వార ఫలాలు: మార్చి 22 నుండి 28 వరకు..

By అంజి  Published on  22 March 2020 2:12 PM GMT
వార ఫలాలు: మార్చి 22 నుండి 28 వరకు..

మేష రాశి

మేష రాశి :- ఈ రాశివారికి చాలా శుభప్రదంగా వారం ప్రారంభం కాబోతోంది. ఉద్యోగానికి అనుకూలతలు కూడా ఉన్నాయి. పదో స్థానంలోకి కుజుడు రావడం వల్ల చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనారోగ్యం లోంచి కూడా బయటపడే అవకాశం వుంది. వీరికి శుక్రుడు యోగిస్తున్నాడు. గురుడు తాలుకు ప్రభావం కూడా వుంది మంచిగానే అయితే రాహు ప్రతికూలత నిచ్చాడు గనుక వారం మధ్యలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. నూతన వస్తు వాహనాలను కొంటారు. కానీ వ్యయం ఎక్కువగా ఉంటుంది. అంతే కాదు స్థానభ్రంశము స్థాన చలనం గాని ఉంటుంది . కుటుంబాలతోనే గాని బంధువులతో గానీ మనస్పర్ధలు ఎక్కువ . రాజకీయ నాయకులకు మాత్రం ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ప్రతికూలిస్తాయి. అశ్విని నక్షత్ర జాతకులకు సాధనతారతో వారం ప్రారంభం గనుక బాగుంది. భరణి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తారైంది కాబట్టి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కృత్తిక ఒకటో పాదం వారికి క్షేమ తారైంది చాలా బావుంది.

పరిహారం :- సూర్యోపాసన చాలా అవసరం .ఆదివారం నాడు ఉపవాసం గోధుమలు దానం చేయండి.

వృషభరాశి :-

ఈ రాశివారికి ఈ వారం ఉల్లాసంగా ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం కూడా కొన్ని శుభ ఫలితాలు ఇస్తుంది. గత బాధలు కొన్ని నివృత్తి అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. కొత్త వాహనాన్ని కూడా కొనబోతున్నారు . భూ సంబంధమైన వ్యవహారాలు కూడా అనుకూల పడితాయి.వ చదువు కూడా బావుంటుంది. పనులు కూడా మీరు అనుకున్నంత సాఫీగా సాగుతాయి. ఏవైతే ఒక పథకం ప్రకారంగా మీరు ముందుకు వెళ్లాలనుకున్నారో అవన్నీ కూడా నెరవేరితాయి. ఆరోగ్య సమస్య ఉంది అది మిమ్మల్ని బాదిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా పొందగలుగుతారు. ఇంట్లో వివాహం కావాల్సిన వాళ్లుంటే వారికి వివాహం అవుతుంది. వారాంతాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అష్టమ గురుడి వల్ల మీరు అలసిపోవడం మాటపడి పోవడమో కోపం ఎక్కువైపోవడమో జరుగుతాయి. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వారికి క్షేమతారతో వార ప్రారంభం బాగుంది. రోహిణి వారికి ఈ వారం విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. మృగశిర ఒకట్రెండు పాదాల వారికి క్షేమ తార కాబట్టి శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి

పరిహారం :- గురువారం నాడు బెల్లం దానం చేయండి చాలామంచి ఫలితం లభిస్తుంది. గణపతికి సంబంధించిన పూజ కూడా మీకు అనుకూలతనిస్తుంది.

మిథున రాశి :-

ఈ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితంగా కనిపిస్తూ ఉంది. ఈ వారం నుంచి కొంచెం కాలసర్ప యోగం మీ మీద ఎక్కువ ప్రభావం చూపించబోతోంది. ఆరుద్ర నక్షత్రానికి ఇంకా ఎక్కువగా ఉంది. రాజకీయపరంగా ఎవరైనా వెళ్తే దాంట్లో మీకు పదవీభంగమే కాదు జైలుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. చదువు విషయంలో మానసిక ఆందోళన కలుగుతుంటుంది. వీరికి ఇప్పుడున్న వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో ఉద్యోగము, కుటుంబము, భార్యా పిల్లల ఇలా అన్ని విషయాల్లో కూడా వీరికి ప్రతికూలతే. ఇది అధిగమించడానికి గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తుంది. వీరికి అకారణ కలహాలు అవుతాయి. వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. మధ్యమధ్యలో మీకు ధనలాభం కొద్దికొద్దిగా వస్తుంది. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి సంపత్ తారైంది చాలా బావుంది. ఆరుద్ర వారికి జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే చాలాఇబ్బందులు ఉన్నాయి . పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి పరమ మిత్ర తారైంది బాగుంది .

పరిహారం :- సర్పసూక్తం పారాయణ చేయిస్తే మంచిది. చండీ పారాయణ దేవీ ఖడ్గమాల పారాయణ సుబ్రహ్మణ్య ఆరాధన చాలా ముఖ్యమ్.

కర్కాటక రాశి :-

ఈ రాశివారికి మిశ్రమ ఫలితంగా రోజులువరాబోతున్నాయి. కుజుడు కొంచెం బావున్నాడు గనుక భూమిని సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వారికి అనుకూలంగా ఉంది. అమ్మడం కొనడం పనులు చేసేవాళ్లు కూడా చాలా బాగుంది. రైతులు కూడా చాలా లాభ పడతారు. చిన్నచిన్న దెబ్బలు తగిలక తప్పదు. వ్యయం లో రాహు సంచారం వీళ్లకి ఇబ్బందుల్ని పెంచుతుంది. ఒకానొక సమయంలో స్థానభ్రంశం గానీ స్థానచలనం గానీ జరుగుతుంది. కానీ అనుకూలంగా ఉండదు. కంటికి సంబంధించి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. బంధువులతో కూడా ఇబ్బంది ఉంది. బయటకు వెళ్లేటపుడు కొంచెం జాగ్రత్త వహించండి. వాహనాల్లో ప్రయాణం చేసి టటువంటి వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలు మాత్రం మారటానికి అవకాశాలు లేవు. దైవదర్శన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. పునర్వసు నాలుగో పాదం వారు పరమమిత్ర తారైంది బావుంది. పుష్యమి వారికి మిత్రతార అయింది శుభ ఫలితాలున్నాయి. ఆశ్లేష వారికి నైధన తారైంది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్త పడండి.

పరిహారం :- విష్టు సహస్ర నామ పారాయణ చేసిన తులసి మాలలతో శ్రీ మహా విష్ణువును అర్చించినా శుభ ఫలితాలని పొందగలుగుతారు.

సింహ రాశి :-

ఈ రాశివారికి చాలా మంచి ఫలితాలు కలుగబోతున్నాయి. కుజుని మార్పు వల్ల వీళ్లు చాలా పరిపూర్ణ అనుగ్రహము లు పొందగలుగుతారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ప్రశంసలే ప్రశంసలు. ఆనందానికి అడ్డు లేదు. వస్త్రాలాభం ధనలాభం శ్రమకు తగిన ఫలితం మీ విద్యకి మీ తెలివితేటలకి గొప్పదైన గౌరవం లభిస్తుంది. ధర్మ కార్యాలు చేసే ఆలోచన మీకు కొత్తగా కలుగుతుంది. మీ తెలివితేటలు కూడా ఒక్కసారిగా ఇనుమడిస్తాయి. వారం మధ్యలోమాత్రం చిన్న ఇబ్బందులున్నాయి. గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కొత్త వస్తువుల సేకరణ విశేష ధనప్రాప్తి స్థిరాస్తి అభివృద్ధి ఒకటి కాదు చాలా శుభఫలితాలు పొందనున్నారు. ఇంట్లో వివాహం కావల్సిన వాళ్లు ఉంటే వాళ్లకోశం ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు మానుకోండి ఆకస్మికంగా ప్రయాణించి నందువల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. మఖా నక్షత్రం వారికి సాధన తారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుబ్బా నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార ఐంది. ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఉత్తర ఒకటో పాదం వారికి క్షేమ తారైంది శుభ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- సూర్యనారాయణ స్వామి పూజ , చండీ అమ్మవారి పూజలు చేసుకున్నట్లయితే ఇంట్లో కల్యాణ పరమైనటువంటి వాతావరణ ఏర్పడుతుంది.

కన్యా రాశి :-

ఈ రాశివారికి ఈ వారం నుంచి అనుకూలతలు ప్రారంభం కానున్నాయి. పంచమ కుజుడు మీకు ఈ రోజు నుంచి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఉగాదినాడు మీరు పొందే గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. గొప్ప ఆనందాన్ని మీరు పొందబోతున్నారు. అలాగే కుటుంబపరంగా మిమ్మల్నందర్నీ గౌరవిస్తారు. చంద్ర సంచారం కూడా మీకు మానసికమైన అనందాన్ని ఇవ్వబోతున్నది. మీరు సాధించిన ప్రగతిని చాలామంది మెచ్చుకుంటారు. మీకు ఆర్థికంగా కూడా లాభం కలుగుతుంది. మీకు బంధువులు ఇబ్బందిని కలిగించినా క్రమంగా అనుకూలిస్తూ ముప్పై తేదీ దాటేక మీరింకా ఆనందాన్ని పొందబోతున్నారు. మీరు ఇన్నాళ్లు పడిన శ్రమని కొంత మరిచిపోయే టటువంటి అవకాశముంది. అలంకార ప్రాప్తి కూడా ఉంది. విశేష వస్తు వాహన సౌఖ్యం ఉంది .

సంతాన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీవారి విషయంలో పడిన ఇబ్బందిని మరిచిపోయే అవకాశం ఉంది. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి క్షేమతారైంది కాబట్టి ఫలితాలు బాగున్నాయి. హస్తా నక్షత్రం వారికి మాత్రమే విపత్తార అయింది రాహు ఆధిపత్యం వల్ల మీకు ప్రతికూలంగా ఉంది . చిత్త ఒకట్రెండు పాదాలు వారికి సంపత్తారైంది కాబట్టి మంచి ఫలితాలను పొందగలుగుతున్నారు.

పరిహారం :- ఈ వారంలో మీరు గణపతి ఆరాధన చేసిన తేనెతో పరమేశ్వరునికి అభిషేకం చేసినా మంచి ఫలితాలు పొందగలుగుతారు.

తులా రాశి :-

ఈ రాశి వారికి ఈవారం కొంచెం అనుకూలంగా బావుంది. శారీరక కష్టం కొంచెం ఎక్కువైనా చంద్రుని వల్ల మానసిక బలాన్ని మళ్లీ పొందడానికి ప్రయత్నిస్తారు. కుటుంబపరంగా ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది. రాజకీయ రంగాల్లో ఉండే వాళ్లయితే చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సివస్తుంది. కొన్ని సమయాల్లో జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. గెజిటెడ్ ఆఫీసర్ లు ఇన్కమ్ ట్యాక్స్ రంగాల్లోని వ్యక్తులకు కూడా ఇబ్బందే. తులకి నాలుగవ ఇల్లైన మకరంలో శని స్వక్షేత్రంలో ఉన్నా కుజుడు తన ఉచ్చ క్షేత్రం లోకి రావడం గురుడు తన నీచ క్షేత్రం లోకి వెళ్ళబోవటం ఇవి అనర్థ దాయకాలు. టెలికామ్ రంగాల్లో ఉన్న వారికి స్థాయిమార్పు పేరు ప్రతిష్టలు కూడా కొంచెం భంగ వుంది. ఆచి తూచి అడుగు వేయడం చాలా అవసరము. చిత్తా నక్షత్ర మూడు నాలుగు పాదాలు వారికి సంపత్ తార కాబట్టి మంచి ఫలితాలు పొందగలుగు తున్నారు. స్వాతి వారికి జన్మతార అయింది కాబట్టి ఆరోగ్యపరమైన సమస్య. విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి పరమమిత్రతార మిశ్రమంగా సాగిపోతుంది.

పరిహారం :- కందులు దానం చేస్తే కుజుడికి మంచిది. శనికి నువ్వులు ఉప్పు దానం చేయించండి. పరమేశ్వరునికి ప్రదోషకాలం అంటే సాయంత్రం అభిషేకం చేయించండి.

వృశ్చిక రాశి :-

ఈ రాశి వారికి క్రమక్రమంగా అనుకూల రోజులు ప్రారంభమౌతున్నాయి. తృతీయ కుజుడు అవటం వల్ల వీరికి ఇన్నాళ్లు పోగొట్టుకున్న ఆనందం ఆరోగ్యం ధనము సుఖము అన్ని కూడా మళ్లీ పొందగలుగుతారు. నూతన గృహ ప్రవేశాలు చేస్తారు. సన్నిహితులు బంధువులు వీళ్లందరూ వీరిని అభినందిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి పొందే మార్పులున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనానికి అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు కూడా ఇనుమడింపజేస్తాయి. భూలావాదేవీలు ఉన్నట్లయితే అవి కూడా సద్దుమణిగి పోయి ప్రశాంతంగా ఉంటారు ఎన్నికల్లో ఉండే రాజకీయ నాయకులైనట్లయితే అభివృద్ధిని సాధిస్తారు. విశాఖ నాల్గవ పాదం వారికి పరమ మిత్ర తారైంది చాలా బాగుంది. అనూరాధ వారికి మిత్ర తారైంది చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. జ్యేష్ఠ వారికి నైధన తారైంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులున్నాయి.

పరిహారం :- మరిన్ని శుభఫలితాలు పొందాలి అంటే రాహు దోషం పోవడం కోసం మినుగులు దానం చేయండి. గారెలు వండి చతుష్పాద జంతువులు పెట్టినట్లయితే మంచి ఫలితాలొస్తాయి.

ధను రాశి :-

ఈరాశి వారికి ఈ వారం చాలా చిత్రవిచిత్రంగా మార్పులు రాబోతున్నాయి. దీనికంతటికి కారణం కాలసర్ప యోగము. గురుని మార్పు పూర్తిగా ఎప్పుడు జరుగుతుందో అప్పుడే వీరి జాతకంలో మార్పులు మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోరు. మీకా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బందులు పడతారు. ఈ వారం చివర్లో ఉద్యోగ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరూ చెప్పే వారే కానీ సరైన మార్గాన్ని మీకు సూచించే వారుండరు. ఎక్కువమంది మీ నాశనాన్ని కోరుకునే వారుంటారు. పట్టుదలతో ఉంటే మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ముప్పై వ తేది తరువాతనే మీకు అనుకూలమైన ఆర్థిక ఆరోగ్యపరమైన వాతావరణాలు వస్తాయి. భయపడకుండా ఉండండి. కాలసర్ప యోగం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మూలానక్షత్రం వారికి సాధన తారైంది ప్రతికూల తక్కువగా ఉంది. పూర్వాషాఢ వారికి ప్రత్యక్ తారైంది ఫరవాలేదు. ఉత్తర ఒకటో పాదం వారికి ప్రత్యేక్ తారైంది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- శనికి ఉప్పుదానము సుబ్రహ్మణ్యపూజ సర్పసూక్త పారాయణముమంచిది. నాగ సింధూర ధారణ మంచి ఫలితాన్నిస్తాయి.

మకర రాశి :-

ఈ రాశివారికి చాలా ఇబ్బంది పెట్టబోతోంది కాలసర్పయోగం. మానసికంగా తలపులు ఎక్కువగా ఉండి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. మీరు మంచిగా ఆలోచించాను అనుకుంటారు కానీ ఆ సూచనలు ఎవరికీ పనికిరాకుండా పోతాయి. అవి మరింత ఇబ్బంది కలుగజేస్తాయి. రాజకీయ పరంగా ఉన్న వారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఉన్నత పదవులు కూడా పొందలేకపోతారు. గజిటెట్ అఫీసర్స మీడియా సిబ్బంది ప్రతి ఒక్కరికి సమస్య సమస్య సమస్య. మీ ఉద్యోగాన్ని మీ ఆర్థిక స్థితిగతులు గాని ఒక్కసారిగా కింది స్థాయికి దిగజారిపోయే అవకాశాలు. బాధలన్నీ ఒకే సారి ఈ రాశివారికి వస్తున్నాయని చెప్పడంలో తప్పేంలేదు. కారణం గ్రహస్థితి మాత్రమే. మీ ఆలోచనలు గ్రహఅనుకూలత లేకపోవడం వల్ల ఆ మాటలు తప్పుగానే బయటకొస్తాయి. దైవమే దిక్కు. మీకు కొత్త వ్యాపారాలు ప్రారంభించొద్దు. స్తబ్దుగా ఉండటం అంటారే అలా ఉంటేనే బావుంటుంది. మీ నిర్ణయాలు ఎవరికీ చెప్పకండి. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. మీ కుటుంబాన్ని మీ దైవాన్ని మీరెంత నమ్మితే అంత అనుకూలతగా ఉంటుంది అన్ని గ్రహాలు ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి మీ నిర్ణయాలు మీలోనే ఉంచుకోవాలి ఇతరులకు సలహాలు ఇవ్వకండి. ఆర్థిక లాభం మాత్రం ఉంది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి క్షేమ తార అయింది కాబట్టి ఫలితాలు బాగున్నాయి. శ్రవణ నక్షత్రం వారికి విపత్తు తారైంది ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ఠ ఒకట్రెండు పాదాల వారికి సంపత్తార కాబట్టి ఆర్థికంగా బావుంటుంది.

పరిహారం :- ఈ రాశి వారు ప్రతిరోజు సాయంత్రం శివుడి సందర్శనం చేయండి శివ ప్రార్థనలు చేయండి శివుడి కొరకు ఒక దీపం వెలిగించండి ఇంతకంటే మీరు చేయగలిగింది ఏమీ లేదు ఇంతకంటే మీరేమీ చెయ్యలేరు కూడా.

కుంభ రాశి :-

ఈ రాశివారికి ఎవరూ ఎదుర్కోలేనన్ని ఇబ్బందుల్ని వీరు ఎదుర్కోబోతున్నారు. స్థానచలన ఉంటుంది. సుఖం తక్కువగా ఉంటుంది. నిద్రాభంగం అయిపోతుంది. ఆలోచనలు ఇబ్బంది పెడితాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వెన్నుపోటు పొడిచే వాళ్లు చాలా ఎక్కువగా ఉంటారు. మీకు భయం భయంగానే ఈ సంవత్సరం ప్రారం అవుతుంది. మీ తెలివికి పరీక్షగా మారిపోతుంది. ఊహలాఎక్కువ. మీరు చేసే పనులు ఫలితాలు తక్కువ. రియల్ ఎస్టేట్ వాళ్లయితే చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి వస్తుంది. సినీ రంగం వారు ఇబ్బందులే. మీకు అధోగతి పడుతున్నదని అనుకోవాలి. మీ మార్గము మీ దృష్టి మీపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. మీకు ఎవరు ఏ సలహా ఇచ్చినా అది మీకు పనికిరాకుండా పోతుంది. మీరు ఎవరికీ సలహాలివ్వకండి. శత్రువర్గం బాగా పెరిగింది. వ్యాపారంలో కూడా నమ్మకం తక్కువై మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. ఆరోగ్యపరంగా పర్వాలేదు. ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి సంపత్తార అయింది బావుంది. శతభిషం వారికి మాత్రమే జన్మతార అయింది కాబట్టి ఆర్థిక స్థితి చూసుకోండి. పూర్వాభాద్ర ఒకట్రెండు మూడు పాదాల వారికి పరమ మిత్రతార ఫర్వాలేదు.

పరిహారం :- రుద్ర పారాయణ చేయించండి దానివల్లే ఉపశమనం. శనికి జపాలు చేయించిన కందులు దానం చేసిన నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు వస్తాయి.

మీనరాశి :-

ఈ రాశి వారికి ఈ వారం సంతోషం ఉత్సాహం ఉల్లాసం ఆహ్లాదం ఆనందం అన్నీ కలగలిసి ఒకేసారి వస్తాయి. కుటుంబానికి దగ్గరగా జీవించగలుగుతారు. సభ్యత సఖ్యత అన్నీ పెరుగుతాయి. పదవి ఉన్నవారికి ఉన్నత స్థితి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. ఏ స్థాయిలో ఉన్నవారైనా ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అర్ధాష్టమ రాహు తాలూకు ప్రభావం వల్ల వీరు వాహనాలు నడిపేటప్పుడు లేదా చతుష్పాద జంతువులకి దూరంగా మాత్రము ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారు సినిమా రంగంలో ఉన్నవాళ్లు అధికారంలో ఉన్నవారు ఆఫీసర్లు వీరందరూ కూడా మంచి మంచి స్థాయిల్ని గౌరవాన్ని పేరు ప్ర ప్రతిష్టల్ని ప్రఖ్యాతిని గౌరవ మర్యాదల్ని అన్నీ పొందగలుగుతారు. ఏ స్థాయిలో ఉన్న వారికైనా ప్రతిపని కరతలామలకంగా మారుతుంది. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి పరమ మిత్ర తారైంది పర్వాలేదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మిత్ర తారైంది శుభ పలితాన్ని చాలా ఎక్కువగా పొందుతారు. రేవతి వారికి నైధన తారైంది కాబట్టి వ్యతి రిక్త ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త వహించండి.

పరిహారం :- అర్ధాష్టమ రాహు గ్రహ దోషం పోవడానికి మినుగులు దానం చేయడం మంచిది. శివునికి అభిషేకం సూర్య నమస్కారాలు చేయండి మంచిది.

Next Story