జూలై 5 ఆదివారం నుండి జూలై 11 శనివారం వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 3:48 AM GMT
జూలై 5 ఆదివారం నుండి జూలై 11 శనివారం వరకు

మేష రాశి :

ఈ రాశివారికి రవి కుజ గురులు యోగ కారకులై వున్నారు. వీరికి గతంలో కంటే మంచి ఫలితాలు చేకూరనున్నాయి. అంతేకాకుండా భూషణాలు ధనలాభము సంపద చేకూరుతాయి. కొన్ని రాజకీయ చిక్కులు ఉన్నప్పటికి స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారములు భూ సంబంధ వ్యవహారాలు అనుకూలంగా మారి కొంత సంతృప్తిని కలిగిస్తాయి. వివాహం కావల్సిన వారికి సంబంధం దగ్గరకు వచ్చినా కుజుడు వ్యయమందుండడం చేత వాయిదా పడక తప్పదు. కుజ బుధులు కొంత అనారోగ్యాన్ని సూచిస్తున్నారు. రవి ప్రభావం చేత వీరికి వంశపారంపర్యంగా రావాల్సిన సంపదలు మాత్రమే చేకూరుతాయి. అధికారం కూడా లభిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులున్నా గురుబలం చేత అవి కూడా తొలగే అవకాశం లేకపోలేదు. రాజ్య శని అయినా మీకు ఏదో ఒక ఇబ్బందిని మాత్రము కలుగజేస్తాడు. ఇది తప్పదు. అశ్వినీ నక్షత్ర జాతకులకు సంపత్తా రైంది ఆర్థిక లాభాలున్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు జన్మ తారైంది అనారోగ్య శిరోవేదన లేదా కంటికి అనారోగ్య సూచన ఉన్నది. కృత్తిక ఒకటో పాదం వారికి పరమ మిత్రతారైంది మధ్యమ ఫలితాలు చేకూరుతాయి.

పరిహారం : కుజునకు కందులు దానం చేసి బ్రాహ్మణ పూజ చేయించండి. శుక్రవారం నాడు అమ్మవారికి మీ ఇంట్లోనే కుంకుమ పూజ చేయండి. ఐదవ తేదీ ఆదివారం గురుపూజోత్సవం నాడు మీ గురువు గారిని దర్శించండి.

వృషభ రాశి :

ఈ రాశి వారికి ధన ప్రాప్తి స్వర్ణాభరణాల ప్రాప్తి శరీర సౌఖ్యం ఇలాంటి శుభఫలితాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు కంటే మంచి ఫలితాలు రానున్నాయి. రవి ద్వితీయ ముందున్నాడు కాబట్టి లేనిపోని అపోహలు భయాలు మానసికంగా అధైర్యము పొందుతారు. దానికి మనః కారకుడైన చంద్రుడు కూడా దోహదపడతాడు. లాభ ముందున్న కుజుడు ధన ప్రాప్తిని ద్వితీయ మందున్న బుధుడు ఆభరణాల్ని లగ్నంలోనే ఉన్న శుక్రుడు సుఖ సౌఖ్యాలను ఇస్తారు. కానీ మీరు గురు రాహు కేతు ప్రభావాల చేత వాటిని అనుభవించే యోగం లేక మీ నుండి దూరంగా పోతాయి. మీ రాశికి శని యోగకారకుడు అయినప్పటికీ మీ ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. అష్టమ గురుడు ధన వ్యయాన్ని అష్టమ చంద్రుడు సమాజంలో అపకీర్తిని సూచిస్తున్నారు. మీ మాట పట్టింపు నైజం వల్ల ఇతరులు ఇబ్బంది పడి మీతో తాత్కాలిక శత్రుభావం కలిగి ఉంటారు. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి పరమమిత్రతార యింది. మధ్యమ ఫలితాలున్నాయి. రోహిణీ నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది శుభ ఫలితాలు చాలా ఎక్కుఅ ఉన్నాయి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి నైధన తారైంది వ్యతి రిక్త ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : మీరు గురువుకు జపం చేయించండి ఆదివారం గురుపూజోత్సవం గనుక పత్రము పుష్పమా ఫలము గురువుగారికి సమర్పించి నమస్కరించండి మీ దోషాలన్నీహరింప పడతాయి.

మిథున రాశి :

ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి బుధ శుక్ర గ్రహాలు ఉత్సాహాన్ని సంతోషాన్ని నింపుతున్నాయి. రవి ప్రభావం చేత ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా లేదా అనారోగ్య రీత్యా స్థానచలనం మాత్రం కనిపిస్తుంది. మీకు విశేష ధనప్రాప్తి విశేష సౌఖ్యము గురు చంద్రుల యొక్క ప్రభావంచేత రానున్నాయి. అష్టమ శని ప్రభావం మాత్రమే చరమాంకాన్ని సూచిస్తుంది. చాలా ఇబ్బందులు. దానికి తోడు వ్యయ సప్తమ స్థానాల్లో రాహు కేతువులు యొక్క సహకారం మిమ్మల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తాయి. మీరు బయట ఒకలా చెప్పుకున్నా లోపల్లోపల ఇంకోలా ప్రవర్తించాల్సిన స్థితి వస్తుంది. కుటుంబ సౌఖ్యము తగ్గిపోతుంది. ఉత్సాహ మైతే బయటికి కనిపిస్తుంది గానీ లోపల నిరుత్సాహం మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. వారం ఆఖరులో మీకు చంద్రుడు యొక్క కలయిక మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారం మధ్యలో మాత్రం శని చంద్రుల కలయిక మి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది ఒక హెచ్చరికగా మీరు గ్రహించవలసిన అవసరం ఉంది. మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి నైధన తార అయ్యింది వ్యతిరిక్త ఫలితాలే ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతులకు సాధన తార అయ్యింది సత్ఫలితాలు ఎక్కువగా పొందనున్నారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రత్యక్తార అయింది కాబట్టి అనుకూలంగా లేదు.

పరిహారం : అష్టమ శని ప్రభావం తగ్గడానికి శనికి జపం చేయించడం నల్లని నువ్వులు నల్లని వస్త్రం నువ్వులను దానం ప్రతి రోజు నవగ్రహాల ప్రదక్షిణం చేయండి. ముఖ్యంగా గురుపూర్ణిమ నాడు గురువుని సందర్శించండి శుభం జరుగుతుంది.

కర్కాటకరాశి :

ఈ రాశివారికి శుక్ర ప్రభావం చేత ధన లాభం కేతు ప్రభావం చేత సుఖ జీవనం ఉన్నాయి. గురుడు ఆరో ఇంట్లోకి వెళ్లిపోవడం వల్ల ప్రయోజనకరమైన ఆలోచనలేవీ సాగవు. శని సప్తమంలో ఉంటూనే వ్యతిరేక ఫలితాలని ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తున్నారు. భాగ్య స్థానంలో కుజ చంద్రుల కలయిక మానసిక భయాన్ని అలాగే ద్రవ్య నష్టాన్ని సూచనలు ఇస్తున్నాడు. అనారోగ్యం గూడా కనిపిస్తుంది. వ్యయమందున్న రవి రాహు బుధులు వీరు కూడా సహకరించే అవకాశం లేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ధన వ్యయము ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం వ్యవసాయం వ్యాపార ఏ రంగాల్లో ఉన్నవారైనా అపారమైన నష్టాన్ని చవి చూస్తారు. శారీరిక మానసిక ఒత్తిడులకు గురి అవుతారు. నానా విధాలు గా ఆలోచనలు మిమ్మల్ని కుంగదీస్తాయి. మహా విచారంతో ఇంటిదారి పట్టలేక ఎటూ వెళ్లలేక ఏ నిర్ణయమూ తీసుకోలేక ఇబ్బంది పడే రోజులు ఇవి. పునర్వసు నాలుగో పాదం వారికి ప్రత్యక్ తారైంది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది మంచి లాభాలు పొందగలుగుతారు. ఆశ్రేష నక్షత్ర జాతకులకు విపత్తార అయింది ప్రతి పనిలోనూ ఆటంకాలు చవిచూస్తారు.

పరిహారం : శనికి తైలాభిషేకం చేయించండి. గురుభక్తి కలిగి ఉండండి ఐదో తేదీ ఆదివారం గురుపూర్ణిమనాడు దక్షిణామూర్తి స్తోత్రము దత్తాత్రేయ స్తోత్రము లేదా హయగ్రీవ స్తోత్రము ఏదో ఒకటి చేయండి. గురు దర్శనం చేయండి.

సింహ రాశి :

ఈ రాశివారికి ఈ వారంలో ఊహించినదానికంటే విశేష ధన లాభాదులు కార్యలాపాలు ఆనందాలు సంపదలు సుఖాలు అన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా అందివస్తాయి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ వారంలో మీకు డెబ్బై అయిదు శాతం అంతా లాభమే. అష్టమంలో ఉన్న కుజుని వల్ల శస్త్రచికిత్స వరకు వెళుతుంది. వీలయినంత వరకు వాహనాలను సొంతంగా నడిపేవారు ఆగడం మంచిది. దైవపూజ దైవభక్తి కలిగి మీ ధనాన్ని ఖర్చు పెట్టినట్లయితే మంచి ఫలితాలని పొందగలుగుతారు. గురుడు మీకు చాలా విధాలుగా ఆదాయాన్ని పెంచే మార్గం చూపిస్తాడు. శుక్రుడితో సంతోషాన్ని కుటుంబంలో ఆనందాన్ని ఇస్తాడు. కోర్టు వ్యవహారములు చక్కబడతాయి. ఒక శుభ వర్తమానం విని ఆనందిస్తారు. కుటుంబంలో కళ్యాణకారక సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సలహాలు సూచనలు తీసుకుని మిమ్మల్ని ఆధికారికంగా అంగీకరిస్తారు.మఖ నక్షత్ర జాతకులకు సంపత్ తారైంది విశేష శుభ ఫలితాలు ఉన్నాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు జన్మతార అయ్యింది ఆరోగ్యం జాగ్రత్త చేసుకోండి. ఉత్తర ఒకటో పాదం వారికి పరమ మిత్రతార అయింది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం : సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయండి . శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి. దుర్గాదేవికి పూజలు శుభ ఫలితాలని ఇస్తాయి. గురు దర్శనం శుభప్రదం.

కన్యారాశి :

ఈ రాశివారికి రవి కార్యజయాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తాడు. ఓ ప్రక్క సంతోషము ఓ ప్రక్క ఆనందంలో ఉన్నప్పటికీ సప్తమ మందు కుజ చంద్రుల కలయిక పిల్లల అనారోగ్యాన్ని అనుకున్న పనులను చేయలేకపోవడాన్ని సూచిస్తున్నాయి. నాల్గవ ఇంట్లో గురుడు మీకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తూ ధననష్టాన్ని సూచిస్తున్నాడు. అయితే భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడు మీకు ఏదో ఒక రకంగా స్థిర అభివృద్ధిని కల్పించే అవకాశం ఉంది. చతుర్థంలో ఉన్న కేతువు రాజ్యంలో ఉన్న రాహు వీరిద్దరూ అగౌరవాన్ని సూచిస్తూ ఉపయోగం లేని ఖర్చుల్ని సూచిస్తున్నారు. వారం మధ్యలో నుండి వారాంతం వరకు చంద్రుడు మీకు ఆకస్మిక ధనలాభాన్ని బంధుమిత్ర దర్శనాన్ని ఇస్తాడు. మీ ప్రయత్నంతో కుటుంబంలో ఒక శుభపరిణామం కనిపించవచ్చు. స్వ విషయంలో అయితే మాత్రం కార్య విఘ్నాలు ఉన్నాయి.ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి పరమమిత్రతార అయింది శుభ ఫలితాలు ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది ఆర్థిక వనరులు సమకూరుతాయి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి నైధన తార అయ్యింది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : కుజదోష నివారణకు కందులు దానం చేయండి ఖడ్గమాలా పారాయణం చాలా సహకరిస్తుంది. గురు స్తోత్ర పారాయణ మేధా దక్షిణామూర్తి మంత్ర జపం ఎక్కువగా దోహదపడతాయి.

తులా రాశి :

ఈ రాశివారికి కొద్దిపాటి ధనలాభము అధికార ప్రాప్తి సంపద ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భాగ్యంలో ఉన్న రవి బుధ రాహువులు కష్టము ద్రవ్య నష్టము శత్రువులకు సహకారము అందించి వీరికి ఇబ్బంది పెట్టు బోతున్నారు. మీ దైవభక్తి మీకు నూతన సంతోషాల్ని సంపదల్ని ఇస్తుంది. . శుక్రుడు మాత్రమే మీకు స్థిరాస్తిని అభివృద్ధి చెయ్యబోతున్నాడు. శుక్రుడు అష్టమ మందు ఉన్నప్పటికీ రాశ్యాధిపతి కాబట్టి ప్రయోజనం ఎక్కువగా చూపిస్తాడు. గురుడు మాత్రము మీకు ఆలోచనల్ని భిన్నంగా సాగించి ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ఈ వారంలో దైవబలం తక్కువగా ఉండటం చేత మీరు మరింత శ్రద్ధాసక్తులను చూపించు కున్నట్లే మీ అనారోగ్యం బయటపడకుండా మీ పిల్లలు ఆరోగ్యం లభిస్తుంది. శత్రు వృద్ధి జరగకుండా ఉండాలంటే పది మంది మధ్యలో మీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది. మీకు వ్యతిరేకంగా వార్తలు మీ గురించి చెడుగా చెప్పేవారు ఈ వారంలో మీకు తారసపడతారు. వారి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చిత్త మూడు నాలుగు పాదాల వారికి నైధనతార అయింది. దుష్ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది సత్ఫలితాలు ఎక్కువగా చవిచూస్తారు. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి ప్రత్యక్తార అయ్యింది కాబట్టి వ్యతిరక ఫలితాలే ఉన్నాయి.

పరిహారం : గురువారం నాడు గురు పూజ చేయండి. ముఖ్యంగా ఆదివారం గురుపూజోత్సవం నాడు మీ గురువును దర్శించి వారికి ఫలములను కానుకలను సమర్పించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ దత్తాత్రేయ చరిత్ర మంచి ఫలితాలని ఇస్తాయి.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి ఈ వారంలో కొద్దిపాటి ధన లాభము కోరికలు నెరవేరే మార్గమే ఉన్నాయి. అష్టమ మందున్న రవి రాహువులు ఇద్దరు కూడా అనారోగ్యాన్ని ధన వ్యయాన్ని సూచిస్తున్నారు. అనవసరంగా ధనాన్ని పోగొట్టుకునే స్థితిని రాహువు సూచిస్తున్నాడు. పంచమంలో కుజ చంద్రుల కలయిక వీరికి హృద్రోగం లేదా ఉదరరోగం సంభవించే పరిస్థితి ఉంది. కుజుడు మానసిక శత్రువుల వల్ల భయాన్ని అంటే ఇంద్రియ పటుత్వం తగ్గడం మానసిక ఆందోళన ఎక్కువ సూచిస్తున్నాడు. ద్వితీయంలో కొచ్చిన గురుని వల్ల వీరికి ధనలాభము సంఘంలో గౌరవము సంప్రాప్తం కానున్నాయి. సప్తమంలో ఉన్న శుక్రుడు వీరికి ప్రతికూల అంతా చూపిస్తూ కొంత నిరుత్సాహానికి గురి చేస్తున్నాడు. శని మాత్రం ధనలాభాన్ని సూచిస్తున్నాడు చంద్రుడు సోమ మంగళ వారల్లో శనితో కలిసినప్పుడు మరింత ఆర్థిక వనరులు సమకూరుతాయి కొన్ని విధాలుగా వీరికి రావలసిన బాకీలు వసూలు కావటం ఉన్నది. అష్టమంలో ఉన్నప్పటికీ బుధుడు మాత్రమే కోరికలను నెరవేరుస్తాడు. విశాఖ నాల్గవ పాదం వారికి ప్రత్యక్ తారైంది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం క్షేమ తారయింది చాలా మం మంచి ఫలితాలు పొందనున్నారు. జ్యేష్టా నక్షత్ర జాతకులకు విపత్తార యైనది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం.

పరిహారం : రాహు కేతువులకు పూజలు చేయించండి. శుక్రునికి జపం చేయించడం వజ్రాన్ని ధరించండి. సుబ్రమణ్య దర్శనం గాని ఆంజనేయ దర్శనం గానే చేయండి.

ధనూ రాశి :

ఈ రాశివారికి కొద్దిపాటి ధనలాభం మాత్రమే ఉంది. వీరు అన్ని విధాలా తమ జీవితంలో ఎన్నడూ చూడని విచారకరమైన జీవన విధానాన్ని వ్యవస్థను కళ్ల ముందు కట్టినట్లుగా చూస్తారు. లగ్నంలోనే ఉన్న గురుడు ఇంటిని విడిచిపెట్టి దూరంగా ఉండే పరిస్థితి కల్పిస్తున్నాడు. కేతువు కుటుంబపరమైన ఆందోళన భయాన్నీ కలిగిస్తున్నాడు. చంద్రుడు మాత్రమే మనోధైర్యాన్ని కలిగించనున్నాడు. సప్తమంలో ఉన్న రవి రాహు విచారాన్ని శత్రు వృద్ధిని సూచిస్తున్నారు. ఒక్క బుధుడు మాత్రమే కుటుంబపరమైన ధైర్యాన్ని ఆర్థిక ధనలాభం చేకూర్చాలి. ద్వితీయ మందున్న శని ధన హాని సప్తమంలో ఉన్న శుక్రుడు కుటుంబ హాని సూచిస్తున్నారు. మూలా నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతారు. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు జన్మతార అయింది అనారోగ్య సూచన ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మాత్రమే పరమమిత్రతార అయింది కొంత ఆనందాన్ని తృప్తిని ఇస్తాయి.

పరిహారం : ఆదిత్యాది నవగ్రహములకు నిరంతరము ప్రదక్షిణలు చేయండి. రుద్రాభిషేకం చేసుకుని మంచి ఫలితాలు కన్పిస్తాయి. గురుపూజోత్సవం నాడు గురు దర్శనం చేయండి.

మకర రాశి :

ఈ రాశివారికి బంధు దర్శనము సుఖ జీవితం శత్రు నాశనం కొంత ఆనందాన్ని కలిగించి సుఖ సౌఖ్య జీవితం పొందుతారు. కొన్ని కష్టాల్ని మరిచిపోయే పరిస్థితి ఉంది. బుధుడు అలంకార ప్రాప్తిని కలిగించబోతున్నాడు. ఈ వారంలో వీరు అనుకున్నవన్నీ జరగడానికి తృతీయ మందున్న కుజుడే కాదు అన్ని రకాలుగా వీరికి గ్రహములు అనుకూల స్థితిలో వచ్చేయి. జీవితంలో చాలా మార్పు సంప్రాప్తం కానున్నది. వ్యయ మందున్న గురుడు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నప్పటికీ శుక్రుడు బలం బుధ బలము కుజ బలం ఇవన్నీ కలిసి ఇతనికి ఒక శాశ్వత విలువలను జీవితాన్ని జీవితాంతం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కొత్త బంధుత్వాలు నెరవేరుతాయి. కుటుంబ పరంగా వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా నున్నది . ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి జన్మతార అయింది అనారోగ్య సూచన ఉంది. శ్రవణానక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయింది. పరిస్థితులు అనుకూలత ఉన్నది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి మిత్రతార అయింది చాలా సత్ఫలితాలు పొందగలుగుతారు.

పరిహారం : గురుపూజ చేయండి. దత్తాత్రేయ చరిత్ర గురు చరిత్ర చదవండి. ఏదో ఒక గురు కుటుంబాన్ని ఆదుకోండి.

కుంభ రాశి :

ఈ రాశి వారికి ఈ వారంలో కొద్దిపాటి కుటుంబపరమైన సౌఖ్యం విశేష ధనలాభాదులు వీరిని ఆదుకుంటాయి. షష్ఠంలో రవి పూర్వ వ్యాధి గ్రస్తులెవరైనా ఉన్నట్లయితే వాడికి చాలా ఇబ్బంది కలగజేయ నున్నాడు. ద్వితీయంలో ఉన్న కుజుడు పంచమంలో ఉన్న బుధుడు వీరికి మూలధనాన్ని కూడా ఖర్చు పెట్టించేసే స్థితిని సూచిస్తున్నారు. కుటుంబంలో ఉండే అనుభవజ్ఞురాలైన స్త్రీల ద్వారా మాత్రమే వీరికి విశేష ధన సంపత్తి ఆనందం కలగనుంది. గతంలో కంటే పరిస్థితులు దిగజారిపోయాయని అధైర్యపడకుండా ముందుకు వెళ్లడమే వీళ్లు చేయగలిగిన పని. ఏపని తలపెట్టినా జరగకపోవడము కుటుంబంలో కలతలు అన్నదమ్ముల మధ్య విభేదాలు అవన్నీ సూచిస్తున్నాయి. తమకు తెలియకుండానే కొన్ని విషయాల్లో పెట్టుబడులు పెట్టి అవి తిరిగి రాక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. నైతిక విలువలు ధర్మాచరణ దైవానుగ్రహం గల కుటుంబాలకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. లేనివారు ఇబ్బందుల పాలు కాక తప్పదు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి నైధన తార అయింది పూర్తి వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు వారికి ప్రత్యక్ తారైంది పరిస్థితులు బాగా లేవు.

పరిహారం : నువ్వులు నువ్వుల నూనె ఉప్పు దానం చేయించండి. బుధవారం నియమాన్ని పాటించి నానబెట్టిన పెసలు బుధవారం నాడు ఆవుకు తినిపించండి. సుబ్రహ్మణ్య దర్శనం ఖడ్గమాల పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తాయి.

మీన రాశి :

ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యము శత్రు జయము ఆనందాన్ని అభివృద్ధిని కలిగించనున్నాయి. పదవ ఇంట్లో ఉన్న గురు చంద్ర కేతులు ధన వ్యయాన్ని అధిక శ్రమని సూచిస్తున్నారు. కష్టపడటమే తప్ప ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండక పోవచ్చు. పదకొండవ ఇంట్లో లాభస్థానం లో ఉన్న శని వీరికి విశేష ధనలాభాన్ని గౌరవ సంపత్తిని తెచ్చిపెడతాడు. కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంది. లేదా ఇంకొక్క వాయిదాతో లబ్ధిని పొందగలుగుతారు. ఎన్నాళ్ల నుండో పరిష్కారం కా కానీ విషయాలు పరిష్కారానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. శత్రువులపై జయము బుధుని వల్ల కలుగుతుంది కాబట్టి వీరు సాధ్యమైనంత తొందరగా పనులు చక్కబెట్టుకోవడం అవసరం. ఖర్చు గురించి ఆలోచించకుండా ముందుకు అడుగు వేస్తే దేన్నైనాసాధించగలరు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి ప్రత్యక్ తార అయ్యింది ప్రతికూలంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు క్షేమ తార అయ్యింది ఆర్థికంగానూ చాలా బాగుంది. రేవతి నక్షత్ర జాతకులకు విపత్తార అయ్యింది ప్రతికూల పరి స్థితులు ఉన్నాయి.

పరిహారం : సూర్య నమస్కారాలు చేయండి గురునకు జపం చేయించండి. నిత్యమూ గురు దర్శనం చేసుకోండి. గురు చరిత్ర పారాయణ మంచిది .

Next Story