మేష రాశి :

ఈ రాశివారికి సంపదలు చక్కని భోజన సౌకర్యం ధనము ఆభరణములు అన్ని కూడా చక్కగా  సమయానికి మీరు ఎక్కడ ఉన్నా  కావలసిన సంపదలన్నీ కూడా దగ్గరికి వచ్చి చేరుతాయి. ఈ వారంలో ఇంతకు ముందుకంటే చక్కని ఫలితాన్ని పొందుతుంటారు. కానీ బుధ గురుల స్థితి శని కేతు స్థితి బాగోలేకపోవడం వల్ల శ్రమకు తగిన ఫలితం లభించదు. శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అనుకోకుండా ధనవ్యయము ఎక్కువగా జరిగిపోతుంది. ఇంత మంచి వారాన్ని జాగ్రత్తగా  వినియోగించుకుంటే ఉత్తరోత్తర మంచి ఫలితాలు మీకు అందనున్నాయి. 8,9 తేదీలలో శుభవార్త వింటారు. 19, 20 తేదీలలో  ఆకస్మిక ధనలాభం ఉంది.అశ్విని నక్షత్ర జాతకులకు మిత్ర తార అయ్యింది సత్ఫలితాలు  పొందబోతున్నారు. భరణీ నక్షత్ర జాతకులకు నైధన తారవ్వడం వల్ల వ్యతిరేక ఫలితాలు సమకూరుతున్నాయి. కృత్తిక  ఒకటో పాదం వారికి మాత్రమే సాధన తారైంది ఫలిత అంశాలు చక్కగా పొందగలుగుతారు. రాశివారికి కాలసర్ప యోగం సంపూర్ణంగా వర్తిస్తుంది.
పరిహారం : 19 వ తేదీ మాసశివరాత్రి శివునికి అభిషేకం చేయించండి. పదహారో తేదీ ఏకాదశి నాడు ఏదన్నా వ్రతం చేయండి. 21 వ తేదీ సూర్య గ్రహణాన్ని గుర్తు పెట్టుకోండి.

వృషభ రాశి :

ఈ రాశివారికి ధనలాభం ఆభరణ శరీర సౌఖ్యాదులు అన్ని ఉన్నాయి. గానీ మానసిక దుర్భలత్వం మీలో చోటు చేసుకుంటుంది. శని రాహు కేతువుల ప్రభావంతో ఒక అనారోగ్యము అకారణ కలహము వస్తువును పోగొట్టే స్థితి కనిపిస్తోంది. సంతోషాన్ని పూర్తిగా అనుభవిస్తూ ఉన్నట్లయితే మీకు మంచి మాటలు మంచి వ్యక్తులు పరిచయాలు జరిగి మీలో కొత్త ఉత్సాహం మాత్రం  కలుగుతుంది. వ్యసనాల ద్వారా ధనవ్యయం జరుగుతుంది. కానీ చక్కని శరీర సౌఖ్యాన్ని పొందగలుగుతారు. బుధ గురులు మీకు అనుకూలించడం చేత కుజుని ప్రభావం  పాత బాకీలు వసూలవడం ఏదైనా కోర్టు వ్యవహారంలో లబ్ధి పొందడం అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో మీరు గతంలో వాయిదా వేసుకున్న పనులు ఇప్పుడు నెరవేరుతాయి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది మంచి ఫలితాలున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రం ప్రత్యక్ తారైంది ఆలోచించి అడుగు వేయండి. మృగశిర  ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తార ఐంది సత్ఫలితాలు తొందరగా పొందగలుగుతారు.
పరిహారం : వీరు కాలసర్ప యోగ దోష నివారణార్థం  తప్పకుండా రాహుకేతువుల పూజ చేయించండి. మినుగులు ఉలవలు దానం చేయండి సూర్య నమస్కారాలు మీరు స్వయంగా చేయండి.

మిధున రాశి :

ఈ రాశివారికి గత వారం మీదట పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయి. ఉత్సాహము సౌఖ్యము పెరుగుతున్నాయి. కానీ కుజుని ప్రేరణ వల్ల ధన వ్యయం పెరిగింది. అంతేకాదు గురుడు కూడా  ధన వ్యయాన్ని సూచిస్తున్నాడు. శని మీఇంట్లో ఒక వ్యక్తికి  పూర్తిగా అనారోగ్యాన్ని నూటికి నూరు శాతం సూచిస్తున్నాడు.  స్వక్షేత్రంలో ఉండి కూడా బుధుడులేనిపోని చిక్కులకు కారకుడౌతున్నాడు. రాహు కేతువులు  శత్రువృద్ధి  ధన వ్యయాన్ని కల్పిస్తున్నారు. ఉద్యోగ వ్యాపార భంగములు పెద్దవారితో వ్యవహారంలో అననుకూలత ద్రవ్య హాని ఇవన్నీ కూడా వున్నాయి. అంతేకాదు మీకు ప్రతికూలమైన వార్తలు వినే అవకాశం గూడా ఎక్కువగా ఉంది. ఈ వారం స్థానచలనం కూడా సూచించబడుతుంది. భయాందోళనలు తగ్గించుకోండి. ధన వ్యయం కూడా తగ్గించండి. భేషజాలకు పోకుండా ఉంటే కొంతవరకు సుఖ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఖర్చులు పెరిగితే మానసిక దుర్బలత్వం కలిగే అవకాశం ఉంది. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి క్షేమ తారైంది కాబట్టి ఫలితాలు చాలా బాగున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు విపత్తు తార అయ్యింది కాబట్టి ప్రతికూల ఫలితాలే కనిపిస్తున్నాయి.  పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్తార అయ్యింది.  ఆర్థిక లాభం పొందబోతున్నారు.
పరిహారం :  అష్టమ శని దోష నివారణార్థం శనికి జపము నువ్వులు నల్లని వస్త్రము దానం చేయండి. గురు చరిత్రని పారాయణ చేయండి సత్ఫలితాలను పొందగలుగుతారు.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికి ధనలాభం సౌఖ్యము సుఖజీవనం సమృద్ధిగా ఉన్నాయి. కానీ  శని కుజ ప్రభావం చేత మనో వ్యాధి శస్త్ర చికిత్స కించిత్ విచారం పొందనున్నారు. చేసిన పనిలో సంతృప్తి తాము పొందలేక ఇతరుల చేత విమర్శించు బడి అసంతృప్తిని మనో వ్యాధిని పొందనున్నారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. సప్తమంలో ఉన్న గురుడు మీకు అవసరానికి తగిన ధనాన్ని చేకూరిస్తే శని మాత్రం సకాలంలో దాన్ని రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఏదైనా  మీకీ వారంలో చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. దీర్ఘ వ్యాధి ఉన్నవారు వైద్యులను తరచూ సంప్రదించడం మంచిది. కోర్టు లావాదేవీలు ఉన్నవారు గాని లేదా అప్పులు తాళలేక ఉన్నవారుగానీ ఆచి తూచి అడుగు వేయండి. భూ సంబంధ వ్యవహారాలు కూడా వాయిదాలు పడుతాయి. మీకు రావల్సినటువంటివి అన్నీ కొద్ది రోజులపాటు వాయిదా పడతాయి. పునర్వసు నాలుగో పాదం వారికి సంపత్తార ఐంది ఫలితాలు బాగున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు జన్మతార అయ్యింది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది శుభ ఫలితాలని పొందగలుగుతారు.
పరిహారం : శని గురులకు జపం చేయించండి. ప్రతిరోజూ శివాలయంలో శివుడ్ని నందీశ్వరుణ్ణి దర్శించండి. పదిహేనో తేదీ సూర్య నమస్కారాలు చేయించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

సింహ రాశి :

వీరికి ధనలాభం సౌఖ్యం ఆనందం సంతోష పరంపరలు కొనసాగుతూనే ఉన్నాయి .  వీరు ఎన్నడూ లేనంత ధనాన్ని కళ్ల చూసేస్తారు. కుటుంబంలోను వ్యవహారంలోను కార్య క్షేత్రంలోను కార్య వర్గాల్లోను అధికారులు దగ్గర కూడా అత్యంత సుఖప్రదమైన ఆనందదాయకమైన వ్యవహర్తగా పేరు సంపాదిస్తారు. కుజ ప్రభావం చేత చిన్నిచిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ పనులన్ని కూడా చివరికి మంచి ఫలితాన్ని ఇస్తాయి.  ఆచి తూచి అడుగు వేయండి ఆలోచనలు అనేక విధాలుగా సాగిపోతూ ఉంటాయి కానీ బుధ ప్రభావం చేతను చంద్ర ప్రభావం చేతను మీరు కార్యదక్షలుగా నిలవగలగాలి. మీకు ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్య లేదా వాహన ద్వారా ఇబ్బంది వెన్నాడుతూనే ఉంటుంది.  జాగ్రత్త హించండి సొంత వాహనదారులైతే వాహనాన్ని మీరు నడపవలదు. మున్ముందు మీకు అధిక ధనవ్యయం మనది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతోంది. కుటుంబంలో చిన్నచిన్న అనుకూలతలు తక్కువ అవుతాయి. మఖ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. పుబ్బా నక్షత్ర జాతకులకు నైధన తార అయింది. ఫలితం  వ్యతిరిక్తంగా ఉంది.  ఉత్తర ఒకటో పాదం వారికి సాధన తారైంది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి.
పరిహారం : కుజుడికి జపం చేయించండి మంగళవారం నాడు సుబ్రమణ్యేశ్వరస్వామి పూజ చేయించండి. నిత్యము ఆంజనేయస్వామిని స్మరించు కోండి.

కన్యారాశి :

ఈ రాశివారు కార్య జయము సంతోషము సంపద లాభము పొందుతూ చాలా ఉత్సాహంగా ఈ వారాన్ని అనుభూతి చెంద గలుగుతారు. చిన్ని చిన్న అవమానాల్ని తట్టుకుంటే చాలు మీకు ధనప్రాప్తి   కుటుంబ సహకారాన్ని కూడా మీరు పొందబోతున్నారు. సంతానానికి ఇబ్బందులు మాత్రము ఉన్నాయి జాగ్రత్త వహించండి. స్థిరాస్తి వ్యవహారాలు రావాల్సిన చేసుకోవలసిన పనులు భూ సంబంధమైన వ్యవహారాలు కచ్చితంగా సకాలంలో నెరవేరతాయి. మీరు వారంలో చాలా ధైర్యంగా చాలా సంతోషంగా మీ పనులన్నింటిలో నెరవేర్చుకుంటూ ముందుకు పోగలుగుతారు. అంతేకాదు  విశేష ధన సంపదలను శాశ్వత పథకాన్ని రచించుకున్న ట్లయితే వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నతిని మీరు అతి తక్కువ కాలంలో పొందుతారు.  మానసిక ఆందోళనలు మాత్రం మీకు తప్పవు. ఏదో ఒక రకంగా మీరు సర్ది చెప్పుకోవడమూ కుటుంబం దగ్గర జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. హస్తా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తారైంది ఫలితాలు బాగుంటాయి.
పరిహారం : మీరు మానసిక ఆందోళ తగ్గడం కోసం చంద్రుడ్ని అర్చన చేయండి. చంద్ర  ప్రీతిపాత్రంగా బియ్యం దానం చేయండి సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించండి.

తులా రాశి :

ఈ రాశివారికి స్థిర ఆదాయం పెరుగుతుంది. భూ సంపదలు కూడా సమకూరితే మీకు ఎప్పటినుంచో రావాల్సినటువంటి బాకీలు వసూలవడం లేదా తత్సంబంధమైన  వ్యవహారం ఒక సర్దుబాటు రీతిలో జరిగి మీకు ఆదాయం చేతికి అందుతుంది. విశేష ధన లాభాన్ని సూచించి నప్పటికీ కూడా అకారణంగా ధన వ్యయం  కనిపిస్తుంది. శత్రు మూల భయం మిమ్మల్ని వెంటాడుతుంది.  ఇతః పూర్వం మీరు చేసిన చిన్నచిన్న పొరపాట్లే ఇలాంటి వాట్లకి కారణ భూతం అవుతోంది. వాటిని సరిదిద్దుకోవడం కోసం తటస్థ విధానాన్ని అవలంబించండి. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఈ వారంలో ఉన్నాయి. తద్వారా ధన నష్టం కూడా  ఉంది. మీకు ఉదర రోగగ్రస్తులై నట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. ఉద్యోగ వ్యవహార విషయాల్లో మిమ్మల్ని మీరు నిగ్రహించు కున్నట్లైతే మంచి ఫలితాన్ని పొందుతూ ముందుకు సాగ గలుగుతారు. చిత్ర మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తారైంది చాలా సత్ఫలితాలను పొందగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులకు విపత్తు తార అయ్యింది కాబట్టి చాలా వ్యతిరిక్తంగా ఉన్నాయి. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్తు తార అయింది కాబట్టి ధన లాభం చేకూర్చ బడుతుంది.
పరిహారం : అర్ధాష్టమ శని ప్రభావం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. శనికి జపం చేయించండి. నువ్వులు నూనె నల్లని వస్త్రాలను దానం చేయండి. పదిహేనో తేదీనాడు వీలైతే పితృదేవతలకి ప్రీతిగా దానధర్మాలు  చేయించండి.

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి విశేష ధన లాభము అనుకున్న పనులు పూర్తవడమే మిక్కిలి ప్రయోజనకరంగా ఉంది . అయితే అనారోగ్యము శత్రుపీడ ఇవి మాత్రము మిమ్మల్ని మానసికంగా శారీరికంగా వెనక్కి లాగేస్తాయి. చాలా పనులను మీరు చెయ్యాలని సంకల్పించు కుంటారు కానీ అవన్నీ కూడా  కుజ గురులు కారణముగా  చాలా పనులు వాయిదా పడుతూ ఉంటాయి . అకారణంగా మీరు ఇతరులతో వాదించాల్సి వస్తుంది. అవమాన పడే అవకాశం కూడా ఉంది . చాలా విషయాల్లో మీరు తృణప్రాయంగా అన్నింటిని వదులుకోవాలి అనుకుంటారు కానీ అంత బంధము వాటీతో మీకు ఏర్పడిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రము జాగ్రత్త వహించండి.  రవి స్థితి బాగాలేదు చంద్రుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు.  విశాఖ నాలుగో పాదం వారికి సంపత్ తారైంది ఫలితాలు చాలా బాగున్నాయి . అనూరాధకు జన్మతార అయింది ఆరోగ్య విషయం జాగ్రత్త వహించండి జ్యేష్టా నక్షత్ర జాతకులకు పరమమిత్రతార అయింది కాబట్టి మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు.
పరిహారం : మంగళవారం నియమాలు పాటించండి. కుజుడికి కందులు దానం చేయండి ఎర్రని వస్త్రం దానం చేయండి. రోజూ శివార్చన లేదా శివదర్శనం మీకు చాలా లాభాన్ని చేకూరుస్తుంది.

ధనూరాశి :

ఈ రాశి  వారికి అనుకోకుండా ధనలాభాదులు ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కాని తొందరపాటుతో మీకు హాని కలిగే అవకాశం ఉంది. మీలో భయం చోటు చేసుకున్నది. పని ఒత్తిడి పెరిగింది దానివల్ల అపకీర్తి కార్య వ్యగ్రత రెండు చోటుచేసుకున్నాయి. రాహు ప్రభావము శత్రువులు వృద్ధి కూడా సూచిస్తోంది. మీకు అన్ని అమర్చినట్లుగా సమకూరే వారమే కానీ మీ మాట తీరు వల్ల మీరు కొన్నిటిని పోగొట్టుకునే అవకాశం ఉంది. మీలో ఉన్న రోగము మళ్ళీ తిరగబెడుతుంది దానివల్ల కార్యహాని జరుగుతుంది. తద్వారా అపకీర్తిని కూడా మీరు పొందబోతున్నారు. ఏది ఏమైనా ధనాదాయం బాగుండుటం సన్మిత్రుడు మీకు ఉండటం  ఇలాంటి కారణాల వల్ల మీరు తొందరగా వ్యతిరేక పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. శుక్రుడు మీకు ఆరో స్థానంలో ఉండటం వల్ల అపకీర్తి అవకాశం ఎక్కువగా ఉంది. కార్యదక్షత తగ్గుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. మూలా నక్షత్ర జాతకులకు మిత్ర రైంది దేదీప్యమానంగా ఉంది పూర్వాషాడ నక్షత్ర జాతకులకు నైధన తార అయింది పూర్తి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి సాధన తయారైంది సత్ఫలితాలు పొందగలుగుతున్నారు.
పరిహారం :  శనికి జపం చేయించండి. హోమం కూడా చేయించండి.  నువ్వులు నల్లని వస్త్రము నూనె ఉప్పు ఇనుప మేకు దానం చేయించండి చాలా అవసరం.

మకర రాశి :

ఈ రాశివారికి అలంకార ప్రాప్తి బంధుమిత్ర దర్శనం ఇవి కొంచెం సాధనలో కొచ్చాయి. జన్మ శని ప్రభావము వీరిపై బాగా పనిచేస్తుంది. జన్మ గురుడు కూడా వీరికి స్థాన చలనాన్ని సూచిస్తున్నాడు. కుజుడు ఉన్న సంపదనంతటినీ ఎలా వ్యయం చేయడమా అనే  స్థానంలో ఉన్నాడు. బంధుమిత్ర దర్శనము వీరికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ వారంలో వీరు విపత్తులను ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అది శారీరకంగా మానసికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా వుంది. ఒక్క రవి మాత్రమే వీరికి శత్రు నాశనం చేస్తూ శుభఫలితాలు ఇస్తాడు.గ్రహస్థితులు ప్రభావంగా కార్యదక్షత వీరిలో తగ్గిపోతోంది. స్వయం విపత్తులు  ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. బుధ గురువారాల్లో అనుకూలమైన సుఖప్రదమైన వార్తలు వినడం లేదా బహుమతులు పొందడం జరుగుతుంది.  ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి సాధన తారైంది ఫలితాలు చాలా బావున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది పూర్తి ప్రతికూలతలు ఉన్నాయి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి క్షేమ తారైంది చాలా బావుంది.
పరిహారం :  చేనువ్వులు నల్ల వస్త్రము నూనె దానం చేయండి. బుధవారం నాడు బుధగ్రహ ప్రీతిగా నానబెట్టిన పెసలు బెల్లం ఆవుకు తినిపించండి.

కుంభ రాశి :

ఈ రాశివారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఈ వారంలో ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా చంచలమైన స్థితి వీరిది. ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఆర్ధికంగా శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా కూడా వీరికి అందవు.  శుక్రుడు కేతువు తప్ప మిగిలిన వారందరూ కూడా ప్రతికూలంగానే పనిచేస్తారు. దానివల్ల ప్రతి పనిలోనూ ఆటంకము ఆచరణలోనే ప్రారంభంలోనే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. ప్రతిదానికి విమర్శ ప్రతి దాంట్లోని అపభ్రంశం ఆర్థికపరంగా అయితే చాలా హీన దీన స్థితి చూస్తుంది. ఎందులో పెట్టుబడి పెట్టిన నష్టం వాటిల్లి పోతుంది. వ్యయ మందున్న శని ప్రభావం కూడా విపరీతంగా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా వీరు ఉన్న స్థితినుండి అట్టడుగుకు చేరిపోయే పరిస్థితి. ఎచ్చరిక :- మనోధైర్యం ఆత్మస్థైర్యం వీడకుండా ఉంటే ఇందులోంచి బయటికి రాగలుగుతారు లేకపోతే ఇది ఒక పతన కారణం అయిపోతుంది.
ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తారైంది ఫలితాలు చాలా బావుంటాయి.  శతభిషా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది కాబట్టి ఫలితాలు చాలా  వ్యతిరిక్తంగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్తార అయ్యింది ఫలితాలు చాలా బాగున్నాయి.
 పరిహారం :  ప్రతిరోజు శివదర్శనం చేయండి. సాధ్యమైనంతవరకు ఏకాంతంగా సన్నిహితులతో మాత్రమే ఉండండి. శ్రీరామచంద్రుని హనుమంతుని ధ్యానించండి.

మీన రాశి :

ఈ రాశివారికి ధనలాభము శత్రు జయము మృష్టాన్న భోజనము వీరిని చాలా ఆనందంలోని తీసుకెళతాయి. రవి స్థితి బాగాలేదు కాబట్టి అవమానం పాలు పెరుగుతోంది. కుజుడు మీకు పరీక్షా కాలాన్ని ఇస్తున్నాడు. దాన్ని మీరు తట్టుకుంటే ముందుకు వెళ్లగలుగుతారు. బుధ గురులు శత్రు జయాన్ని లాభాన్ని ఇస్తున్నారు. శుక్రుడు కూడా మీకు మేలు చేసే స్థానంలో ఉన్నారు. శనీశ్వరుడు మీ నోటి వెంట ఏదొస్తే అది చేసి తద్వారా ధనలాభాన్ని సంపాదించి పెడదామని సిద్ధంగా ఉన్నాడు. రాహుకేతువులు మాత్రం ప్రతికూలంగా ఉన్నారు. మీరు ఏ వ్యాపారం పెట్టినా లేదా ఉద్యోగంలోనైనా ఉన్నతిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీ మూలక కలహాలు అధిక వ్యయములు కూడా ఉంటాయి అవి కొంచెం బయట పడకుండా జాగ్రత్తగా వహించండి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి సంపత్ తారైంది ఫలితాలు ఆర్థిక స్థితి బావుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు జన్మ తారైంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రేవతి నక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయింది కాబట్టి ఫలితాలు బాగుంటాయి.
 పరిహారం : మంగళవారం నాడు సుబ్రమణ్యేశ్వర స్వామి పూజ ఆంజనేయస్వామి దర్శనము మంచి ఫలితాన్నిస్తాయి. ఖడ్గమాల పారాయణ చేస్తే విశేష ఫలితాలు పొందగలుగుతారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort