రాశి ఫలాలు అక్టోబర్ 20నుంచి 26 వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 7:35 AM GMT
రాశి ఫలాలు అక్టోబర్ 20నుంచి 26 వరకు

మేష రాశి :

ఈ రాశివారికి ఈ వారం చంద్రుడు మిథున రాశిలో వుండుట, తృతీయమందు రాహువుతో యుతి వలన అకాల భోజనం చేయుదురు. సోదర సోదరీమణులతో చిన్న చిన్న విభేదములు ఉండును. రాహువు తృతీయ మందు ఉన్నను చంద్ర సంయోగం వలన కాస్త అశుభ ఫలితము నిచ్చును. తల్లికి అనారోగ్యము, గృహ నిర్మాణ పనులన్నీ కాలయాపన అగును. బంధువులతో విభేదము, భయాందోళనలు కలుగును. ఈ రాశ్యాధిపతి కి అష్టమంలో గురుడు భాగ్య మందు శని యశో నాస్తి కనుక ఈ రాశివారు జాగ్రత్తగా ఉండుట మంచిది. అశ్వినీ నక్షత్ర జాతకులకు ప్రత్యక్తారతో ప్రారంభం కనుక ఈ వారం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. భరణీ నక్షత్రము వారికి ఈ వారం క్షేమ తారతో ప్రారంభం కనుక కాస్త అవయోగములు తగ్గును. కృత్తికా నక్షత్ర జాతకులకు విపత్తార తో ప్రారంభం కాస్త విపత్తులు సూచించును.

పరిహారం : ఈ రాశివారు చంద్ర గురుల జపం చేయుట సాయిబాబా ఆలయాలు దర్శించుట మంచిది. గురువారం శనగలు దానము లేక గోవుకు తినిపించుట శుభఫలితాలను ఇచ్చును.

వృషభం : ఈ రాశివారికి ఈ వారం కుటుంబ స్థానంలో చంద్ర రాహు స్థితి కనుక కుటుంబ స్థానము, ధనము, విత్తము, వాక్కు, నేత్ర సంబంధితం కావున కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు వాక్కుయందు పరుషత్వము, నేత్రానికి సంబంధించిన వేదన, కుటుంబ సభ్యులతో చిక్కులు అవకాశం ఉంది. ఈ రాశ్యాధిపతి 6 ఇంట్లో వుండుట స్వక్షేత్ర అయినను శత్రువులతో కాస్త విభేదము లుండును. 6 ఇంట రవి వలన సమస్యలు ఉన్నను శత్రుజయం. పంచమంలో కుజ స్థితి వలన కుటుంబంలో సంతానం వలన కాస్త ఇబ్బందులుండును. సప్తమంలో గురు గ్రహ స్థితి ఈ రాశిని వీక్షించుట వలన జీవిత భాగస్వామితో అనుకూలత ఉండును. విదేశీ ప్రయాణానికి అనుకూలం. అష్టమంలో శని కేతు స్థితి వలన కాస్త విషజ్వరాలు వంటివి ఉండును. కృత్తికా నక్షత్రం వారికి ఈ వారం విపత్తార తో ప్రారంభం అగుట వలన అనుకూలత తక్కువ. రోహిణీ నక్షత్ర జాతకులకు సంపత్ తార, కుజ నక్షత్రం కనుక అశుభ ఫలితాలు తగ్గి మిశ్రమ ఫలితం ఉంటుంది. మృగశిరా నక్షత్ర జాతకులకు జన్మతారతో ప్రారంభం కావున అనారోగ్య సూచన.

పరిహారం: ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట, కందులు దానం చేయుట, ఎరుపు వస్త్రధారణ శుభ ఫలితాల నిచ్చును.

మిథునం : ఈ రాశి వారికి లగ్నంలో చంద్ర రాహువులు, సప్తమంలో శని కేతు స్థితి, షష్ఠమ మందు గురుడు వుండుట వల్ల కార్య విఘ్నములు వుండును. జీవిత భాగస్వామితో విభేదాలు గాని కాస్త అనారోగ్యం లేదా ఎడబాటు అయినా ఉండును. సప్తమ స్థానంలో శని ఉండుట అప మృత్యుదోషాలు కానీ లగ్న పంచమ అధిపతి అయిన బుధ శుక్రులు పంచమ కోణము నందు ఉండుట వలన ఈ కోణం శుక్రుని స్వ క్షేత్రము మూల త్రికోణం అవటంవల్ల అపమృత్యు దోషం తగ్గును. పంచమ స్థానంలో శుక్రుని వల్ల సంగీత సాహిత్యాల పట్ల అనురాగం కలుగును. ఈ వారం కాస్త విలాసవంతంగా ఉంటుంది. మృగశిరా నక్షత్ర జాతకులకు అనారోగ్య సూచన, ఆరుద్ర నక్షత్రం వారికి ధన విషయంలో బాగుండును. పునర్వసు నక్షత్ర జాతకులకు మైత్రి బాగుండును.

పరిహారం : ఈ వారం శ్రీ మహావిష్ణువుని పూజించుట, పచ్చని వస్త్రము ధారణ, పెసలు దానం ఇవ్వడం మంచిది.

కర్కాటకం : ఈ రాశివారికి ఈ వారం అనారోగ్య సూచన కలదు. కానీ పంచమ కోణమందు గురుడు విశేష యోగాన్ని ఇచ్చును. పుత్ర సంతాన ప్రాప్తి లేదా సంతానం వల్ల ఆనందం కలుగును. విద్యలో మంచి గుర్తింపు లభించును. మరియు గురుడు మీన రాశిని వీక్షించటం వలన అనారోగ్య సమస్య తగ్గును. వాహన కారకుడు వాహన స్థానంలో ఉండటం వల్ల నూతన వాహన ప్రాప్తి కలుగును. గృహ నిర్మాణ పనులన్నీ కార్యరూపం దాల్చును. మాతృ సౌఖ్యం లభించును. షష్ఠ శని కేతువుల వలన శత్రు జయము సర్వకార్య సిద్ధి వివాహ ప్రయత్నాలకు అనుకూలం. ఈ వారం మీ పట్ల తల్లిదండ్రులు విశేష శ్రద్ధ చూపుదురు. కానీ వ్యయ చంద్రుల వలన చంచల మనస్సు కలిగి వుండును. పునర్వసు నక్షత్ర జాతకులకు మిత్రుల సహకారం లభించును. విశేష ఖ్యాతి గడిస్తారు. పుష్యమీ నక్షత్ర జాతకులకు ఈ వారం నైధన తారతో ప్రారంభం కావున గ్రహము లన్నీ స్వస్థానంలో ఉన్నను మిశ్రమ ఫలితం. ఆశ్రేష వారికి సంకల్పసిద్ధి ఉన్నది.

పరిహారం : ఈవారం మహాలక్ష్మిని తెల్లని పుష్పాలతో అర్చించుట లేదా తెల్లని గోవును పూజించుట వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

సింహం : ఈ వారం లాభ స్థానంలో చంద్ర కేతుల వలన కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వచ్చును పెండింగ్ పనులు అగును. వ్యయాధిపతి లాభస్థితి వలన ఖర్చులు అదుపులో ఉంచుతారు. హృదయ స్థానమునందు గురుని వలన సత్ప్రవర్తన, క్షమాగుణము, దాన గుణము వంటివి కలుగును. గృహ, వాహన, మాతృ, బంధు భావము లన్నియు మీ మనో వాంఛలకు తగ్గినట్లు ఉండును. అనగా పై భావములన్ని అనుకూలముగా నుండును. పంచమ శని కేతువుల వలన విద్యా విఘ్నములు, సంతాన సమస్యలు లేదా సంతానంతో సామాన్య ఇబ్బందులు ఉండును మఖా నక్షత్ర జాతకులకు ఈ వారం కాస్త అనుకూలత తక్కువ. పుబ్బ వారికి విశేష అనుకూలత. ఉత్తరా నక్షత్రం వారికి సంతానం వలన ఇబ్బందులు కలుగును. మొత్తం మీద ఈ రాశివారికి సర్వము అనుకూలంగా ఉన్నను సంతానానికి చికాకులు, బుద్ధిమాంద్యం, మతిమరుపు, సంకల్పం చేసిన కార్యములు అన్నియు విడిచి పెట్టుట జరుగును.

పరిహారం : ఈ రాశివారు పరమేశ్వరుని పూజించుట, గణపతి ఆరాధన, ఎరుపు రంగు పుష్పాలతో పూజించుట, ఎర్రని వస్త్ర ధారణ వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

కన్యా రాశి : ఈ వారం రాశ్యాత్ దశమ కేంద్రమందు చంద్ర, రాహు స్థితి, శని కేతు వీక్షణ వల్ల వృత్తిరీత్యా చికాకులుంటాయి. వృత్తిలో మార్పు సూచిస్తుంది లేదా మరియొకవృత్తి చేపడతారు. జన్మ స్థానంలో కుజ గ్రహ స్థితి వల్ల గర్భకోశ వ్యాధులు, రక్తము నకు సంబంధించిన వ్యాధులు, చిన్న చిన్న దెబ్బలకు అవకాశం ఉంది. వాహన స్థానానికి కుజ వీక్షణం, శని స్థితి వలన వాహన ప్రమాద సూచన ఉంది. ప్రయాణాలయందు జాగ్రత్తగా ఉండటం మంచిది. తల్లికి అనారోగ్యం లేదా తల్లితో విభేదాలు ఉంటాయి. తల్లి తరుపు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి కానీ కుటుంబ స్థానంలో రవి బుధ శుక్రుల స్థితి వల్ల మంచి వాక్చాతుర్యం, మాట నేర్పరితనం, మాటల్లో విశ్వసనీయత ఉంటాయి. తృతీయ స్థానంలో గురు స్థితి వల్ల ధైర్యం, సాహసం, తోడబుట్టిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉత్తరా నక్షత్ర జాతకులకు విపత్తార తో ప్రారంభం గనుక మిశ్రమ ఫలితం. హస్త వారికి సంపత్తార తో ప్రారంభం కనుక అధిక ఫలం. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారం జన్మతార అయినా భాగ్య రాజ్య స్థానాల్లో చంద్ర స్థితి వల్ల శుభ యోగాన్ని ఇస్తుంది.

పరిహారం : ఈ రాశివారు కుజ శని దోష నివారణకు ఆంజనేయస్వామిని పూజించుట, నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేసిన శుభ పరిణామాలు పొందుతారు.

తులా రాశి : ఈ రాశివారికి ఈ వారం భాగ్య మందు చంద్ర రాహు స్థితి కర్మాధిపతి అయిన చంద్రుడు ధర్మ స్థాన స్థితి వలన వృత్తిరీత్యా బాగుంటుంది. రాశ్యాధిపతి చంద్ర స్థానంలో ఉండటం వల్ల స్వయంగా అర్థ లాభం పొందుతారు. భాగ్య వ్యయాధిపతి కూడా లగ్నంలో ఉండటం వల్ల బుద్ధి కుశలత ఉంటుంది. కానీ రాశ్యాధిపతి రవితో కలయిక రవి నీచలో ఉండటం వల్ల నేత్ర, శిరో రోగములు సంభవిస్తాయి. తండ్రి తరపు వారితో విభేదము లేదా వారికి అనారోగ్యము. ధన స్థానంలో గురుడు ఉండటం వల్ల ధనమునకు లోటు లేని జీవితం. తృతీయ స్థానంలో శని కేతు స్థితి వలన ధైర్యము, సాహసము, సోదర సోదరీమణులతో అన్యోన్యత ఉంటుంది. భాగ్య రాహు వలన యశో నాస్తి. తల్లితో లేదా తల్లి తరుపు వారితో ఇబ్బంది లేదా గురువుతో ఇబ్బంది. విద్యార్థులకు ఉపాధ్యాయులతో విభేదాలకు అవకాశం ఉంది. వ్యయమందు కుజుడి వల్ల అనవసర యం

సుఖస్థానంలో కుజ స్థితి వల్ల ఈ వారం కాస్త కష్ట దాయకంగా ఉంటుంది. చిత్తానక్షత్ర జాతకులకు ఈవారంలో ప్రథమార్థం అష్టమ చంద్రుని వల్ల ఇబ్బంది. తర్వాత భాగ్య రాజ్య లాభ చంద్రుని వల్ల బాగా యోగించును.విశాఖా నక్షత్ర జాతకులకు మిత్రుల సహాయ సహకారాలు, భార్య తరపు వారి సహాయ సహకారములు ఉండును. మిత్ర పరమమిత్రతార వల్ల వివాహం శుభకార్యాలు కలిసి వచ్చును.

పరిహారం : కుజ రాహు గ్రహముల దోష స్థాన స్థితి తగ్గుటకు శ్రీ మహాగణపతి పూజ, అమ్మవారి కుంకుమార్చనలు లేదా గోసేవ శుభ ఫలితాలని ఇస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం అష్టమ స్థానములో చంద్ర రాహు స్థితి వలన కార్య విఘ్నములు ఉండును. గురు గ్రహ స్థితి అనారోగ్యమును సూచించును. వాక్ స్థానం లో శని కేతు స్థితి వలన ధనము, వాక్కు, కుటుంబం, నేత్ర సంబంధ సమస్యలు ఉండును. కానీ లగ్నాధిపతి లాభ స్థితి వలన కోర్టు వ్యవహారములు పరిష్కారమగును. కష్టేఫలి. వ్యయమందు రవి, బుధ, శుక్ర గ్రహ స్థితి వలన విశేష వ్యయము. సత్కార్యములు చేయుదురు. వివాహాది శుభకార్యములు జరుగును. సప్త మానికి గురు వీక్షణ వలన జీవిత భాగస్వామితో మైత్రి బాగుండును. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. స్వస్థానం కంటే పర స్థానములో బాగా రాణిస్తారు. అష్టమ రాహు స్థితి వలన తల్లిదండ్రులకి అనారోగ్య సూచన. విశాఖ 4వ పాదం వారికి మిత్ర తారతో ప్రారంభమైనప్పటికీ చంద్రుడు అష్టమంలో ఉండటం వల్ల కాస్త అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు సూచించును. అనురాధ నక్షత్ర జాతకులకు ఆవయోగములు ఎక్కువ. జ్యేష్ఠ నక్షత్రం వారికి సాధనతో ప్రారంభమైనప్పటికీ, చంద్రుడు అష్టమంలో ఉండటం వలన అనుకున్న స్థాయిలో ఈ వారం లాభించదు.

పరిహారం: శివాలయాన్ని దర్శించుట, రుద్రాభిషేకం, పుణ్య క్షేత్ర దర్శనం వల్ల లభించును.

ధను రాశి: ఈ రాశి వారికి సప్తమంలో చంద్ర రాహువులు స్థితి పొందుట, అష్టమాధిపతి అయిన చంద్రుడు అవయోగము. లగ్నములో శని కేతువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఏలినాటి శని, వ్యయమందు గురుడు వలన వారమంతా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఏకాదశంలో రవి యోగిస్తాడు. కానీ నీచలో పడుట వలన అంత శుభ పరిణామాలు ఉండవు. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కాస్త ఇబ్బందులు తగ్గుతాయి. ధనము, ఆరోగ్యము వంటి విషయాల్లో బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితో కాస్త ఇబ్బందులు తప్పవు. విదేశి ప్రయాణాల్లో లభించవు. మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారతో వారం ప్రారంభం కాబట్టి ఇబ్బందులు ఎక్కువ. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు నైధన తారతో వారం ప్రారంభమైనప్పటికీ సప్తమంలో చంద్రుడు, అష్టమంలో చంద్రుడు ఉండుటవలన మూల అంత కాకపోయినా ఎక్కువగానే ఇబ్బందులు ఉండును. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులకు విపత్తారతో ప్రారంభం అవుట, సప్తమంలో చంద్రుడు ఉండటం, అష్టమంలో చంద్రుడు ఉండుట, అందులోనూ రాహువుతో కలియుట వలన మిశ్రమ ఫలితమే కలుగును.

పరిహారం: ఈ రాశి వారికి ఈ వారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి పరమేశ్వరుని పూజించుట, నువ్వులు దానం చేయుట, నల్లని గొడుగు, నల్లని చెప్పులు దానం చేయుట విశేష ఫలితాన్ని సూచించును. పశ్చిమ దిక్కు ప్రయాణానికి అనుకూలం.

మకర రాశి: ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయిన శని వ్యయమందు ఉండుట అనారోగ్య సూచన. కానీ లాభమునందు గురుడు ఉండుట విశేష ఫలితం. శుక్ర, బుధ స్థితి సైతం విశేష యోగాన్ని కలిగిస్తుంది. చతుర్ధ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యమందు ఉండుట శుభ దాయకం. షష్ఠ స్థానంలో రాహువు శత్రు జయాన్ని, కార్య జయాన్ని సూచించును. తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు లాభమందు ఉండుటవలన మానసికంగా తెలియని వేదనను అనుభవిస్తూ ఉంటారు. సప్తమాధిపతి అయిన చంద్రుడు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల జీవితభాగస్వామితో కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులకు విపత్తార తో ప్రారంభం అయినప్పటికీ పంచమ, షట్, సప్తమ అష్టమ స్థానాల్లో చంద్రుడు ఉండటం వలన చంద్రబలం తగ్గిననూ రవి కేంద్ర మందు ఉండుట విశేషం యోగం. దశమాధిపతి దశమ కేంద్రంలో ఉండుట, కుజుడు భాగ్య కోణముల ఉండుట విశేషం యోగాలు. శ్రవణా నక్షత్ర జాతకుల వారిమాట ఈవారం చెల్లుబడి అవుతుంది. ధనిషా నక్షత్ర జాతకులకు విశేష శుభ ఫలితాలు.మొత్తానికి ఈ రాశివారికి ఈ వారం ఆనందదాయకం.

పరిహారం: ఈ వారం మహాలక్ష్మి పూజించుట, పూజకు తెలుపు రంగు పుష్పాలు వినియోగించుట విశేష ఫలితాలు ఇచ్చును. తెలుపు వస్త్రధారణ, ఆగ్నేయ దిశ ప్రయాణం కలిసి వచ్చును.

కుంభరాశి: ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయిన శని లాభము నందు ఉండటం విశేష యోగం. కర్మ స్థానములో గురుడు ఉండుటవలన వృత్తిరీత్యా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం. భాగ్య మందు శుక్రుని స్థితి స్వక్షేత్రంలో ఉండటం వల్ల తండ్రితో మంచి అనుబంధం ఉంటుంది. గురువు అనుగ్రహం లభిస్తుంది. భాగ్యమందు రవి తండ్రికి కాస్త అనారోగ్యాన్ని ఇచ్చినప్పటికీ శుక్రుడు స్వక్షేత్రం లో ఉండటం వలన ప్రమాదం ఉండదు. అష్టమంలో కుజ స్థితి వలన అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించుట కష్టం. వాహన ప్రమాదం సూచన ఉంది. వాక్కులో పరుషత్వం ఏర్పడవచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు జన్మ తారతో ప్రారంభం కావున అనారోగ్య సూచన అయినప్పటికీ సంపత్, విపత్, క్షేమ తారల వలన మిశ్రమ ఫలితం ఉంటుంది. శతభిషా నక్షత్ర జాతకులకు అన్ని వ్యవహారాలలోను మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మొత్తంమీద అష్టమంలో కుజుడు ఉండటం వలన కుటుంబ విషయములలోను, ప్రయాణం విషయములలోను ఇబ్బందులు ఉండును. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులపై కుజ వీక్షణ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ వారం పెద్దగా అనుకూలంగా ఉండదు.

పరిహారం: గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమం చేయుట, గణపతికి ఉండ్రాళ్ళు నివేదన సమర్పించుట, లేదా అర్క గణపతిని పూజించుట వలన విశేష ఫలితములు.

మీన రాశి: ఈ రాశి వారికి రాజ్యాధిపతి భాగ్య కోణము నందు ఉండటం, రాశిని వీక్షణ చేయటం వల్ల ధర్మగుణం, దానగుణం, పుణ్య క్షేత్ర దర్శనం, గురు అనుగ్రహం లభించును కానీ, సప్తమ కుజ స్థితి వల్ల భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు సూచించును. కుజుడు వాక్ స్థానమును చూడటం వలన వాక్కు యందు పరుషత్వం ఏర్పడవచ్చు. నేత్ర సంబంధ వ్యాధులు, మనోవేదనలకు అవకాశం. రాశ్యాత్ సప్తమంలో కుజుడు ఉండటం వల్ల, మూడు గ్రహాలు అష్టమ స్థానం లో ఉండుట అనారోగ్య సూచన. అయితే లగ్నాధిపతి భాగ్య కోణంలో ఉండుట వల్ల ఇబ్బందులు సామాన్యంగా ఉండును. పూర్వాభాద్ర నాల్గవ పాదం వారికి విపత్తార అయినప్పటికీ మిశ్రమ ఫలితాలు ఉండును. ఉత్తరాభాద్ర నైధన తార కాబట్టి అశుభ ఫలిత సూచన. రేవతి నక్షత్రం వారికి సాధన తార తో ప్రారంభం అయినప్పటికీ సప్తమ కుజుడు, అష్టమంలో మూడు గ్రహాల స్థితి వలన కూడా మిశ్రమ ఫలితమే అయినప్పటికీ కాస్త ఊరట లభించును.

పరిహారం: దత్తాత్రేయుడు, శ్రీకృష్ణుడు లేదా గురువులను పూజించుట, భగవద్గీత పారాయణ శుభ ఫలితములు ఇచ్చును.

Next Story