దర్శకులు, హీరోలపై వర్మ సెటైర్..కండలు చూపిస్తూ అలా..
By సుభాష్ Published on 27 May 2020 10:25 AM GMTటాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు ఎవరంటే ఎవరైనా టక్కున చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ. రెండు నెలల నుంచి కొనసాగుతోన్న లాక్ డౌన్ కాలంలో ఆర్జీవీ కరోనా పై ఓ పాట పాడారు. అది విన్న నెటిజన్లు చెప్పలేని భాషలో తిట్ల దండకం అందుకున్నారు. అంతేకాక ఏకంగా ఓ సినిమానే తెరకెక్కించేశారు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు కూడా. ఈ ట్రైలర్ కు ఎవరూ ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కరోనా వైరస్ కంటే కరోనా సినిమా ట్రైలరే బాగా భయపెడుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం మీద తానే ముందుగా కరోనా పై సినిమా తీశానంటూ ఆర్జీవీ తనకు తానే గొప్పలు చెప్పుకున్నారు.
ఇక బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కూడా ఆర్జీవీ కరోనా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. లాక్ డౌన్ కాలంలో ఆర్జీవీ ఓ చిత్రాన్ని తెరకెక్కించడం సామాన్యమైన విషయం కాదని అమితాబ్ అభిప్రాయపడ్డారు. అందరికీ ఆర్జీవీ..రాము గా తెలిసిన రామ్ గోపాల్ తనకు మాత్రం సర్కార్ లా కనిపిస్తారని బిగ్ బి అన్నారు. కాగా..కరోనా ట్రైలర్ చూస్తుంటే లాక్ డౌన్ సమయంలో ఓ కుటుంబం ఇంట్లో ఎలా ఉంటోంది. వారి మధ్య ఉండే సాన్నిహిత్యం, అభిప్రాయ బేధాలు, భార్య భర్త ల మధ్య రిలేషన్ వంటి విషయాలను తెలియజేసేలా సినిమాను తెరకెక్కించినట్లు అనిపిస్తోంది.
కరోనా సినిమా తీయడం నిజంగా ప్రశంసనీయమే అయ్యుండొచ్చు కానీ..ఆర్జీవీ అలా ఇండస్ట్రీ పై సెటైర్ వేయడం తగదంటున్నారు కొందరు విమర్శకులు. ఇంతకూ ఆర్జీవీ ఇండస్ట్రీ గురించి ఏమన్నారో తెలుసుకుందాం.. ఓ నెటిజన్ ఆర్జీవీ ని ఉద్దేశిస్తూ మీరు ఇంట్లో గిన్నెలు కడగరు. బట్టలు ఉతకరు. ఇల్లు తుడవరు. లాక్ డౌన్ లో ఏ ఒక్క ఇంటి పనిని చేయలేదు..మేం మీ కోసం ట్వీట్లు చేయం అంటూ చేసిన ట్వీట్ కు ఆయన స్పందించారు. ఇండస్ట్రీకి సంబంధించిన మిగతా దర్కులు, హీరోలు, సింగర్లు ఇంట్లో ఇలాంటి పనులు చేస్తే..నేను ఓ సినిమా తీశాను అని గొప్పగా చెప్పుకుండా కండలు చూపిస్తున్న ఎమోజీని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.