నెల్లూరులో దారుణం.. యువతిపై అత్యాచారం చేసి..

By సుభాష్  Published on  6 Jan 2020 9:52 AM GMT
నెల్లూరులో దారుణం.. యువతిపై అత్యాచారం చేసి..

దేశంలో హత్యలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాలు ఎంతటి కఠిన చర్యలు చేపట్టినా కామాంధుల తీరులో మార్పురావడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..ఎక్కడో ఓ చోటు ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో దుండగులు ఓ యువతిని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసి హతమార్చారు. ఈ ఘటనపై తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గూడూరు మంలం చవటపాలెంకు చెందిన పర్వేన్‌ (23) అనే యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. సోమవారం ఆమె మృతదేహాన్ని ఇంటి సమీపంలోని స్థానికులు గురించి కుటుంబీకులకు సమాచారం అందించారు. నిన్నటి నుంచి అదృశ్యమైపోయిన పర్వేన్‌ ఇలా విగతజీవిగా కనిపించడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Next Story
Share it