస్త వారికి నైధన తారైంది ప్రతికూలతలు ఎక్కువ. చిత్త ఒకటి రెండు పాదాల వారికి సాధన తారైంది కాబట్టి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- బుధవారం నాడు నానవేసిన పెసలు బెల్లం వేసి ఆవుకి తినిపించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :-

ఈ రాశి వారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. చంద్రుడు మీలో ధైర్యాన్ని నింపుతూనే ధనాన్ని ఇస్తున్నాడు. మీరు కోరుకున్నట్లుగా మీ పనులన్నీ ఒకటి ఒకటిగా నెరవేరే అవకాశం కూడా ఉంది. అలంకార ప్రాప్తి ఉంది. శత్రువుల నుంచి విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. కోపాన్ని గనక తగ్గించుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకోకుండానే చక్కబడతాయి. ధననష్టం మాత్రం ఉంది. అది తాత్కాలికంగా బాధించినా భవిష్యత్ ప్రణాళిక కోసం సహకరిస్తుంది. కొత్త వస్తువుల్ని తెచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తూంది. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత చక్కగా మీ పనులన్నీ కూడా నెరవేరుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు ఎక్కువగా పొందగలుగుతారు. శారీరికంగా ఉదర రోగం ఉంది కాబట్టి కాస్త వైద్య సహకారం అవసరం అవుతుంది. వారం మధ్యలో మీరు ఇబ్బందుల్ని ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది. చిత్ర మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది బావుంది. స్వాతి వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలత ఎక్కువగా ఉన్నాయి. విశాఖ ఒకట్రెండు మూడు పాదాలు వారికి క్షేమ తారైంది కాబట్టి చాలా శుభ ఫలితాల్ని పొందబోతున్నారు.

పరిహారం :- ఈ రాశివారు వజ్రం ధరించి ఉంటే మంచిది. తెల్లని వస్త్రాలు ధరించడం మీకు శుభ ఫలితాల నిస్తుంది. అలాగే అన్నదానంచేయండి.

వృశ్చిక రాశి :-

ఈ రాశివారు ఈ వారంలో సుడిగుండం మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది. ఓ ప్రక్క ఆనందం పొందాలని మీరు ప్రయత్నిస్తుంటే వేరొకప్రక్క మీకు ఎదురు చూడని కష్టాలు ఇబ్బందులు మిమ్మల్ని కుంగదీస్తాయి. బుధుడు మీకున్న ధైర్యాన్ని ప్రక్కకి లాగేస్తాడు. అయితే శని మాత్రం మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గురుడు మీకు కష్టాన్ని కలిగిస్తాడు. మీ అనారోగ్యానికి మీరే కారకులవుతారు. ఏదైనా విలువైన వస్తు పోగొట్టుకునే అవకాశం ఉంది. మీ మానసిక ఆందోళన ద్వారా ఆలోచనా రహితంగా ఉన్న సమయంలో కొంత ధనాన్ని పోగొట్టుకుంటారు. మీ ఖర్చులు ఈవారంలో విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయం మాత్రం మీరు చూసుకోండి. ఆరోగ్య కారకుడైన రవి ప్రతికూలతే ఎక్కువగా ఉంది. మీ వల్ల మీ కుటుంబంలో వారికి కూడా మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కుటుంబ పరంగా చిన్న ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. విశాఖ నాల్గవ పాదం వారికి క్షేమతార అయింది చాలా బావుంది. అనూరాధ వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతల ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్ఠ వారికి సంపత్తార అయింది కాబట్టి ఆర్థిక ధనలాభం ఉంది.

పరిహారం :- మీరు మంగళవారం నియమాన్ని పాటించండి. గురువారం నాడు తెల్ల ఆవాలు బెల్లం ఆవుకి ఉదయకాలంలో తినిపించండి.

ధనూరాశి :-

ఈరాశివారికి పంచాగ్ని మధ్య మంలాగా పరిస్థితులు ఉన్నాయి. భయం ఎక్కువ ద్వితీయ శని హాని చేయబోతున్నాడు. గురుడు ధన నష్టం కలిగించ పోతున్నాడు. చతుర్ధ రవి అగౌరవాన్ని ఇస్తే బుద్ధుడి మాత్రం ఇంకా మద్దతు ఇలాగా ఒకటొకటిగా అన్నీ కూడా ఇబ్బందిని కలిగిస్తూనే ఉన్నాయి. అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది. శత్రువులు మిమ్మల్ని ఇబ్బడి ముబ్బడిగా ఒత్తిడికి గురిచేస్తారు. మీకున్నటువంటి అప్పులు తీర్చమని ఒత్తిడి కొంత. మీ చదువు విజ్ఞానము అన్నీ కూడా మూలకు చేరిపోతాయి పైగా అధికారుల చేతగాని విజ్ఞులు చేతగాని మాటలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఒత్తిడి మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఎంత తగ్గి వుంటే అంత మంచిది ఒకప్పుడు మీ ప్రాబల్యం ఎలా ఉండేదో ఇప్పుడు అంతకు అంతా తగ్గిపోయింది. కాబట్టి అనువుకాని సమయంగా మీరు భావించొచ్చు. వారాంతంలో కొంచెం లాభం అవకాశం ఉంది . మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. సౌఖ్య లాభాలను పొందగలుగుతారు. మూలా నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త వహించండి. పూర్వాషాఢ వారికి పరమమిత్రతార అయింది బావుంది ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మిత్ర తారైంది శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- గురుడు జపం చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. ఉదయం సాయం కాలాలలో శివదర్శనం చేయండి.

మకర రాశి :-

ఈ రాశివారికి నేల విడిచిన సాములాగ మీకున్న శక్తియుక్తులన్నీ కూడా పనికిరానివిగా అయిపోతాయి ఒకపక్క పొరపాటు జరిగిందేమోనని బాధ రానున్న విపత్తును ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన ఇదే సమయంలో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడమా స్థానం దాటడమా? అన్ని ప్రక్కల శత్రువులు భయపెట్టే పరిస్థితి ఉంది. కాస్తంత బంధువులు మిత్రులు మిమ్మల్ని చూడ్డం వల్ల మీరు కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. రవి మాత్రమే మీకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి ఉంది. చంద్రుడు కొంచెం మానసిక సౌఖ్యాల కలుగజేస్తాడు మీకు ప్రాణభయం అని పట్టుకున్నది. దాన్నుంచి బయటికి రండి. సంపదల కోసం ఇన్నాళ్లు తాపత్రయపడ్డారు. ఇప్పుడు మీకు కావల్సిన వ్యక్తుల్ని దగ్గర చేర్చుకోండి. దాని వల్ల మీరు మానసిక ధైర్యాన్ని పొందగలుగుతారు. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి మిత్ర తారైంది. చక్కని ఫలితాలున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి భయాందోళనలు ఎక్కువ ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు వారికి సాధన తారైంది మంచి కార్యాలు నెరవేరుతాయి.

పరిష్కారం :- శనికి జపం చేయించండి నువ్వులు దానం ఇవ్వండి నల్లని వస్త్రాల్ని దానం చేయండి.

మహాశివున్ని దర్శించండి.

కుంభరాశి :-

ఈరాశి వారికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది ఒక్క బుధుడు శుక్రుడు మీకు సహకరించే వాళ్లు చంద్రుడు ఒకవేళ సహకరించినా మృత్యువు భయాన్ని వెంటనే కలిగిస్తాడు. ఈ రాశివారికి ఇబ్బందికరమైన రోజులనే చెప్పాలి. బుధవారంనాడు మీరు ఏదైనా ఒక లాభాన్ని పొంద గలరు. అలాగే శుక్రవారం ఏ పనికైనా కలిసి ఒస్తుంది. వ్యయ కుజుని స్థితి వల్ల మీకు స్థిరాస్తి వ్యవహారాల్లో మరికొంచం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధననష్టం స్థానచలనం కూడా ఉంది. మీ జీవితానికి ఒక పరీక్షాకాలం లాంటిది. మీరు తీసుకోబోయే ప్రతి నిర్ణయం వేయబోయే ప్రతి అడుగు పైన మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అణుకువగామెలకువగా ఉండాలి. అయితే మీకు లాభించనున్న కేతువు ద్వారా మీకు ధనలాభం జరగాలి. బుధుడి ద్వారా బంగారం శుక్రుని వల్ల స్త్రీ సౌఖ్యం లభించినప్పటికీ వివాదాస్పదమే అవుతుందని ఇంట్లోని ఇప్పుడు కూడా మీ మాట వినకపోయే వాళ్లు ఎక్కువగా ఉంటారు వారిని కొలిక్కి తీసుకు రావడంలో మీ ప్రయత్నం విఫలమవుతుందని చెప్పాలి. ధనిష్ట మూడు నాలుగు పాదాలు వారికి సాధన తారైంది కాబట్టి విశేష ఫలితాలు ఉన్నాయి. శతభిషం వారికి మాత్రం ప్రత్యక్ తార అవడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పూర్వభద్ర ఒకట్రెండు మ మూడు పాదాలు వారికి క్షేమ తార కాబట్టి శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు.

పరిహారం :-ఈ రాశికి అధిపతి శని. శని స్థితి బాగాలేదు కనుక శనికి బదలుగా చే నువ్వులు దానం చేయండి. రుద్రాభిషేకం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మీన రాశి :-

ఈ రాశివారికి శుభఫలితాలు ఒకదాని వెంట ఒకటి రాబోతున్నాయి. లగ్నంలో రవి బుధులు ఉండడం వల్ల చిక్కులు స్థానచలనం కనిపిస్తున్నాయి. తతిమా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల వీరికి విశేష ధన లాభం ఉంది. ఒక చంద్రుడు వల్లే మృత్యుభయం ఉన్నది. గానీ విశేష ధన లాభం కూడా అతని వల్లే కలగబోతోంది. ఇచ్చిన గౌరవానికి భంగం వాటిల్లకుండా అవకాశం కల్పించిన పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించండి దేనికైనా మాట కట్టుదిట్టం మీకు మీరే చేసుకోవడం చాలా అవసరం. కొన్ని చిక్కులు వాటంతటవే విడిపోయే అవకాశం ఉంది. చంద్ర స్థితి బాగాలేదు. కనుక అనారోగ్య సూచన ఎక్కువగా ఉంది. అది మాత్రం దృష్టిలో పెట్టుకుని మీరు దైవాన్ని నమ్మనని కాదు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోండి. దీర్ఘ రోగులు వ్యాధి గ్రస్తులకు ఇది కొంచెం గడ్డుకాలం లాంటిది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరము. పూర్వాభాద్ర నాలుగో పా దం వారికి క్షేమ తారైంది చాలా బావుంది. ఉత్తరాభాద్ర వారికి విపత్తార కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన కాలము. రేవతి వారికి మాత్రమే సంపత్ తారా ఐంది. ధన లాభం పొందగలుగుతారు.

పరిహారం :- ఈ రాశికి అధిపతి గురిని జపం చేయండి. సమస్యలు వాటంతటవే సర్దుకుంటాయి. దత్త చరిత్ర చదవండి మంచి ఫలితాన్ని ల పొందగలుగుతారు.

Next Story
Share it