కారులో శృంగారం.. కరోనా రూల్ ఉల్లంఘన కింద అరెస్టు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 20 March 2020 8:42 PM IST

కారులో శృంగారం.. కరోనా రూల్ ఉల్లంఘన కింద అరెస్టు

కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్నివణికిస్తోంది. 10వేలమందికి పైగా మృత్యువాత పడగా.. 2లక్షలకు పైగా దీని బాధితులు ఉన్నారు. కరోనా వైరస్‌ రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని ఓ వైద్యులు, మరోవైపు ప్రభుత్వాలు పదే పదే హెచ్చరిస్తున్నా.. ప్రజలు పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా లేదు. ఇటలీలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.

కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయినా.. ప్రస్తుతం ఇటలీలో ఎక్కువగా ఈ వైరస్‌ విజృభిస్తోంది. చైనాలో కంటే ఇటలీలోనే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో ‘లాక్‌డౌన్’ ప్రకటించింది. గుంపులు గుంపులుగా ప్రజలు ఎక్కడ బడితే అక్కడ తిరగకుండా నిషేదించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ప్రజలు పక్క పక్కనే నడవ కూడదని, మనిషికి మనిషికి మధ్య కనీసం ఒకటి నుంచి రెండు మీటర్ల దూరం ఉండాలని పేర్కొంటున్నారు. చివరికి కార్లలో కూడా ప్రజలు పక్క పక్కన కుర్చోకూడదని, ముందు ఒకరు వెనుక సీట్లో ఒకరు మాత్రమే కుర్చొని ప్రయాణించాలనే రూల్‌ను పెట్టారు. తాజాగా ఓ ప్రేమ జంట ఈ నిబంధనను ఉల్లగించింది.

ఇటలీ కరోనా విజృభిస్తున్న ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. కళాశాలలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. మాల్స్ అన్నీ మూసేసి.. ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశాలిస్తే.. కుటుంబాలతో కలిసి పిక్నిక్‌లకు వెళ్లారు. దీంతో నిబంధనలు కఠినతరం చేశారు. ఎవరూ బయట తిరగవద్దని.. కనిపిస్తే కరోనా నిబంధనల ఉల్లంఘన కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. కాగా.. మిలాన్ శివారులోని రోడ్డుపక్కన 23 ఏళ్ల ఈజిప్టు యువకుడు, 43 ఏళ్ల తునీషియా మహిళ కారులో శృంగారం చేసుకుంటూ పోలీసుల కంట పడ్డారు. దీంతో పోలీసులు వారిపై ‘కరోనా వైరస్ దిగ్బంధం నియమం’ఉల్లంఘన కింద వారిని అరెస్టు చేశారు. అయితే వీరిపై కారులో శృంగారం చేసుకుంటున్న కేసు పెట్టకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు ఒకే సీట్లో కలిసి ఉన్నారనే కారణంతోనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story