ప్రారంభమైన రంగంపేట జల్లికట్టు
By Newsmeter.Network Published on 16 Jan 2020 5:04 PM IST
చిత్తూరు జిల్లాలో రంగంపేటలో జల్లికట్టు ప్రారంభమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కనుమ పండుగ రోజు జల్లికట్టును నిర్వహించడం ఇక్కడి ఆనవాయితి. జిల్లాలోని కోడెద్దులు రంకెలు వేస్తూ ముందుకు దూసుకొచ్చాయి. జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు జరుగుతున్నా.. రంగంపేట జల్లికట్టు చూడడానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. తమిళనాడులో జరిగే జల్లికట్టుకు..ఇక్కడ జరిగే..పోటీలకు చాలా తేడా ఉంది. పలకలు, టవల్స్ బిగిస్తుంటారు. వీటిని చేజిక్కించుకొనేందుకు యువకులు పోటీ పడుతుంటారు.
పరుగులు తీస్తున్న ఎద్దులను అడ్డుకొనే సమయంలో పలువురికి గాయాలవుతుంటాయి. ఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయి. మరోవైపు జల్లికట్టు వేడుకలు చూసేందుకు సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్‌లు హాజరయ్యారు. వారిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు.
Next Story