జూన్‌ 28 ఆదివారం నుంచి జూలై 4 శ‌నివారం వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 2:41 AM GMT
జూన్‌ 28 ఆదివారం నుంచి జూలై 4 శ‌నివారం వ‌ర‌కు

మేష రాశి :

ఈ రాశి వారికి సంపద విశేషధనం భూషణాదులు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యయ మందున్న కుజుడు కష్టాన్ని కలిగిస్తున్నప్పటికీ శుక్రుడు సానుకూలత రాహు అనుకూలత వీరికి కలిసి వస్తోంది. చంద్రుడు విశేష ధన సంపదలను కలిగించ బోతున్నాడు. ఈ వారంలో వీరికి గురు అనుకూలత లేకపోవడమూ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువవుతుంది. బుధుడు కూడా శత్రు పీడని కలిగిస్తున్నాడు. రాజకీయ వ్యవహారాల్లో వీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉద్యోగము వ్యాపారము ఈ రెండిటి వీరు తగిన ఫలితాన్ని పొందలేక నిర్ణయం తీసుకోలేక రాజకీయ వత్తిళ్లకు లొంగి వెనుకడుగు వేయవలసి వస్తుంది. అంతర్గత శత్రువులు వీరిని మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి వీరు కష్టాలెక్కువగా అనుభూతిని పొందబోతున్నారు శుక్రుని అనుకూలత కొద్దీ వారం మధ్యలో కొంత ఆర్థిక సామాజిక లాభాన్ని పొందగలుగుతారు. అశ్వినీ నక్షత్ర జాతకులకు విపత్తార యింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది విశేష సంపదని పొందగలుగుతారు. కృత్తికా నక్షత్ర జాతక కులకు జన్మ తారైంది ఆరోగ్య విషయంలోని ఆర్థిక విషయంలోని మాంద్యాన్ని పొందుతారు.

పరిహారం : గురువారం నియమాన్ని పాటించండి. దక్షిణామూర్తి స్తోత్రము చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించండి. పూర్ణిమ నాడు గురువుని దర్శించండి.

వృషభ రాశి :

ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనలాభము ఆభరణాలాభము వీరిని ఉత్సాహపరిచి మరింత ముందుకు తీసుకెళతాయి. రవి మాత్రమే కొద్దిపాటి ఆందోళనలు కలిగిస్తాడు. దాన్ని తట్టుకునే స్థితి అవసరం. లాభము నందున్న కుజుడు ఆకస్మిక ధనలాభాన్ని బుధుడు దానికి తోడుగా గురుడు విశేష సంపదల్ని ఇచ్చే అవకాశం ఉంది. పాతబాకీలు వసూలు కావడం శరీర సౌఖ్యము ఇంట్లోని బయట కూడా వీరికి మంచి మర్యాద గౌరవం లభిస్తాయి. వివాహం కావల్సినటువంటి వారికి చాలా సానుకూలమైన స్థితి ఉన్నది. అన్నదమ్ములతో సఖ్యత ఆనందము పొందుతారు. కుటుంబ పరంగానే కాదు సమాజపరంగా వీరి మాటకు చెల్లుబాటు ఎక్కువ లభిస్తుంది. ధనాదాయం కూడా ఆనందింపచేస్తుంది. గౌరవ మర్యాదలతో పాటు ఉన్నత ఉద్యోగం గాని వ్యాపారంలో కాని అభివృద్ధిని సాధించబోతున్నారు. కానీ తొమ్మిదవ ఇంట్లో ఉన్న శని అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. శరీరం ఎడమ భాగంలో ఇబ్బందిపడే అవకాశం ఉంది. వాహనములపే ప్రయాణం జాగ్రత్త వహించండి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రోహిణి నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది సంపదలాభ. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి మిత్ర తారైంది చాలా సానుకూలత ఉంది.

పరిహారం : శనికి జపం చేయండి నల్ల నువ్వులు నల్ల వస్తం నువ్వుల నూనె దానం చేయించండి లేదా దేవాలయంలో నూనె దీపం వెలిగించండి. రాహు కేతువులు దర్శించండి.

మిథున రాశి :

ఈరాశి వారికి అనారోగ్యము మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందుల్ని కలగజేస్తున్నాయి. క్రమక్రమంగా వీరు జాతకము వెనుకడుగు వేస్తోంది. ఈ వారంలో మరీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ముందుగానే జాగ్రత్త వహించడం చాలా అవసరం. సంతోషము ఒక్క కుజుడు మాత్రమే ఇవ్వగలడు. గ్రహముల అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అష్టమ శని ప్రభావము వీరిపైనే చాలా ఎక్కువగా ఉంది. ఆత్మ న్యూనత పెరిగిపోయి ఎందుకురా ఈ జీవితం అనే స్థితికి వస్తారు. పది మంది చేత అవమానించ బడతారు ముఖంచాటు చేయ బడతారు. వ్యయ మందున్నా శుక్రుని సానుకూలత తప్ప వేరొక గ్రహానుకూలత వీరికి లేదు. దీనివల్ల వీరు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. సమాజంలో కూడా వీరికి గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పోయినట్టు అయిపోతుంది. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి మిత్ర తారైంది చాలా సానుకూలత ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు నైధన తారైంది పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి సాధన తారైంది సానుకూలత చాలా ఎక్కువగా ఉంది.

పరిహారం : గ్రహ మఖం రుద్రాభిషేకం చేయించుకోండి. భవిష్యత్తు కోసం ఆలోచించి పూజలు పునస్కారాలు దీక్షలు నియమాలు పాటించటం అవసరం.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికిధన లాభము సౌఖ్యము ధైర్యము వీరిని ముందుకు నడిపిస్తాయి. ఈ వారం వీరికి అనుకూల పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. రవి ధన సంపాదన పోగొడుతున్నాడు. కుజుడు ద్రవ్యహానిని సూచిస్తున్నాడు. గురుబలం బాగుంది కనుక వీరు సప్తమ గురుని అనుఘగ్రహం చేసుకుంటున్నారు. శుక్రుడు కూడా వీరికి లాభాన్ని చేకూరుస్తాడు. రాహు కేతువులు కుజుడు బుధుడు మానసిక ఒత్తిళ్లను పెంచి ఉద్యోగ ధర్మాన్ని చెయ్యలేక వ్యాపారాన్ని కూడా సానుకూలం చేసుకోలేక ఒకడుగు వెనక్కి వేసి అవకాశం ప్రతి పనిలోని ఎవరో ఒకరు అడ్డుతగులుతూ ఉండటం ఏదో ఒక కారణంతో వెనుకబడుతూ ఉంటుంది. మానసికంగా కొంచెం ధైర్యం వహించడం చాలా అవసరం. మీరు నమ్ముకున్న సమాజం గాని మిత్రులు గానీ మీకు అనుకూలించే పరిస్థితులు కాదు. పూర్వ గురువులని ఆశ్రయించండి వారి ద్వారా మీకు అనుకూలత పెరుగుతుంది. పునర్వసు నాలుగో పాదం వారికి సాధన తారైంది చక్కగా అన్ని నెరవేరతాయి. పుష్యమీ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది సానుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం బావుంటుంది.

పరిహారం : ఈ జాతకులకు గురుబలం పెరగడానికి గురు పూజ చేయండి. శనికి జపం చేయించండి సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శించండి.

సింహరాశి :

ఈ రాశివారికి గ్రహ అనుకూల పరంపర కొనసాగుతోంది. ధనలాభము ఆనందము సంతోషము వీరిని ఎక్కువ ఉత్సాహంతో ముందుకు నడిపిస్తున్నాయి. కుజుని అష్టమ స్థితి కుటుంబంలో ఎవరో ఒకరికి శస్త్రచికిత్స వరకు అవసరం పడుతున్నది. అలాగే గురుని ప్రభావం ఆలోచనా మార్గాన్ని మారుస్తాడు. బుధ శుక్రుల స్థితి సంతోషమో ఆనందమో వీరిని ముందుకు నడిపిస్తాయి. విశేష ధనాన్ని ఆర్జిస్తారు ఈ కాలంలో. ఎంత రాబడి అయితే ఉందో అంతకు మించిన ధన వ్యయము శస్త్రచికిత్స ద్వారా అనారోగ్యాల ద్వారా పోయే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగతంగా ఆనందం మిగులుతుంది తప్ప కుటుంబపరమైన ఆనందాలు తగ్గుతాయి షష్ట శని మీకు విశిష్ట ధనాన్ని మీ కళ్ల ముందుకి తెచ్చి పెట్టినట్టుగా ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తున్నాడు. ఆరవ ఇంట్లో గురుడు మీ ఆలోచనలకు ప్రతికూలతను కలిగించి కార్యభంగాన్ని సూచిస్తున్నాడు. భాగ్య శుక్రుడు మీకు కార్యానుకూలత చేసి ధైర్యాన్ని ఇస్తాడు. మఖ నక్షత్ర జాతకులకు విపత్తు తార అయింది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పుబ్బ నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది విశేష ధనాన్నీ పొందుతారు. ఉత్తర ఒకటో పాదం వారికి జన్మ తారైంది ఆరోగ్యం జాగ్రత్త వహించండి.

పరిహారం : మంగళవారం నియమాన్ని పాటించండి ఆంజనేయస్వామి పూజించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. అమ్మవారికి ప్రీతిగా ఖడ్గమాలా పారాయణం చేయించండి.

కన్యా రాశి :

ఈ రాశివారికి కార్య జయము ధన లాభము సంతోషం ఇవన్నీ వీరిని చాలా ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయి. ఐదవ ఇంట్లో ఉన్న శని సంతానానికి ఇబ్బంది కలిగిస్తున్నాడు తప్ప తతిమావన్ని బానే ఉంటాయి. గురుడు విశేష గౌరవంతో పాటు సంపదని కలిగిస్తే బుధుడు సంతోషాన్ని విపరీతంగా కలిగిస్తాడు. కుజుడు చిన్న ఆటంకాలను కలిగించినప్పటికీ శుక్రుడు స్థిర ఆదాయాన్ని మీకు పెంపు చేసే అవకాశం ఉంది. రాహు కేతువులు మాత్రము ధన వ్యయాన్ని గౌరవ భంగాన్ని సూచిస్తున్నారు కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. వ్యాపారుల్లో ఆందోళనకు గురి కాకుండా పెట్టుబడి మాత్రం ఎక్కువ పెట్టకండి. కోర్టు వ్యవహారాలు గాని భూ సంబంధ వ్యవహారాలు కానీ మీకు నెరవేరవు. క్రమంగా మార్పులు రాబోతున్నాయి. మీకు రవి కార్య జయాన్ని సూచిస్తున్నాడు అంటే మీలో ఆత్మ స్థైర్యము మనో ధైర్యము పెరిగిందనే చెప్పాలి. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మ తారైంది ప్రతికూలతలు అనారోగ్యం ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయ్యింది కార్య సానుకూలత ఉంది. చిత్ర ఒకటి రెండు పాదాలు వారికి మిత్రతార అయింది చాలా అనుకూలంగా ఈ వారం గడుస్తుంది.

పరిహారం : కుటుంబ అనుకూలత కోసం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అర్చన చేయించండి. ఖడ్గ మాల పారాయణ లలితా సహస్రనామ పారాయణ మంచి ఫలితాల్ని ఇస్తాయి. మంగళవారం నియమాన్ని పాటించండి.

తులా రాశి :

ఈ రాశివారికి కుజుడు శుక్రుడు అనుకూలత కలిగించి ముందుకు నడిపిస్తారు. కానీ ధనవ్యయము ద్రవ్య నష్టము శత్రు వృద్ధి మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగ్య స్థానాల్లో ఉన్న రవి బుధ రాహులు కష్టాన్ని ,ద్రవ్య నష్టాన్ని, శత్రు వృద్ధిని కలిగిస్తున్నారు. వీటిని సానుకూల పరుచుకోవడానికి మౌనం మాత్రమే తరుణోపాయం. ప్రతి పనిలో మీకుండే అలవాటైన దూకుడు స్వభావాన్ని తగ్గించండి. వారం మధ్యలో ఆర్థికంగా పుంజుకునేందుకు అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో ఉన్న శుకుడు మీకు స్థిరాస్తుల్ని ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తున్నాడు. అర్థాష్టమ శని ప్రభావం మీపై ఉంది కాబట్టి ఎందుకైనా మంచిది ఒకసారి వైద్యులను సంప్రదించి ఉదర రోగము పరీక్ష చేయించుకోండి. హృద్రోగానికి కూడా అవకాశం ఉంది. బిపి, షుగర్ పరీక్షలను చేయించుకోవడం చాలా అవసరం. తృతీయ ముందున్న కేతువు మీకు సంపదని కొంతవరకు చేకూర్చి ఆనంద పరుస్తాడు. చిత్ర మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయింది చాలా సానుకూలత ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు నైధన తారైంది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి సాధన తారైంది కార్యసాధన చాలా చక్కగా జరుగుతుంది.

పరిహారం : బుధ గురులకు జపాలు చేయించండి. నానబెట్టిన పెసలు బుధవారం నాడు ఆవుకి బెల్లంతో తినిపించండి. గురు చరిత్రని చదవండి.

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి అనుకున్న పనులు నెరవేరే అవకాశం కొద్దిగా కనిపిస్తోంది అష్టమంలో ఉన్న రవి రాహువులు అనారోగ్యాన్ని ధన వ్యయాన్ని సూచిస్తున్నారు. కుజుడు శత్రు మూల భయాన్ని కలిగిస్తున్నాడు అయితే బుద్ధుడు ఇష్ట పూర్తిని కలిగిస్తాడు కాస్త ఆలోచించి నిదానంగా అడుగు వేస్తే మీ పనులలో కొంత సానుకూలత ఉంటుంది. సప్తమ మందున్న శుక్రుడు అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు అలాగే రవి అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు.బమీకు రెండు రకాల ప్రతికూలతలు వెన్నునొప్పి లేదా వెన్ను కింది భాగంలో ఎక్కడైనా అనారోగ్యాన్ని సూచించే అవకాశాలున్నాయి. తృతీయ శని మీకు ధనలాభం సూచిస్తుంటే గురుడు మాత్రము మానసిక కష్టాన్ని కలిగిస్తాడు. దూరపు దగ్గర బంధువుల్ని కూడా మరింత దూరం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నాల్గవ పాదం వారికి సాధన తారైంది కార్య సానుకూలత ఎక్కువగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్టా నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది. అనుకూలత ఎక్కువగా ఉంది విశేష ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : శుక్రునికి జపం చేయించండి శుక్రవార నియమాన్ని పాటించండి లలితా సహస్రనామ పారాయణ అనుకూలిస్తుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రము రుద్రాభిషేకము మీకు మంచి ఫలితాల్ని ఇస్తాయి.

ధనూరాశి :

ఈ రాశివారికి ధనలాభం ఉంది కానీ సుఖ సౌఖ్యాదులు తక్కువగానే ఉన్నాయి. రవి సప్తమంలో ఉండటం వల్ల కుటుంబంలో పెద్దకి మహా విచారం కలుగుతుంది. దానివల్ల స్థిరాస్తిని పూర్తిగా పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది. షష్ఠ స్థానం లో ఉన్న శుక్రుడు వీరికి ప్రతికూలంగా పనిచేస్తున్నాడు. తద్వారా అపకీర్తి భయం వీరికి వెన్నంటుతుంది. అది స్త్రీ మూలకంగా ఉండవచ్చు. కుజుడు వీరికి చతుర్ధ స్థానాల్లో ఉండడం వల్ల శత్రువుల బాధ ఒక్కసారిగా విరుచుకు పడుతున్నట్టు అవుతుంది. అయితే బుధ గురుల అనుకూలత స్థిరత్వాన్ని ఇస్తూ చక్కని ఆలోచన వల్ల వీరు లబ్దిని పొందే అవకాశం ఉంది. ద్వితీయ శని ప్రభావం చేత ఆర్థికపరమైన ఇబ్బందులే కాదు అనవసరంగా ధనాన్ని పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ వారమంతా మీరు తగు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లడం వల్ల కొంత చెడు ఫలితాల్ని తగ్గించుకునే అవకాశం మాత్రమే కనిపిస్తున్నది. మూలా నక్షత్ర జాతకులకు విపత్తార యింది ప్రతికూలతలు ఎక్కువ . పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది సానుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం జాతకులకు అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ద్వితీయ ముందున్న శనికి జపం చేయించడమూ నల్ల నువ్వులు నల్ల వస్త్రము నువ్వుల నూనె దానం చేయించండి. దేవాలయంలో నువ్వుల నూనె దీపం పెట్టించండి. గురుడికి ప్రదక్షిణలు చేస్తూ నమస్కరించండి.

మకర రాశి :

ఈ రాశి వారికి శత్రునాశము సకల భోగాలు బంధు దర్శనము వీరికి గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాయి. ఆరవ ఇంట్లో ఉన్న రవి బుధ రాహులు సుఖ జీవనాన్ని అలంకార ప్రాప్తిని ఇచ్చి ఆనందానికి అవధులు లేనట్లుగా చేస్తారు. లగ్నంలో ఉన్న గురుడు స్థానచలనానికి సూచిస్తున్నాడు కాబట్టి ఊహించని విధంగా మీకు స్థానం మార్పు రావచ్చు. అది ఉద్యోగం వళ్లగానీ వ్యాపారాల వల్ల గాని అయితే అది లాభాన్ని చేకూర్చే ప్రయాణమే అవుతుంది. శని మాత్రమే లగ్నంలో ముందున్నాడు గనుక గొప్ప విపత్తును మీకు ఇవ్వబోతున్నాడు. అలాగే దానికి సహకారంగా కేతువు ప్రభావం కూడా ఉంటుంది. అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకుని గౌరవ మర్యాదలతో పాటు ధనాన్ని కూడా నష్టపోయే అవకాశం లేకపోలేదు. బంధు దర్శనము ఈ విపత్తు నుండి బయటికి లాగుతుంది ఆ సమయంలో మీ యొక్క బలము శక్తి సామర్థ్యాలన్నీ బయటపడతాయి. సకల భోగాన్ని ఈవారంలో పొంది గౌరవమైనటువంటి పేరును కూడా సంపాదించుకునే అవకాశం మీకు ఉంది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త వహించండి. శ్రవణ నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది సానుకూలంగా ఉన్నది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి మిత్రతార అయింది చాలా మంచి ఫలితాల్ని పొందగలుగుతున్నారు.

పరిహారం : గురు దర్శనము సన్యాసి దర్శనము మీకు లాభాన్ని చేకూరుస్తుంది. అన్నదానం విశేషమైన ఫలితాన్ని ఇచ్చి ఆటంకాల నుంచి బయటికి లాగుతుంది. ప్రతిరోజూ నవగ్రహ దర్శనం చేయండి.

కుంభ రాశి :

ఈ రాశి వారికి చాలా హెచ్చరికలే ఉన్నాయి. ఈ వారంలో మనోధైర్యము ఆత్మస్థైర్యము ఉంటేగానీ మీరు ముందుకు సాగలేరు. మీ ఆలోచనలన్నీ కూడా పరులకు అనుకూలంగా మారిపోతాయి. మీ మీద మీరు శక్తి సామర్థ్యాల్ని కలిగి ఉండరు. మీ సొంత తెలివి తేటలు మీకు వినియోగించుకోలేని స్థితిలో ఉంటారు. అన్ని రకాల ఇబ్బందులు ఒకేసారి మీకు పట్టి ఉన్నాయి. మీ కుటుంబ భాగస్వామి ధర్మపత్ని ద్వారా మాత్రమే మీరు కొంత ఊరటని పొందగలుగుతారు. ఆమె చెప్పినట్లుగా మీరు ప్రవర్తిస్తే ఈ వారంలో కాస్తంత మనశ్శాంతి లభిస్తుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మహా భయం వైపు రాజదండన వైపు నడిపిస్తాయి. ఒకానొక సమయంలో మీకు జీవితం మీద విరక్తి కూడా కలిగిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఆర్థికంగానూ మిమ్మల్ని మీ పరిస్థితులు కుంగదీస్తాయి. మీ మాటే మీకు శత్రువై నిలుస్తుంది. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి మిత్రతార అయింది చాలా సానుకూలంగా ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు మాత్రము నైధన తార అయ్యింది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి మాత్రము సాధన తార అయింది కొంత ఉపశమనం లభి లభిస్తుంది.

పరిహారం : నవగ్రహములకు ప్రదక్షిణలు చేయండి. గ్రహ మఖం చేయించుకోండి. రుద్రాభిషేకం చేయించుకోండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి యోగా చేయండి

మీన రాశి :

ఈ రాశివారికి విశేష ధన లాభాదులు ముందులో కనిపిస్తాయి కానీ అవి నిలవవు. మీకు రవి ప్రతికూలత చేత చతుర్థ మందు ఉండటము లగ్నంలో కుజుడుండడం రెండు కూడా విచారాన్ని అగౌరవాన్ని సూచిస్తున్నాయి. పైగా మీరు ఎంత శత్రుజయం పొందబోతున్నారో ఎంత ధన లాభం పొందబోతున్నారో అంత గౌరవ భంగం కూడా మనకి చతుర్ధి మందున్నటువంటి రాహు వల్ల ఏర్పడిపోతుంది. చతుర్థంలో ఉన్న బుధుడు మీకు శత్రువుల మీద జయం సాధిస్తాడు కానీ అదే కేతువు రాజ్యంలో ఉన్నాడు. కేతు మీకు మళ్లీ ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ వారంలో మీరు అన్నింటి సానుకూల పరుచుకుంటారు అని చెప్పడానికైతే లేదు. కానీ కొంత ధన లాభాన్ని గురుడు తాలూకా ప్రభావం చేత పొందుతారు. లగ్నంలో ఉన్న కుజుడు మీకు మహా విచారాన్ని కలిగిస్తాడు. ఈ పరిస్థితులను మీరు అధిగమించడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయవలసిన స్థితి ఉంది . ముఖ్యంగా మీ గౌరవ భంగం కాకుండా చూసుకోండి. పూర్వాభాద్ర నాల్గవ పాదం వారికి సాధన తారైంది కాబట్టి సానుకూల ఎక్కువగా ఉంది. ఉత్తరాభాద్ర వారికి ప్రత్యక్తారైంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది పరిస్థితులు సానుకూలంగానే కనిపిస్తున్నాయి.

పరిహారం : కుజ దోష నివారణార్థం మీరు సుబ్రహ్మణ్య పూజ చేయించండి. మారేడు దళాలతో దేవి త్రిశతి పూజ చేయించండి. రుద్రాభిషేకం మంచి ఫలితాల్ని సూచిస్తుంది.

Next Story