ఎఫ్‌2 సినిమాకు జాతీయ అవార్డు

By సుభాష్  Published on  21 Oct 2020 7:23 AM GMT
ఎఫ్‌2 సినిమాకు జాతీయ అవార్డు

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌ 2 మూవీ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఫీచర్‌ ఫిలిం కేటగిరిలో ఎఫ్‌ 2కు ఈ అవార్డు దక్కింది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అవార్డులను ప్రకటించింది. దీంతో అవార్డు సాధించిన ఏకైక సినిమా ఎఫ్‌2 కావడం విశేషం.

ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌గా ఎఫ్‌ 2 తెరకెక్కింది. ఇందులో తమన్నా, మోహ్రీన్‌ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌ రాజ్‌, సుబ్బరాజు, ప్రగతి, నాజర్‌, అన్నపూర్ణ, ఈశ్వరీరావు, వై. విజయం తదితరులు ఈ సినిమాల్లో కీలక పాత్ర పోషించారు. దిల్‌ రాజ్‌ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. 2018 సంక్రాంతికి ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఈ సిజన్‌లో బిగ్గెస్ట్‌ కలెక్షన్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేస్తుండగా, తెలుగులో ఎఫ్‌ 2 సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారు. అనిల్‌ రావిపూడి.

Next Story