కరోనా వైరస్‌ పేరు చెబితే చాలు ప్రజలందరూ వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు బయటి దేశాలకే పరిమితమమనుకున్న వైరస్‌ మన దేశంలో కూడా విజృభిస్తోంది. ఆ పేరు వింటేనే అందరూ వణిపోతుంటే.. దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం కరోనా వైరస్‌కే వార్నింగ్‌ ఇస్తున్నాడు. డియర్ వైరస్, బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూ పోయే బదులు నువ్వు కూడా చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలుసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే. నా మాటపై నమ్మకం లేకపోతే వెంటనే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకో. కాబట్టి నీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్వు బతుకు, మమ్మల్ని బతకనివ్వు. నీకు కూడా జ్ఞానం ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను అంటూ ట్విట్టర్‌లో ట్వీటాడు ఈ డైరెక్టర్‌.

అంత ముందు మరో ట్వీట్‌లో చైనా వస్తువుల గురించి రాసుకొచ్చాడు. మనం ఉపయోగించే వాటిలో చాలా వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇప్పడు చావు కూడా చైనాదేనా అంటూ కామెంట్ చేశాడు. చివరికి మన చావు కూడా మేడ్ ఇన్ చైనా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ సూపర్‌ ట్విట్‌ పెట్టాడు. ఇదిలా ఉంటే.. ఈ దర్శకుడి ట్వీట్లపై నెటీజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. మీలాగా దానికి ట్విట్టర్ అకౌంట్ లేదు. కావాలంటే.. మీరే హస్పిటల్‌కు వెళ్లి దానికి వార్నింగ్‌ ఇవ్వండి ఒకరు ట్వీట్‌ చేయగా.. నిజం చెప్పారండి.. చైనాతోనే మన జీవితం అంతం అయ్యేలా ఉంది అని మరో నెటీజన్‌ కామెంట్ చేశాడు.

 

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.