రానా 'అరణ్య' మూవీ విడుదల తేదీ ఖరారు

By సుభాష్  Published on  21 Oct 2020 10:05 AM GMT
రానా అరణ్య మూవీ విడుదల తేదీ ఖరారు

రానా తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాను నటించిన హాథీ మేరీ సాధీ (తెలుగులో అరణ్య, తమిళ్‌లో కాదన్‌)కు విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఓ మోషన్‌ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. అందులో ఒక పగిలిన గోడ, ఏనుగులు, జలపాతం ఉండగా, ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. కాగా, ఈ మూవీలో విష్ణు విశాల్‌, జోయా, హుస్సేన్‌, శ్రియ, పల్డావొంకర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మించింది. శంతను మొయిత్రా సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, తమిళ్‌ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈనెల 15 నుంచి దేశ వ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని సినిమాలు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Next Story