జూలై 26 ఆదివారం నుండి ఆగస్టు 01 శనివారం వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2020 3:09 AM GMT
జూలై 26 ఆదివారం నుండి ఆగస్టు 01 శనివారం వరకు

మేష రాశి :

ఈ రాశి వారికి విశేష ధన లాభము ఆనందాన్ని కలిగిస్తుంది. సర్వ సంపదలు సమకూరుతాయి. చతుర్థంలో ఉండి రవి అగౌరవానికి మార్గాన్ని సూచిస్తుంటే పదో ఇంట్లో శని రాజకీయ చిక్కుల్ని చూపిస్తున్నాడు. అనవసరంగా రాజకీయ పరిచయాలు పెంచుకుని కోరి ఇబ్బందుల్ని తెచ్చుకోకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. వీరికి వారం మధ్యలో శారీరక మాన మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్యం పాలయ్యే అవకాశం కనిపిస్తోంది. వ్యమందున్న కుజుడు కష్టాన్ని సూచిస్తున్నాడు. గురుడు శుక్రుడు మాత్రము సానుకూలంగా ఉన్నారు. ఆకస్మిక ధనలాభం సంపద సమకూరుతాయి. వారాంతం మందు పెద్ద కష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వీరికి శిరో వేదన కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే శత్రు వృద్ధి కూడా ఉంది. అశ్వినీ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది మంచి శుభఫలితాలున్నాయి. భరణీ నక్షత్ర జాతకులకు విపత్తార ప్రతికూలత ఎక్కువగా ఉంది. కృత్తికా నక్షత్రం ఒకటో పాదం జాతకులకు సంపత్తార అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారం మొత్తం మీద నలభై అయిదు నుంచి యాభై శాతం అనుకూల పరిస్థితులు ఉన్నాయి .

పరిహారం : చంద్రుడికి బియ్యం తెల్లని వస్త్రము వెండి చంద్రుడు పెరుగులో వేసి దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముప్పై ఒకటో తేది వరలక్ష్మీ వ్రతం చేయండి శుభ ఫలితాలు పొందుతారు.

వృషభరాశి :

ఈ రాశివారికి ధనప్రాప్తి శారీరిక సౌఖ్యము ఆనందాన్ని కలిగిస్తూ సుఖ జీవనాన్ని ఇస్తాయి. చంద్రుడు మొదట్లో పనులను ఆటంకం కలిగించినా వారాంత మందు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. కానీ వీరికి మృత్యుభయం చెప్పబడుతోంది. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లగ్నంలో ఉన్న శుక్రుడు ద్వితీయానికి వెళ్లడం కూడా శుభప్రదం. గురు శుక్రులు బుధుడు కుజుడు స్థిరంగా ఉండి మీకు మంచి అనుకూలమైన వ్యవస్థను కల్పన చేస్తున్నారు. రాహువు మీకు ప్రతికూలం ఎక్కువగా ఉన్నాడు. అకారణంగా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ. శని మీకు ప్రతికూల పరిస్థితులను కల్పిస్తున్నాడు. మొత్తం మీద మీకు అరవై శాతం వరకు ఈ వారంలో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృత్తికర్ెండు మూడు నాలుగు పాదాలు వారి సంపత్ తారైంది సానుకూల పరిస్థితులు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు జన్మ తారైంది ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహించండి. మృగశిర ఒకటి రెండు పాదాల వారికి పరమ మిత్రతార అయింది అనుకూల పరిస్థితులు బాగానే ఉన్నాయి.

పరిహారం : మీరు శనికి జపం చేయించండి తోటకూర బెల్లం ఆవుకు తినిపించండి. రాహువు యొక్క శ్లోకం ప్రార్థన చేయండి.

మిధున రాశి :

ఈ రాశివారికి కొంత సౌఖ్యము ఉత్సాహము సంతోషాన్ని కలిగిస్తాయి. అష్టమ శని స్థితి లగ్నంలో రాహువు వీరిద్దరూ వీరికి పూర్తి ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తున్నారు. ఎంత ఉత్సాహం ఉన్నా పనులు జరగక శారీరకంగానూ మానసికంగానూ ఇబ్బందులు పడడమే కాదు ఆర్థికంగా ధనవ్యయం పెరిగిపోతోంది. ఇది వీరు గుర్తించకుండానే జరిగిపోతాయి. మానసికమైన ఇబ్బందుల్ని మీరు బయటికి చెప్పుకోలేక లోలోపల బాధను అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు ప్రతికూలంగానే పనిచేస్తాడు. లగ్నంలో కొచ్చిన శుక్రుడు కొంత సానుకూలంగా స్పందిస్తాడు. లగ్నాధిపతి బుధుడు మీనోటి దురద కారణంగా ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితులు కల్పిస్తున్నాడు. వీరికి నలభై అయిదు శాతం మాత్రమే సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి పరమ మిత్ర తారైంది మంచి అనుకూల వాతావరణం ఉన్నది. ఆరుద్రా నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది మంచి ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి నైధన తార అయ్యింది. ప్రతికూల పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : శనికి జపం చేయించడం వల్ల మంచిది. నల్ల నువ్వులు నల్ల వస్త్రము నూనె దానము చేయించండి శుభ ఫలితాలు వస్తాయి చంద్రునికి కూడా తెల్లని వస్త్రము దానం చేయండి రాహు మంత్రాన్ని జపించండి. ముప్పై ఒకటో తేదీ వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేయండి.

కర్కాటక రాశి :

ఈరాశి వారికి కొద్దిపాటి శుభఫలితాలు ఉన్నా ఆలోచనలు ఎక్కువ ఉత్సాహం మాత్రం పెరుగుతుంది. శని ప్రభావం వల్ల గొప్పదైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దానికి అనుకూలంగా బుధుడు సంచారం కూడా అనేక రకాలైన ఆలోచనలతో జీవన గమనం సాగుతుంది. మీకుండే గౌరవ మర్యాదలు కూడా భంగం వాటిల్లే అవకాశం ఉంది. చంద్రుని తాలుకా ప్రభావంతో పనులన్నీ వాయిదా పడడం గాని లేదా ఇతరుల హస్తగతం కావడం గానీ వుంది. వ్యవహారం లోపంతో మీరు కొంత ధనాన్ని మంచి పనులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. మీకు ఈ వారంలో అనుకూల పరిస్థితులు బాగా తగ్గిపోయాయి . నిరుత్సాహ పడకుండా ముందుకు మిమ్మల్ని మీరు నడిపించుకోవాలి పైనుండి మీకు లభించే సహకారం తక్కువ. మీకు మీరే నిర్ణేతలుగా స్థిరచిత్తంతో ముందుకు కదలండి కొంత లాభాన్ని పొందగలుగుతారు. పునర్వసు నాలుగో పాదం వారికి నైధన తారేంది ప్రతికూల పరిస్థితులున్నాయి. పుష్యమీ నక్షత్ర జాతకులకు సాధన తారైంది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఆశ్రేష నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : శని ప్రభావము ఎక్కువగా ఉంది కాబట్టి నవగ్రహాల దర్శనం చేస్తూ రుద్రాభిషేకము మంచి ఫలితాన్ని ఇస్తుంది రాహువుకి జపం చేయండి.

సింహరాశి :

ఈ రాశి వారికి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి . వార ప్రారంభంలో ధన వ్యయం కనిపించినప్పటికీ వారం చివరిలో ఆనందము, సౌఖ్యం, సంపద, లాభము, సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా గడుపుతారు. లగ్నాధిపతి రవి శారీరక అనారోగ్యాన్ని ధన వ్యయాన్ని సూచిస్తున్నాడు. అది వీరికి పూర్తి ప్రతికూలంగా ఉంది. చంద్ర కుజులు యొక్క ప్రభావం క్షేత్ర శస్త్ర చికిత్స వరకు వెళ్లాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యల వల్ల కుటుంబంలో ఉన్న పెద్దలు అందరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబ పెద్ద అనారోగ్యానికి సూచనలు కనిపిస్తున్నాయి వయో వృద్ధులైన వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సీల్డు విషయంలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం అవుతున్నాయి. మీ మాట తీరు మీ శ్రీమతి మాట తీరు కుటుంబంలో ఉండే పెద్దల యొక్క గౌరవానికి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ వారంలో అరవై నాలుగు శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది పూర్తి సానుకూల పరిస్థితులు ఉన్నాయి. పుబ్బానక్షత్ర జాతకులకు విపత్తార అయింది ప్రతికూల వాతావరణం ఉన్నది. ఉత్తర ఒకటో పాదంవారికి సంపత్ తారైంది సానుకూల పరిస్థితులు ఉన్నాయి.

పరిహారం : రవికి జపము సూర్య నమస్కారాలు చాలా అవసరము. కుజునకు కూడా జపం చేయించండి కందులు దానం చేయండి ఎర్రని వస్త్రం దానం చేయండి.మంచి ఫలితాలు పొందుతారు. ముప్పై ఒకటో తేది వరలక్ష్మీ వ్రతం మరిచిపోకండి.

కన్యా రాశి :

ఈ రాశివారికి ధనలాభము సంతోషం ఆనందాన్ని కలిగిస్తాయి కుజుడు మీ ప్రయత్నాలకు ఆటంకం కలిగించినప్పటికీ శుక్రుడు మీకు చక్కనైన వాతావరణాన్ని కల్పన చేస్తాడు. మీ ప్రయత్నాల్లో కొన్ని లోపాలు బయటపడతాయి. మాట పట్టింపు కొద్దీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. ధనం వ్యయం కూడా ఈ వారంలో ఎక్కువగానే ఉంది. స్థిరమైన ఆదాయాలు మీకు తగ్గుతాయి. సుఖ సంతోషాల్ని మీరు కుటుంబంతో గడుపుతారు. చిన్నపిల్లలు తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వ్యాపకాన్ని పెంచుకుని కాలాన్ని గడపండి. మీ తెలివితేటలకు మీ ఆలోచనలకు ఇది మంచి పరీక్షా సమయంగా జరగబోతోంది. బుధ గురు శుక్రులు అనుకూలత మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. యాభై శాతం మాత్రమే ఈ వారంలో మీకు శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి సంపత్తారైంది సానుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు అనారోగ్య సూచన ఉంది జన్మతార కావడమే కారణం. చిత్త ఒకటి రెండు పాదాలు వారికి పరమ మిత్ర తారైంది పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి.

పరిహారం : మంగళవారం నియమాన్ని పాటించండి రాహు మంత్రాన్ని పఠించండి. కేతు ప్రీతిగా ఉలవల దానం చేయండి హనుమంతుడిని ప్రార్థిస్తే మంచి జరుగుతుంది.

తులా రాశి :

ఈ రాశివారికి కార్య జయము ధన ప్రాప్తి భూ సంపద ముందుకు నడిపించి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. చంద్రుడు కొద్దిపాటి ధన వ్యయాన్ని సూచించినా మీకు ఈ వారంలో చాలా అనుకూలంగా స్పందిస్తాడు. కుజుడు కూడా మీకు ధనలాభాన్ని కలిగిస్తాడు. అయితే బుధ గురులు మీకు వ్యతిరిక్తంగా పనిచేస్తున్నారు కాబట్టి మీ కష్టానికి తగిన ఫలితాలు లభించవు. మీ ఆలోచనలు కూడా గొప్పగా ఏమీ సాగవు. ప్రతి ఆలోచన కూడా మధ్యలోనే ఆగిపోతుంటుంది. అది కష్టానికి దారితీస్తుంది. శుక్రుడు రాశి మారినప్పటికీ స్థిరాస్తి వ్యవహారాలు బాగుంటాయి. కడుపు నొప్పి అవకాశం ఎక్కువగా ఉంది. శత్రుభయం సహజంగా మీకు ఉన్నటు వంటిదే ఈ వారం మీకు నలభై శాతం మాత్రమే ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతిపనిని ఆలోచించి ముందుకు సాగడం చాలా అవసరం. ఏదైనా మీరు స్వయం నిర్ణయం కాకుండా పెద్దల యొక్క లేదా జాతక ప్రభావాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే సానుకూలంగా ఉంటుంది. చిత్త మూడు నాలుగు పాదాల వారికి పరమ మిత్ర తారైంది చాలా సానుకూలంగా ఉంది. కు స్వాతి నక్షత్ర జాతకులకు మిత్రతార అయింది మంచి ఫలితాన్ని పొందనున్నారు. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి నైధన తార అయింది ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ఈ రాశివారు చంద్రునికి ప్రార్థిస్తే సద్యో ఫలితాలు కలుగుతాయి. బుధ గురులకు వీలైనంత వరకు దర్శనం చేసి పెసలు శెనగలు నైవేద్యం పెట్టండి. రుద్రాభిషేకం మంచిఫలితాలను ఇస్తుంది.

వృశ్చికరాశి :

ఈరాశి వారికి కొద్దిపాటి శుభ ఫలితాలు మాత్రమే ఈ వారంలో లభించనున్నాయి. మానసిక బలానికి చంద్రుని స్థితి అనుకూలంగా లేదు. కుజ గురుల ప్రభావము వీరిపై ఎక్కువగా ఉంది. కుజులు ప్రభావం చేత ఏదో ఒక కారణంగా ఇంట్లోని గానీ పైన గాని శత్రువులుగా మారతారు. వారు మాటలతోనే చేతులతోనూ బాధించడం ఎక్కువగా ఉంటుంది. బుధ శుక్రులు వీరికి ఈ వారంలో కొంత స్థిరాస్తి వ్యవహారాల్ని మంచి పనులను చేయించే అవకాశం కనిపిస్తోంది. ధన లాభం కూడా ఈ వారంలో వీరికి ఉంది. అయితే సంపాదించి దానికి ఖర్చు అక్కడికది సరిపోతుంది. నెమ్మదిగా మీరు చతురతని ఉపయోగించుకున్నట్లయితే మీకు రోజులు సానుకూలంగా మారుతాయి. అయితే మీ నమ్మకము మీ దైవ చింతనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యమైన వస్తువులు కనిపించకపోవడమో వాటి వల్ల పనులు వాయిదా పడడమో ఈ వారిలో ఉంది. నలభై అయిదు శాతం మాత్రమే మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. విశాఖ నాలుగో పాదం వారికి నైధన తార అయ్యింది. పూర్తి వ్యతిరేకతతో ఉంది. అనూరాధా నక్షత్ర జాతకులకు సాధన తారైంది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. జ్యేష్ఠా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది వ్యతి రిక్త ఫలితాలు ప్రతికూలతలు ఎక్కువ గా ఉన్నాయి.

పరిహారము : గురునకు శనగలు దానం చేస్తే చాలా మంచిది. సుందరకాండ పారాయణ గానీ లేదా హనుమత్ కవచంగానే పారాయణ చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి.

ధనూరాశి :

ఈ రాశివారికి ఈ వారం నుంచి క్రమంగా పరీక్షా కాలంగా మారిపోతోంది. గ్రహాలన్నీ ప్రతికూల స్థితిలోకి చేరుకున్నాయి. కేతువు బుధుడు మాత్రమే మీకు మంచి ఫలితాల్ని ఇవ్వనున్నారు. చంద్రుడు మధ్యలో ధన వ్యయాన్ని కల్పించినప్పటికీ సుఖ సౌఖ్యాలను కుజుడు పనుల ఒత్తిడిని పెంచి మీ అసమర్థతని నిరూపించే స్థితి ఉంది. అదే సమయంలో శత్రువుల బాధ కూడా మీ కు పెరుగుతుంది వ్యాపారమో వ్యవహారమో ఏదో పని మీద గాని మీరు ఇల్లు దాటి వెళ్ళక తప్పదు. శుక్రుడి ప్రభావం చేత కించిత్ అపవాదులు మీరు భరిస్తారు. ఏది ఏమైనా మీ వా వాక్చాతుర్యంతో మీరు బయటికి రావాలన్న సంకల్పంతో ఉండండి. దీనికి దైవానుగ్రహం తప్ప ఇంకొక మార్గమేమీ లేదు. మనోనిగ్రహము నిశ్చల స్థితి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఏకాగ్రతా సాధన ప్రారంభించండి మీకు అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. ఈ వారంలో మీకు నలభై శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి. మూల నక్షత్ర జాతకులకు క్షేమ తారయింది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు విపత్తార అయ్యింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంపత్తారయింది మంచి ఫలితాల్ని పొందగలుగుతున్నారు.

పరిహారం : రుద్రాభిషేకం అన్ని ఇబ్బందుల్ని తొలగించేస్తుంది. నవగ్రహ దర్శనం వీలయితే ప్రతిరోజూ చేయండి.

మకర రాశి :

ఈ రాశివారికి కుజ బుధులు అనుకూలంగా ఉండటం చేత కొన్ని పనులు అతి కష్టం మీద నెరవేరుతాయి. బంధు మిత్రులను కలుసుకుని వారి ద్వారా కాస్త ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. బుధుడు ఏదో ఒక రకమైన మంచి మాటల్ని మీ ద్వారా పలికించి మీకు మేలు చేసే అవకాశం ఉంది. గురుడు మీకు ప్రతికూలంగా ఉండటం చేత గురు బలం తక్కువగా ఉండటం చేత మీరు ప్రతి పనిలోనూ సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. శుక్రుడు ఈ వారం మొత్తం మీద మీకు అపకీర్తిని మిగుల్చుతున్నాడు. ప్రతి పనిని మీరు స్వంత ఆలోచనలతో ముందుకు నడిపించండి. ఇంట్లో వృద్ధులు అనారోగ్యంతో ఉన్నారంటే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తని వహించండి. మీకు గ్రహస్థితి పూర్తి ప్రతికూలంగా ఉంది కాబట్టి మీరు ప్రతి నిమిషమూ ఆలోచించి అడుగు వేయండి. లగ్నంలో శని కూడా మీకు శారీరక దుర్బలత్వాన్ని సూచిస్తున్నాడు. మీజాతకం నలభై ఎనిమిది శాతం మాత్రమే శుభ ఫలితాలు మీకు ఉన్నాయి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి సంపత్తార అయింది అనుకూల పరిస్థితులు ఉన్నాయి. శ్రవణానక్షత్ర జాతకులకు జన్మతార అయింది అనారోగ్య సూచన ఉంది. ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారికి పరమమిత్రతార అయింది మంచి ఫలితాలని పొందగలుగుతున్నారు.

పరిహారం: నవగ్రహ జపాలు ప్రతి రోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. రుద్రాభిషేకము మంచి ఫలితాల్ని ఇస్తుంది.

కుంభ రాశి :

ఈ రాశివారికి బంధు దర్శనము స్త్రీ సౌఖ్యము ఉత్సాహంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. శత్రువులు నశిస్తారు. వాళ్లు మీ పట్ల అనుకూలంగా ప్రవర్తించే సమయం ఆసన్నమైంది. మానసికంగా మీరు దుర్బలులై వున్నారు. అందువల్ల అనారోగ్య భయమూ మృత్యు భయమూ మిమ్మల్ని వెన్నాడుతూనే ఉంటాయి. మీకు కుజ ప్రతికూలత వల్ల ఆర్థికపరమైన ఇబ్బంది పూర్తిగా ఏర్పడిపోతుంది. బుధుడు కూడా దానికి సహకరిస్తూ ఉన్నాడు. గురు శుక్రుల ప్రభావం చేత మీ జీవన విధానంలోని కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అవి యథాతథంగా కొనసాగించాలంటే వారిని ప్రార్థించడమే యోగ సాధన చేయడం మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. వ్యయం లో శని మీకు ఇబ్బందులు మరింత కలిగిస్తాడు. అన్ని రకాలైన టువంటి కష్టాల్ని చవి చూపించేస్తాడు. గట్టి ప్రయత్నంతోనే మీరు ముందుకు వెళ్ళాలి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి పరమ మిత్రతార అయింది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు మిత్రతార అయింది చాలా పరిణామాలు పొందుతారు. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి నైధనతార అయ్యింది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : నవగ్రహ దర్శనము మంచిది. శివునకు రుద్రాభిషేకం చేయించండి. అమ్మవారి ప్రార్థనలు మీకు మంచి మార్గంలో నడిపిస్తాయి.

మీన రాశి :

ఈ రాశివారికి ధనలాభము స్త్రీ సౌఖ్యము మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తాయి . చెప్పుకోలేని భయాలు మిమ్మల్ని ఆవరించి కష్టాల్ని శ్రమల్ని కలిగిస్తాయి. గురు బుధ కుజ గ్రహాల అనుగ్రహం తగ్గింది. ఒక్క శుక్రుని ప్రభావమే మీపై ఎక్కువగా ఉంది. శని ధన లాభాలు సూచించినప్పటికీ ఇతరుల గ్రహ ప్రభావం చేత మీకు ఈ వారంలో మీరనుకున్న సాధించడం చాలా ఇబ్బంది ఔతుంది. . కుటుంబ వ్యవహారాల్లోనూ ఉద్యోగ వ్యవహారాల్లోనూ రాజకీయ వ్యవహారాల్లో మీకు పూర్తి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని గూర్చి ఆలోచించేవారు తగ్గిపోతారు. మీరు ఒంటరి వారనే భావం పెరుగుతుంది. శుక్రుడు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మాటకారితనంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ప్రతిపని సానుకూలంగా చేసుకునే అవకాశమూ ఉంది. మీ జాతక ప్రభావము ఈ వారంలో నలభై శాతం మాత్రమే ఫలించనున్నది. మీ ప్రయత్నాలన్నీ కూడా సరియైన పథకం లేకపోవడం వల్ల సలహా సంప్రదింపులు లేకపోవడం వల్ల వ్యతి రిక్త ఫలితాలను ఇస్తున్నాయి. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి నైధన తార అయింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు సాధన తార అయింది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ఖడ్గమాలా పారాయణం చేయండి రుద్రాభిషేకాలు చేయించండి మంగళవారం నియమాన్ని ఎక్కువగా పాటించండి మంచి ఫలితాలను పొందగలుగుతారు.

Next Story