రాశి ఫలాలు నవంబర్ 10 నుంచి 16 వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 12:29 PM GMT
రాశి ఫలాలు నవంబర్ 10 నుంచి 16 వరకు

మేష రాశి: ఈ రాశి వారికి రాజ్యాధిపతి అయిన కుజుడు సప్తమ కేంద్రంలో ఉండుట ఉపయుక్తం. సప్తమంలో నీచ స్థానమును పొందిన రవి ఈరాశిని వీక్షించుట కించిత్ దోష యుక్తము. ఆరోగ్యభంగం, ప్రమాదములను సూచించుచున్నది. ధన సప్తమాధిపతి శుక్రుడు అష్టమ సంచారం బాగా లేకపోయినా కుజ, శుక్ర పరివర్తన యోగం ధనలాభాన్ని సూచిస్తుంది. కోర్టు వ్యవహారములు రాణిస్తాయి. ఇంటాబయటా మాట విలువ, మనిషి విలువ పెరుగుతుంది. అశ్విని వారికి పరమమిత్ర తార తో ప్రారంభం కాబట్టి చాలా బాగుంది. భరణి నక్షత్ర జాతకులకు యోగకాలం ప్రాప్తించినట్టే. కృత్తికా నక్షత్రం వారికి కొద్దిపాటి అననుకూలత ఉన్నది. ఈ రాశి వారు అందరూ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

పరిహారం: ఆదిత్య హృదయం పారాయణ, సూర్య నమస్కారములు, సూర్య దర్శనం, యోగసాధన మంచిది. శాకాహారం తినడం ఆరోగ్యకరం.

వృషభ రాశి: ఈ రాశి వారికి వ్యయ సప్తమాధిపతి కుజుడు, లగ్న షష్టాధిపతి శుక్రులు పరివర్తన పొందడం వల్ల కొంచెం మెరుగైన ఆలోచనలు, మంచి ఫలితాలు లభించనున్నాయి. ఆందోళనలు మాత్రం తప్పవు. దైవకృప, గురుకృప మిమ్మల్ని నడిపిస్తాయి. చంద్రుని వ్యయ స్థితి మీకు కొంత మానసిక అశాంతిని కలిగిస్తుంది. 12వ తేదీ నుంచి మీ ఆలోచనల్లో చురుకుదనం, తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉన్నది. విలాసాల కోసం ఖర్చు చేసినా తగినంత ఆనందాన్ని, ఆదాయాన్ని కూడా పొందగలరు. కృత్తికా నక్షత్ర జాతకులకు అననుకూలత కనిపిస్తుంది. రోహిణి వారికి మంచి జరుగుతుంది. మృగశిర 1, 2 పాదాల వారికి ప్రతికూలత కనిపించినా కార్య సాఫల్యత జరుగుతుంది.

పరిహారం: మెడిటేషన్ ద్వారా మనోనిగ్రహం సాధించగలరు. తాంత్రోక్త భైరవ కవచం మీకు మంచి చేస్తుంది.

మిథున రాశి: ఈరాశి వారికి సప్తమ గురుడు విజయ పతాకాన్ని ఎగురవేస్తారు. లగ్నాధిపతి గురుడి పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. ప్రతి పనిలోనూ గురు దైవాలు రెండింటి సహకారము లభిస్తుంది. శని అష్టమాధిపతి దృష్టి పనులను వెనక్కి లాగినా, గురుబలం ముందుకు తోస్తుంది. బుధునికి చంద్రుడు శత్రువు అయిన కారణంగా మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగము, వివాహము, నూతన వ్యాపారములకు అనుకూలత కలదు. ఈ ఫలితాలు మృగశిర వారికి కాస్త తక్కువగా ఉంటాయి. ఆరుద్ర వారికి మనోవ్యాకులత ఉన్నా ఆర్థికాభివృద్ధి ఉంది. పునర్వసు వారికి విపత్తార తో ప్రారంభమైనప్పటికీ కొంత సంతృప్తినిస్తుంది.

పరిహారం: గాయత్రి, రామాయణ పారాయణలు, దేవి స్తోత్ర పారాయణ లో శుభ ఫలితాలనిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారికి చంద్రుడు అధిపతి. మిత్రులైన రవి, బుధులు చతుర్ధమందు ఉండటం మంచిది. గురు శనులు షష్టములో ఉన్నా సములు అగుట వలన లాభం లేకపోయినా నష్టం ఉండదు. కుటుంబ వ్యవస్థలో చిన్న అశాంతి కనిపిస్తుంది. మీతో మీ మిత్రులు కూడా ఏకీభవించారు. గురు కృప, దైవబలం కూడా తగ్గుతుంది. కానీ గురుడు తన ఇంట్లో ఉండటం భాగ్యాధిపతి కాబట్టి యోగిస్తాడు. సమయానికి తగినట్లుగా మీరు ఆలోచించినపుడు మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా వహించినా అవకాశాలు చేజారిపోతాయి. ధనాధిపతి రవి చతుర్ధ కేంద్రంలో ఉండడం వలన మాతృ వర్గం వారికి ఆస్తి లేదా ధన నష్టం ఉంటుంది. పునర్వసు వారికి ప్రతికూలత ఎక్కువ. పుష్యమి వారికి ఆర్థిక లాభం. ఆశ్లేష వారికి కష్టానికి తగినంత మాత్రమే ఫలితం ఉంటుంది ఎక్కువ లాభం ఉండదు.

పరిహారం: విష్ణుసహస్రనామ పారాయణ మంచిది. అటుకులు, బెల్లం ఆవుకు తినిపించండి. తెల్లని వస్త్రం దానం చేయండి. సోమవారం నాడు పేదవారికి అన్నదానం మీకు శుభాన్ని ఇస్తుంది.

సింహరాశి: ఈ రాశివారికి పంచమ గురుడు మీకు, మీ పిల్లలకు కూడా లాభాన్ని చేకూరుస్తాడు. ఈ రాశి అధిపతి అయిన రవికి గురుడు మిత్రుడు అగుటవలన అన్ని పనులను నెరవేర్చుకోగలిగే సామర్ధ్యం ఉంటుంది. లగ్నాధిపతి రవి నీచ స్థానాన్ని పొందటం వల్ల కొన్ని తగువులు లో ఇరుక్కోవటం జరుగుతుంది. అనారోగ్యం కూడా మిమ్మల్ని కాస్త వెనుకంజ వేసేలా చేస్తుంది. శుక్ర శనులు శత్రువులు కావున తల్లి, భార్య ఆరోగ్యం జాగ్రత్తగా పరిరక్షించుకోండి. మనోధైర్యం, ఆత్మస్థైర్యం కలిగి ఉంటే విజయం మిమ్మల్ని వరిస్తుంది. రవికి మూల త్రికోణము కూడా సింహ రాశి కావటం వల్ల మీకు మీరే బుద్ధి చెప్పుకొని ముందుకు సాగుతారు. భూమి, ఇల్లు మీరు అమ్మకం చేయగలరు కానీ అమ్మకం వల్ల లాభం తక్కువగా ఉంటుంది. మఖ, పుబ్బ నక్షత్రాలకు పరమమిత్ర తార, మిత్ర తార కావడంతో అనుకూలత ఎక్కువ. ఉత్తర వారికి మాత్రం ప్రతికూల సూచనలు కలవు.

పరిహారం: సూర్య నమస్కారాలు చెయ్యండి. మంగళవారం జ్వాలాతోరణం వెలిగించి, దాని కింద నుంచి వెళ్లి దైవదర్శనం చేయండి సూర్య పంజర స్తోత్రం ఆరోగ్యాన్నిస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారికి గురుడు ప్రభావంతో అర్ధాష్టమ శని ప్రభావం తగ్గింది. బుదునికి చంద్రుడు శత్రువు కాబట్టి మానసిక ఆందోళనలు తప్పవు. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. వ్యయాధిపతి రవి ధన స్థానంలో రాజ్యాధిపతి బుధునితో ఉండటం వల్ల ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. కుజ శుక్ర పరివర్తన యోగం మంచి ఫలితాలు ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు ఒకటి రెండు వాయిదాలలో తేలవచ్చు. షష్ట భావాధిపతి శని ప్రభావం వల్ల మాట కటువుగా అవుతుంది. దీంతో మీ మాటకు విలువ తగ్గుతుంది. అనవసర సలహాలు ఇవ్వకుండా ఉండటం మంచిది. నిందలకు తావవుతారు. ఉత్తర వారికి అశుభ, అశాంతి సూచన. హస్త వారికి సాధన తార కావున కార్యజయం ఉంది. చిత్త వారికి ప్రతక్ తార తో వార ప్రారంభం కాబట్టి ప్రతికూలతలు సూచిస్తున్నాయి.

పరిహారం: మారేడు దళాలతో అర్చన, నెయ్యితో అభిషేకంమంచి ఫలితాలనిస్తాయి. అశ్వత్థ ప్రదక్షణ చేయండి.

తుల రాశి: ఈ రాశి వారికి లగ్నంలో రవి కుజులు ఉండటం వల్ల కళ్ళు, కాళ్లకు సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. కానీ రాజ్యాధిపతి శుక్రుడు, ధనాధిపతి కుజుడు పరివర్తన వలన ఆర్థిక సహకారం మరియు ధనలాభం ఉంటుంది. తృతీయాధిపతి గురుడు స్వక్షేత్ర, మూల త్రికోణ వర్తి కావడంతో మంచి ఆలోచన కార్యాచరణ ద్వారా ధనలాభాన్ని పొందుతారు. సోదర సోదరీ ప్రేమను సంపాదిస్తారు. తల్లి ఆరోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు కలవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మొత్తం మీద మీకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలున్నాయి. 75 శాతం పనులు మీకు మంచి ఫలితాలనిస్తాయి. వారం మధ్యలో మంచి వార్తలు వింటారు. సంగీత సాహిత్యాలు శాంతి, విశ్రాంతి ఇస్తాయి. చిత్తా నక్షత్రం వారికి ఫలితాలు తక్కువగాను స్వాతి వారికి సత్ఫలితాలు ఎక్కువగానూ ఉంటాయి. విశాఖ వారు ఆచితూచి అడుగు వేయాలి.

పరిహారం: సూర్య నమస్కారాలు సూర్య స్తోత్రాలు ఆరోగ్యాన్నిస్తాయి. గోసేవ, తులసి అర్చన సత్ఫలితాలు ఇస్తాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ద్వితీయ మందు గురుడు ధన శుభుడు. ద్వితీయ మందు శని కూడా సముని ఇంట్లో సమునితో కలవడం యోగ దాయకం గా మారుతోంది. వ్యయ రవి వలన సోదరీ, మాతృ వర్గాల వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటికి తగిన విధంగా సూచనలు, పరిష్కారాలు అందుతాయి. ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. దూరప్రయాణాలు శుభకార్యాల ప్రయత్నాలు ఈ వారంలో ఫలిస్తాయి. 12 వ ఇంట్లో కుజుడు లగ్నాదిపతి కావున ఏ ఇబ్బందులు కలుగవు. క్రమక్రమంగా ఈ రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పవచ్చు. నేత్ర, హృదయ సంబంధిత అనారోగ్య సూచనలు కలవు. ముందు జాగ్రత్త అవసరం. సకాలంలో అన్ని అమరుతాయి. కొత్త వ్యక్తులు, కొత్త ప్రదేశాలను చూడటానికి అనుకూలం. విశాఖ వారికి విపత్తార తో ప్రారంభం కనుక కొద్దిగా అననుకూలం. అనురాధ వారికి సంపత్తారతో ప్రారంభం కనుక మంచి లాభం ఉంటుంది. జ్యేష్ఠ వారికి జన్మతార తో ప్రారంభం కావున ఆరోగ్యంపై దృష్టి పెడితే మంచిది.

పరిహారం: ఆయు సూక్త పారాయణ లేదా మృత్యుంజయ జపం మంచిది. దత్తాత్రేయునికి సంబంధించిన పారాయణ చేయండి.

ధను రాశి: ఈ రాశి వారికి గురు బలం బాగా పెరుగుతున్నాయి. మూల త్రికోణ అధిపతి, జన్మ గురుడు పైగా పుష్కర సమయం కాబట్టి మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ వారందరికీ చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ఊహించకుండానే పనులు చక్కగా జరిగే అవకాశాలున్నాయి. చంద్రుని అనుకూలత ఉంది. వ్యయ మందు శుక్రుడు ఉన్నా రాజ్యాధిపతి కి శుక్రుడు సమ బలం వల్ల కూడా వీరికి భోగ యోగ కాలం వచ్చిందని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో సద్దుమణుగుతాయి. మూల వారికి పరమమిత్ర తార తో ప్రారంభం కాబట్టి శుభ ఫలితాలు సూచిస్తాయి. పూర్వాషాడ వారికి మిత్ర తార తో ప్రారంభం కనుక సానుకూలత ఎక్కువ. పూర్వాషాడ వారికి మాత్రం చిన్న చిన్న సమస్యలకు సర్దుబాటు అవసరం.

పరిహారం: గురువార నియమాలు పాటించండి. గంధం బొట్టు, అమ్మవారికి గంధంతో స్నానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురు స్తోత్ర పారాయణం శుభకరం.

మకర రాశి: ఈ రాశి వారికి తను స్థానాధిపతి శని వ్యయ యందు ఉన్నందువల్ల ఆర్థిక లాభాలు లేకపోయినా నష్టం కలుగదు. కానీ గురుడు వ్యయ ముందు చేరడం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. సమయానికి తగు ఆలోచన రాదు. కానీ కేతువు మీ ద్రుష్టి ని దైవధ్యానం వైపు మళ్ళించును. అదే అభ్యాసం గా మారితే మంచే జరుగుతుంది. గురుని సంయోగం వలన ఏలినాటి శని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. రవి కుజుడు అష్టమంలో కలయిక అనారోగ్య సూచన, వాహన భయం కూడా ఉంది. మీలో మానసిక.శారీరక పటిష్టత తగ్గును. ఉత్తరాషాడ వారికి నైధన తారతో ప్రారంభం కష్టం సూచన. శ్రావణ నక్షత్రం వారికి సాధన తార కావున కర్మసాఫల్యం ఎక్కువ. ఆకస్మిక వస్తు, వస్త్ర ప్రాప్తి. ధనిష్ఠ వారికి ప్రత్యక్ తారతో ప్రారంభం కావున చిన్న చిన్న ప్రతికూలతను సూచిస్తున్నది.

పరిహారం: నువ్వుల నూనె దీపం వెలిగించండి. పేదవారికి దానధర్మాలు చేయండి. పౌర్ణమి జ్వాలా తోరణం వెలిగించండి. ఆ తోరణం క్రింది నుంచి గుడిలో కి వెళ్ళండి.

కుంభరాశి: ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తాత్కాలికంగా తగ్గుతుంది. ఇంతకు ముందులాగా ఎక్కువ ఇబ్బంది పెట్టదు. లగ్నాధిపతి లగ్నము లగ్నం పై గురు దృష్టి వలన యోగం కలుగుతుంది. వివాహము, కోర్టు వ్యవహారములు మొదలగునవి అతి సులువుగా నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారమే అనవచ్చు. బద్ధకం, అతి నిద్రను కాస్త దూరం పెట్టండి. గ్రహానుకులత ఎక్కువగా ఉండటం వల్ల చాలా కాలముగా నెరవేరవు అనుకున్న పనులు నెరవేరుతాయి. పాత శత్రువులు మిత్రులు అవుతారు. ఏదన్న మంచి పనిని సంకల్పం చేయండి ఎందుకంటే ఈ వారం మీరు ఒక అడుగు వేస్తే పది అడుగుల సహకారం లభిస్తుంది. 8వ తేదీ మీకు లాభించు అవకాశం ఉంది. ధనిష్ఠ వారికి, పూర్వభద్ర వారికి ఫలాలు కాస్త తక్కువ, శతభిషం వారికి పరిపూర్ణ ఫలితం ఉంటుంది.

పరిహారం: అమ్మవారి స్తోత్రాలు చేయండి. నువ్వుల నూనె దీపదానం, నువ్వుల దానం మంచిది. జ్వాలా తోరణాన్ని దర్శించుకోండి.

మీన రాశి: ఈ రాశి వారికి చాలా అనుకూలతలు ఉన్నాయి. అమృతం దొరికినంత ఆనందాన్ని అనుభవించగలుగుతారు. అన్ని మార్గాలు తెరిచి ఉన్నాయి. అందుకోవడమే ఆలస్యం. మీకు వచ్చిన అవకాశాలలో ఏది పొందాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అయితే చివరి నిర్ణయం మాత్రం మీదై ఉండాలి. విద్యా వ్యాపారం వ్యవహారం అన్నింటికీ శుభ సూచన. మీ ప్రేమ ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగము వివాహము సమకూరుతాయి. ధనము గౌరవమూ మీ కరతలామలకం అవుతాయి. ఉత్తరాషాడ వారికి పూర్తి ఫలితం. రేవతి, పూర్వాభాద్ర వారికి మధ్యమం.

పరిహారం: జ్వాలా తోరణం మంగళవారంనాడు కనీసం 11 దీపాలు వెలిగించండి. లక్ష్మీదేవి స్తోత్రం చేయండి.

Next Story