నక్సలైట్‌గా రామ్‌చరణ్‌

By సుభాష్  Published on  11 Feb 2020 10:09 AM GMT
నక్సలైట్‌గా రామ్‌చరణ్‌

హీరో రామ్‌చరణ్‌ రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామారాజు పాత్రం చేస్తుంటే, ఎన్టీఆర్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్‌ తెలంగాణ యోధుడు కొమరం భీమ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్‌ నటి ఒలివియా మోరిస్‌ నటిస్తుండగా, రామ్‌చరణ్‌కు జోడిగా హిందీ భామ అలియా భట్‌ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 70శాతం వరకు పూర్తయింది. ఇక ఈ మూవీ తర్వాత చరణ్‌ కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో నటించనున్నాడు. కాగా, చిరంజీవి ప్రధాన పాత్రలో సామాజిక నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీకి 'ఆచార్య' అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

కాగా, ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం రామ్‌చరణ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మూవీలో ప్లాష్‌ బ్యాక్‌ సీన్లలో మెగాస్టార్‌ యువకుడుగా ఉన్న పాత్ర కోసం రామ్‌ చరణ్‌ చేయనున్నాడనే టాక్‌ వినిపిస్తోంది. ప్లాష్‌ బ్యాక్‌లో చిరంజీవి పాత్ర పోషిస్తున్న చరణ్‌ నక్సలైట్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ దాదాపు 30 నిమిషాల పాటు కనిపించే ఈ పాత్ర ఓ రేంజ్‌లో ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం. ఇక చిరంజీవి సరసన నటి త్రిషను నటిస్తుండగా, రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వానీని చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.

Next Story
Share it