అబ్బా.. దాని కోసం వెయిట్‌ చేస్తున్నా.. ఓపిక పట్టండి

By సుభాష్  Published on  3 Feb 2020 12:37 PM GMT
అబ్బా.. దాని కోసం వెయిట్‌ చేస్తున్నా.. ఓపిక పట్టండి

యాంకర్ 'రష్మి' అనేగానే ముందుగా గుర్తుకు వచ్చేది సుడిగాలి సుధీర్‌. వీరిద్దరికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. బుల్లితెరపై వీళ్లిద్దరు చేసే సందడి అంతా ఇంతా కాదు. వీళ్లిద్దరి మధ్య ఎన్నో రూమర్స్‌ కూడా వచ్చాయి. అయితే హీరోయిన్‌గా రష్మి ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక సుధీర్‌ కూడా 'సాఫ్ట్‌ వేర్‌ సుధీర్‌' సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా సరసన ధన్యా బాలకృష్ణ నటించారు. నిజానికి ఈ మూవీలో రష్మికి అవకాశం వచ్చిందట. కాని వరుస టీవీ షోలు ఉండటంతో సమయం లేక ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇక సుడిగాలి సుధీర్‌, రాంప్రసాద్‌, గెటప్‌ శ్రీను ముగ్గురూ హీరోలుగా నటిస్తున్న సినిమా '3 మంకీస్‌'. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రష్మి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, రాంప్రసాద్‌ ముగ్గురు కలిసి పది నిమిషాల పాటు స్కిట్‌ చేశారంటేనే మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తారని, ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తారని చెప్పుకొచ్చింది. ఇదే మ్యాజిక్‌ రెండున్నర గంటల పాటు ఇస్తుంటే పదిరేట్లు మ్యాజిక్‌ జరుగుతోంది. ఇప్పటికే వాళ్లు ఏమిటో ప్రూవ్‌ చేసుకున్నారు.. అంటూ చెప్పుకొచ్చింది రష్మి. వాళ్లు ఈ సినిమా ద్వారా కొత్తగా చూపించబోతున్నారు. అబ్బా.. ఆ మ్యాజిక్‌ చూడడానికి నేను ఎంతో వెయిట్‌ చేస్తున్నాను.. మీరు కూడా ఓపిక పట్టండి అంటూ చెప్పింది.

ఇక 3 మంకీస్‌ గురించి చెప్పాలంటే గాంధీజీ చెప్పినట్లు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే మూడు విషయాలు గుర్తుకు వస్తాయని తెలిపింది. ఈ సినిమాలో ఫస్ట్‌ మంకీ.. ఏం వినడు.. తాను మాట్లాడుతూనే ఉంటాడు.. సుధీర్‌ ఇవన్ని చూస్తాడు.. వింటాడు..ఏం మాట్లాడడు. ఇక శ్రీను మంకీ చూడడానికి ఇష్టపడడు.. ఏం చేసినా ఆ మంకీ మాత్రం చలించడు.. ఆపాత్రలో నుంచి బయటకు రానేరాడు.. అని తెలిపింది.

సుధీర్‌ ఈ సినిమాలో అబ్బా ఏం యాక్ట్‌ చేశాడురా వీడు.. అనిపించే మంకీ ఎవరైనా ఉన్నారంటే అది సుడిగాలి సుధీరేనని చెప్పాలి. చైల్డిస్ట్‌ మెంటాలిటీ రాంప్రసాద్‌, సెన్సిటివ్‌ మెంటాలిటీ శ్రీను.. అంటూ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇలా ఒక్కొక్కరి గురించి వివరిస్తూ తెలిపింది యాంకర్ రష్మి.

Three Monkeys

త్వరలో సుధీర్, నేను సినిమా చేస్తాం

త్వరలో సుధీర్, నేను మంచి సినిమా చేస్తామని చెప్పుకొచ్చింది రష్మి. ఈ రోజు మేం ఇలా ఉన్నామంటే అది ఆడియన్స్‌ వల్లేనని చెప్పింది రష్మి. నేచురల్‌గా మంచి సబ్జెక్టును ఎంచుకుని ప్రేక్షకులకు నచ్చిన స్క్రిప్ట్ చేయాలనే సుధీర్‌తో సినిమాను వాయిదా వేసుకుంటూ వస్తున్నా.. మా ఇద్దరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. దాన్ని వృధా చేసుకోకూడదు అంటే ఏది పడితే అది చేయకూడదు. ఎందుకంటే మా ఇద్దరిపై ప్రేక్షకుల్లో చాలా హోప్స్‌ ఉన్నాయి. ఏది పడితే అది చేసేస్తే ఆ హోప్స్ పోతాయి.. అంటూ చెప్పింది యాంకర్ రష్మి.

Next Story