ప్రభాస్‌ అభిమానులకు సర్‌ఫ్రైజ్‌.. ఫస్ట్‌ లుక్‌ అదిరింది

By సుభాష్  Published on  21 Oct 2020 6:50 AM GMT
ప్రభాస్‌ అభిమానులకు సర్‌ఫ్రైజ్‌.. ఫస్ట్‌ లుక్‌ అదిరింది

ప్రభాస్‌ అభిమానులకు పండగే. రాధే శ్యామ్‌ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో ప్రభాస్‌ పుట్టిన రోజు ఉండగా, అతనికి అడ్వాన్స్‌ బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఫస్ట్‌ లుక్‌ తో పాటు పాత్ర పేరును కూడా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌ విక్రమాధిత్యగా కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్‌లో కారుపై ఊబర్‌ కూల్‌లో లుక్‌లో డార్లింగ్‌ అదరగొడుతున్నారు. ఇక కారుపై ప్రభాస్‌ అని పేరు ఉండటం విశేషం. మొత్తానికి ప్రభాస్‌ అభిమానులనే కాకుండా సినీ ప్రేక్షకులందరికీ ఈ లుక్‌ ఆకట్టుకుంటోంది.

కాగా, రొమాంటిక్‌ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భాగ్యశ్రీ సచిన్‌ కేడ్కర్‌, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్‌, గోపికృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రాథే శ్యామ్‌ని పలు భాషాల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక అక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌ పేరిట మోషన్‌ పోస్టర్‌ను విడదల చేయనున్నారు చిత్ర బృందం.Next Story