రాశి ఫలములు: తేదీ 18-10-20 ఆదివారం నుండి 24-10-2020 శనివారం వరకు
By సుభాష్ Published on 18 Oct 2020 6:48 AM GMT విశేష పర్వదినములు:
18-10-2020 ఆదివారం ప్రీతి విదియ శరత్కాల చంద్రుని దర్శనం చేయడం చాలా మంచిది.
20-10-2020 మంగళవారం అంగారక చతుర్థి.
21-10-2020 బుధవారం సరస్వతి పూజ, జమ్మి చెట్టు పూజ, ఆయుధపూజ, గౌరీ వ్రతం.
23-10-2020 శుక్రవారం దేవి త్రిరాత్ర వ్రతం. 24-10-2020 శనివారం దుర్గాష్టమి.
25-10-2020 ఆదివారం మహర్నవమి, విజయదశమి, అలాగే జమ్మి పత్రితో అమ్మవారి అర్చన.
25-10-2020 విజయ ముహూర్త కాలము మధ్యాహ్నం 1:40 నుండి 2.26 మధ్యలో.
25-10-2020 ఆదివారం నాడు నవరాత్రి అమ్మవారి ఉద్వాసన.
మేష రాశి -: ఈ రాశి వారికి విశేష ధనలాభము బంధుమిత్రులు దర్శనము సౌఖ్యము ఇవి ఈ వారంలో ఆనందాన్ని కలిగించును. రవి తన శత్రు క్షేత్రం అయినా తులారాశిలో ఉండటం వల్ల ఈ వారంలో వీరికి ప్రతిదానికి ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధ గురు శుక్రులు వీరికి మంచి ధనలాభం ఇస్తూ బంధు దర్శనం ఇస్తారు. శుక్రుడు మాత్రం అపకీర్తిని కలిగిస్తాడు. శని రాజకీయ చిక్కులు కలిగిస్తూ ఉంటే రాహుకేతువులు ప్రతికూల వాతావరణాన్ని కల్పిస్తున్నారు. చంద్ర స్థితి కూడా బాగా లేకపోవడం వల్ల కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరము. మనసు నిగ్రహించుకోవడం కూడా చాలా మంజరి. ఈ విధంగా మేష రాశి వారికి ఫలితాలు శుభాశుభ మధ్యమంగా ఉంటాయి. అయితే బంధు మిత్రదర్శనం వల్ల మీరు ఎక్కువ లాభాన్ని పొందుతారు. శుక్రుడు శత్రు క్షేత్రమైన సింహం లో ఉండడం వల్ల వీరికి మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతుంది అపకీర్తి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వారంలో వీరు 46% శుభఫలితాలను పొందగలుగుతారు. అశ్విని నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి పనులు సాఫీగా సాగిపోతాయి. భరణి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు తక్కువగా ఉన్నాయి. కొద్దిగా ఒకటో పాదం వారికి మాత్రం క్షేమ తార కాబట్టి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి.
పరిహారం :- సూర్య నమస్కారాలు చేయండి, శుక్రునికి జపం చేయించండి అమ్మవారి దర్శనం, 23, 24, 25 మూడు రోజులు అమ్మవారి పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఖడ్గమాల పారాయణ మంచిది.
వృషభ రాశి :- ఈ రాశి వారికి అలంకార ప్రాప్తి స్త్రీ సౌఖ్యము శత్రు నాశనం చాలా ఆనందాన్ని కలిగిస్తు సుఖసౌఖ్యాలతో సాగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. వీరు చక్కని ఆలోచన విధానం కలిగి తన పనులన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోతారు. కుజ బుధ గురు శుక్రులు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏ పనైనా సులువుగా నెరవేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు వీలైనంత తొందరగా మంచి ఆలోచన చేస్తే అంత సంతృప్తిగా కార్యాలన్ని కూడా నెరవేరుతాయి. రావలసిన బాకీలు వసూలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను తొందరగా పొందగలుగుతారు. అంతేకాదు వీరికి భూ సంబంధ వ్యవహారంలో కోర్టు వ్యవహారములు ఉన్నట్లయితే అవి కూడా నెరవేరతాయి. అందులో కూడా ఎక్కువగా లాభం పొందగలుగుతారు చిన్న అనారోగ్య సూచన ఉంది కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వారంలో మీకు 58 శాతం శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. కృత్తిక 2 3 4 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూలంగా ఉన్నాయి. మృగశిర 1 2 పాదాలు వారికి సంపత్ తార అయింది కాబట్టి పరిస్థితులు చాలా బాగున్నాయి.
పరిహారం :- దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారి దర్శనము ఖడ్గమాల పారాయణ దేవి సప్త శ్లోకి పారాయణ చాలా మంచి శుభ ఫలితాలనిస్తాయి ఆదివారం నాడు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యలో చంద్ర దర్శనం తప్పకుండా చేయండి.
మిధున రాశి :- ఈ రాశి వారికి ధన లాభం స్త్రీ సౌఖ్యము సుఖ సంతోషాలతో ఉండే జీవితం శుభఫలితాలనిస్తుంది. మీరు ఎన్నడూ లేని ఆనందాన్ని పొందగలుగుతున్నారు. చంద్ర రవి ప్రభావం చేతనూ బుధ ప్రభావం చేత కొన్ని పనులు వెనుకబడినప్పటికీ కూడా కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ పనులు సొంతంగా నెరవేరే అవకాశం తద్వారా ధనలాభం కూడా పొందగలుగుతున్నారు. ఒక స్త్రీ తాలూక సహకారంతో పనులన్నీ నెరవేరే అవకాశం కూడా లేకపోలేదు. రవి బుధుల కలయిక అది తులారాశిలో కాబట్టి వీరికి మానసిక మైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అయినా కొంత ధనాన్ని వెచ్చించి శుభ శోభనాల ని పొందగలుగుతారు. వీరికి ఈ వారంలో 58 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఎవరూ పొందని ఆనందాన్ని పొందుతారు. సద్వినియోగ పరచుకుంటే వీరికి జీవితకాలంలో జరగాల్సిన చాలా కార్యాలు ఈ వారంలో నెరవేరుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పునర్వసు 1 2 3 పాదాలు వారికి మిత్ర తార అయింది రోజులు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం :- ఇవి విజయదశమి రోజులు కనుక అమ్మవారిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకండి ప్రతిరోజు అమ్మవారి దర్శనము అయినా మీకు చాలా మేలు చేస్తుంది. దుర్గా సప్తశతి, స్తోత్ర పారాయణ ఖడ్గమాల ఏదైనా మీకు మేలే.
కర్కాటక రాశి :- ఈ రాశి వారికి విశేష ధనము నానావిధ ఆలోచనలు ముందుకు నడిపించి కొద్దిపాటి శుభ శోభనాల ను పొందే అవకాశం ఉంది. మీరు విశేష కృషి చేస్తేనే గాని ఏ పనులు కూడా నెరవేరవు గురు బలం తక్కువగా ఉంది పైగా కుజ స్థితి కూడా ప్రతికూలంగా ఉండటంతో పనులు చేయడంలో కొద్దిపాటి వెనకడుగు పడుతుంది. అయినా నిరుత్సాహాన్ని పొందవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే మీకు కళలకు నిలయమైన శుక్రుడు సింహ కన్యలో సంచారం మీకు లభిస్తుంది. అంచేతనే మీ పనులు చాలామట్టుకు నెరవేరే అవకాశం ఉంది. మీరు మీ ఆత్మ శక్తి మీద ఆధారపడి ప్రవర్తించి వాళ్లకి ఈరోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. మీకు 50 శాతం శుభ ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి విశేష ఫలితాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు నైధనతార కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం :- మీరు ఈ వారంలో అమ్మవారి దర్శనం ఎక్కువగా చేయండి ఖడ్గమాల, సప్తశతి పారాయణ, దేవీ సూక్తం పారాయణ దేవి స్తోత్ర పారాయణలు మేలు చేకూరుస్తాయి.
సింహరాశి :- ఈ రాశివారికి సంపదలు కుటుంబ శారీరక సౌఖ్యాలు వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి శని ప్రభావం చేత వీరు విశేష ధనం సంపాదిస్తారు శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడంతో కొత్తగా బంగారం భూములు వ్యాపారం కూడా కలిసివస్తాయి. దీంతో ధన సంపాదన కాదు మంచి పేరు కూడా ఉంది. కుజ బుధ ప్రభావంచేత వాహనాలు నడిపేటప్పుడు లేదా వాహనాది వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరం. శత్రువుల చేత ఎక్కువ ఇబ్బందులను పొందే అవకాశం ఉంది. రవి శుక్ర శని ప్రభావం వల్ల మీరు ఎక్కువగా పనిచేసి ప్రతి కార్యాన్ని చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలే కాదు మీ నాయకత్వాన్ని అంగీకరించి మీతో చాలామంది చేరుతారు. ఈ వారంలో 58శాతం శుభ ఫలితాలను పొందుతారు. మఖా నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి ప్రతి పని సులువుగా నెరవేరుతుంది. పుబ్బ నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర 1వ పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి.
పరిహారం :- దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి రోజుల్లో ప్రతి రోజు అమ్మవారికి పూజలు చేయండి దేవి స్తోత్ర పారాయణ, సప్తశతి పారాయణ, నవావరణ అర్చన అభిషేకాదులు శుభఫలితాలు ఇస్తాయి.
కన్యా రాశి :- ఈ రాశి వారికి ఉత్సాహము ధనలాభము సర్వసంపదలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ కుటుంబం తో ఆనందాన్ని అనుభూతిని పొందగలుగుతారు. శుక్రుడు అనుకూలత కొంత మేలు చేకూరుతుంది. దానివల్ల శరీరం ఉత్సాహం మీకు మిగులుతుంది. నూతన వృత్తి ఉద్యోగాల్లో మీరు ఎక్కువ ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. పూర్వం కంటే పరిస్థితి ఈ వారంలో కొంచెం మెరుగవుతుంది. మిమ్మల్ని ఎల్లప్పుడు ఏదో ఒక భయం వెన్నంటే ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కుజ ప్రభావం చేత మీకు ప్రతిపనిలో ఆటంకాలు కలిగినా మీరు ఉత్సాహ వంతులు కనుక మీ పనులలో చాలామట్టుకు నెరవేరే అవకాశం ఉంది. ఆదాయం బాగుంటుంది బంధుమిత్రుల ఆనందాన్ని పంచుకుంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. స్థిర చర ఆస్తులు పెంచుకునే అవకాశం కూడా కొద్దిగా ఉంది. మీరు ఈ వారంలో 42 శాతం శుభఫలితాలను పొందగలుగుతారు. ఉత్తర 2 3 4 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. హస్తా నక్షత్ర జాతకులకు విపత్తార అయింది రాహువు అధిపతి కనుక ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. చిత్త 1 2 పాదాలు వారికి సంపత్తార అయింది స్థిరాస్తి వ్యవహారాలు బాగుంటాయి.
పరిహారం :- ఈ నవరాత్రి రోజులలో అమ్మవారి ప్రార్థన చేయండి ఖడ్గమాల, సప్తశతి, లలితా సహస్రనామ పారాయణ, దుర్గా సూక్తం పారాయణ మంచి ఫలితాలను చేకూరుస్తాయి.
తులా రాశి :- ఈ రాశి వారికి ధన ప్రాప్తి ధనలాభము ఉత్సాహం వీరికి యోగించి ఈవారం ఆనందాన్ని కలిగిస్తాయి. సామాన్యమైన పనులు చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప ఈ వారంలో గొప్ప పనులు పెద్ద పనులు చేసే అవకాశం తక్కువగా ఉంది. అంతే కాదు ప్రతి పని కూడా వాయిదా వేయడం జరుగుతుంది. మిమ్మల్ని మీరు ఉత్సాహవంతులుగా నిరూపించుకోకపోతే మీ ద్వారా ఇతరులు తమ పనులను చక్కబెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కుజ ప్రభావం చేత మీరు కొంత ఆర్థిక పరిపుష్టి పొందగలుగుతారు. శుక్ర ప్రభావం చేత మీకు ఇంట్లో ఉత్సాహం ప్రోత్సాహాలు లభిస్తాయి. కానీ అనారోగ్య సూచన ఉంది. మీకు ఇతరుల నుంచి సహాయ సహకారాలు లభించవు. మీ అంత మీరు గా ఆలోచిస్తే ప్రతి పనిని మీరు సమర్థవంతంగా చేయగలరు. మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు సంభవించే అవకాశం ఉంది. స్థానం కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో 42శాతం శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్త 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి స్వాతి నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి విశాఖ 1 2 3 పాదాలు వారికి మాత్ర పరమమిత్ర తార అయింది కాబట్టి మంచి ఫలితాలను చూస్తారు.
పరిహారం :- సూర్య నమస్కారాలు చేయండి. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతి రోజు అమ్మవారి దర్శనము అమ్మవారికి సేవ పూజా పుష్పములను సమర్పించడం అమ్మవారి కి సంబంధించిన ఏ స్తోత్రం పారాయణ అయినా మంచి ఫలితాలనిస్తాయి.
వృశ్చిక రాశి :- ఈ రాశి వారిని ధన లాభం సంతోషము ఉత్సాహము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మీరు ఎంత ఉత్సాహంగా ఉంటే మీ పని కూడా అంతగా నెరవేరే అవకాశం ఉంది. శత్రు వృద్ది భయం అనేది మీకు ఎన్నడూ వెన్నంటే ఉంటాయి. మిమ్మల్ని మీరు ఉత్సాహపరచి గలిగితే సంతోషము ఆనందము పట్టలేనంత మీరు పొందగలుగుతారు. మీకు ప్రతి పనిలో కూడా ప్రతికూలత అనేది ముందుగానే ప్రయాణం చేస్తోంది. అది మీకు ఒక విధంగా మంచే జరుగుతుంది. ఏకాగ్రతను కోల్పోయి అవకాశం ఎక్కువగా ఉంది మీరు దాని మీద దృష్టి పెట్టండి. దాని వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అనుకోని ఖర్చులు మీకు ఎక్కువ అవ్వడం వల్ల సంపాదించిన దాంట్లో నుంచి ఎక్కువ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన పనులు వాయిదా పడతాయి. ఇష్టంలేని పనులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. గురు శుక్ర శనులు మీకు అనుకూలంగా ఉండటంతో మీరు పాత బాకీలు వసూలు కావడం స్థిరాస్తుల వ్యవహారాలు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వారికి పరమ మిత్ర అయింది. తద్వారా అన్ని పనులు జరుగుతాయి. మీకు ఈ వారంలో 50శాతం శుభ ఫలితాలు ఉన్నాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు మిత్ర తార కాబట్టి చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. జ్యేష్టా నక్షత్ర జాతకులకు నైధనతార అయింది వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పరిహారం :- సప్తశతి పారాయణం, యోగ సాధన మంచిది. దేవీ నవరాత్రుల దీక్షలు, ప్రతి రోజూ ఏదో ఒక దేవి స్తోత్ర పారాయణ చేయండి.మీకు మంచి ఫలితాలను ఇస్తాయి.
ధను రాశి :- ఈ రాశి వారికి ధన లాభం ఆనందం ధాన్య వృద్ధి సంతోషము సుఖజీవితం పరంపరగా అన్ని కొనసాగుతాయి. మీరు అనుకుంటే ఇట్టే పనులను కూడా సాధించగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మీకు కుజ ప్రభావం చేత శత్రుపీడ ఎక్కువగా ఉన్నప్పటికీ బుధ గురు శుక్ర అనుకూలత మిమ్మల్ని చాలా ఆనందింప చేస్తుంది. రాహువు కూడా మీకు జీవనవిధానానికి చక్కని దోహదపడ్డాడు కాబట్టి ఇతరులుమిమ్మల్ని చూడగానే చాలా పనులను చక్కగా చేసి పెడతారు మీ కోసం మిమ్మల్ని వెన్నంటి ఉండే వాళ్ళు ఎక్కువగా తయారవుతున్నారు ఈ ప్రభావం చేత మాత్రము మీకు శత్రువులు అనేవాళ్ళు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయినా మీరు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు మీరు చాలా పనులను ఈ వారంలో నెరవేర్చ గలుగుతారు. కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు. మీకు ఈ వారంలో 58 శాతం ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు సాధన తార అయింది అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి, పూర్వాషాఢ నక్షత్రం జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతి ఎక్కువగా ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి అనుకూలత బాగుంటుంది.
పరిహారము :- శనిగ్రహ జపం చేయించండి. ఈ నవరాత్రులలో సప్తశతి పారాయణ పూజ హవనము అర్చన చేయించండి మంచి ఫలితాలు పొందుతారు అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనండి.
మకర రాశి :ఈ రాశి వారికి సకల రోగాలు ఈ వారంలో గొప్పగా అనుకూలించి మంచి ఉత్సాహం కలిగిస్తాయి. మీకు ఉన్న శక్తి సామర్థ్యాన్ని కూడా మీ కుటుంబానికి మీ సుఖసంతోషాల కోసం తాపత్రయం ఎక్కువగా కలుగుతుంది. కుటుంబంతో నీ బంధుమిత్రులతో నీ స్నేహితులతో కళ్యాణ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీకు ఎక్కువ ఎటువంటి పనులు జరిగే అవకాశం ఉంది.అయితే గురు ప్రభావం చేత నష్టం సంభవించినప్పటికి కూడా గురువు యొక్క ప్రభావము మీ మీద పనిచేసి మీరు ఎన్నడూ సాధించినటువంటి విజయాలను ఈనాడు ఈ వారంలో గొప్పగా సాధించగలుగుతారు శత్రువులు తగ్గుతారు మిత్రులు పెరుగుతారు మీకు వృతులలోని సహకరించడానికి స్త్రీమూర్తులు కూడా ఎక్కువగా ఉంటారు ప్రతి పని కూడా మీరు చాలా చక్కగా ఉత్సాహంగా చేసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా పరిష్కారం లోకి వచ్చేస్తాయి కావలసిన రావలసిన బాకీలు వసూలవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గృహ నిర్మాణాలు జరుగుతాయి మీరు 74% శుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూలంగా ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి సంపత్ తార అయింది కాబట్టి పరిస్థితులు చాలా బాగున్నాయి.
పరిహారం :- దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారి దర్శనము ఖడ్గమాల పారాయణ దేవి సప్త శ్లోకి పారాయణ చాలా మంచి శుభ ఫలితాలనిస్తాయి ఆదివారం నాడు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యలో చంద్ర దర్శనం తప్పకుండా చేయండి.
కుంభ రాశి :- ఈ రాశి వారికి సుఖసౌఖ్యాలు స్థిరాస్తి సంపదలు కొంతలో కొంత ఊరట ఇచ్చి ఆనందాన్ని చేకూరుస్తాయి. అయితే గ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు లాభాన్ని ఎక్కువ పొందలేరు అని చెప్పాల్సి వస్తోంది. ఈవారం మీకు సామాన్యంగా సాగిపోతుంది. కుజ ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారు. బుధ ప్రభావంచేత సమయానికి ధనం చేతికి అందక ఇబ్బంది పడతారు. శుక్రుడు కూడా మీకు ప్రతికూలంగా నే పని చేస్తున్నాడు కాబట్టి వారం మధ్యలో మీకు అనారోగ్య సూచన కూడా కనిపిస్తోంది. అన్నీ కలిసే మీకు చిన్న ఇబ్బందిని కలిగిస్తున్నాయి. మీకు పెద్దల సహకారంతో దైవ సహకారం చాలా అవసరం. కుటుంబ పెద్దల గురువుల సలహా సంప్రదింపులతో జీవితాన్ని గడపండి. ఆత్మస్థైర్యం మనోధైర్యంతో మీరు నడవాలి. వారాంతంలో మంచి వార్త వింటారు. ఈవారం మీకు 34% శుభ ఫలితాలు ఉన్నాయి. ధనిష్ఠ 3 4 పాదాలు వారికి సంపత్తార అయింది కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. శతభిషం నక్షత్ర జాతకులకు జన్మతార అయింది కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి మిత్ర తార అయింది రోజులు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం :- ఇవి విజయదశమి రోజులు కనుక అమ్మవారిని తప్ప ఇంకెవరిని ఆశ్రయించకండి ప్రతిరోజు అమ్మవారి దర్శనము అయినా మీకు చాలా మేలు చేస్తుంది. దుర్గా సప్తశతి, స్తోత్ర పారాయణ ఖడ్గమాల ఏదైనా మీకు మేలే చేస్తుంది.
మీన రాశి :- ఈ రాశి వారికి సర్వసంపదలు చేతికంది ఆకర్షణతో ఆనందాన్ని పొంది సుఖసౌఖ్యాలు అనుభవిస్తారు. కుజ గురు శుక్రులు వీరికి ప్రతికూలంగా ఉండటం చేత కుజ ప్రభావం చేత అనారోగ్య సూచన ఉంది. గురు ప్రభావం చేత విపరీత శ్రమపడ్డం ఫలితం దక్కక పోవడం జరుగుతుంది. శుక్రుడు ఏ పని చేసిన ప్రతికూలత కల్పించి ముందుకు సాగిన ఒక అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. నిస్సత్తువ అనేది వీరి శరీరంలోని మనసులను కూడా చేరడం వల్ల ఏ పనులు కూడా చేయలేక కొంచెం వెనకడుగు వేస్తారు. అవసర సమయాల్లో వీరికి ఉత్సాహం ప్రోత్సాహం లభించక మరికొంత వాయిదాలు పడిపోతాయి. ధనానికి లోటు ఉండదు గానీ సకాలంలో వీరు పనులను పూర్తి చేయలేక పోవడం అనేది వీరి అశక్తత.దుర్జనుల బాధ ఇప్పుడు వీరికి ఉంటూనే ఉంటుంది కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది వీరు మాట తీరు వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. గ్రహానుకూలత లేనప్పుడు నిగ్రహానుగ్రహాలు తగ్గుతాయి. వారాంతాల్లో అనారోగ్య సూచన ఉంది. ఈ వారంలో మీరు 42శాతం శుభఫలితాలను పొందగలుగుతారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి విశేష ఫలితాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు నైధనతార కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.
పరిహారం :- మీరు ఈ వారంలో అమ్మవారి దర్శనం ఎక్కువగా చేయండి ఖడ్గమాల, సప్తశతి పారాయణ, దేవీ సూక్తం పారాయణ దేవి స్తోత్ర పారాయణలు మేలు చేకూరుస్తాయి.
Next Story