టిక్ టాక్ వీడియో చూసి ఎమోషనల్ అయిన బన్నీ..!

By రాణి  Published on  11 Feb 2020 6:54 AM GMT
టిక్ టాక్ వీడియో చూసి ఎమోషనల్ అయిన బన్నీ..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంతో తెరకెక్కిన అలవైకుంఠ పురములో సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ అంతా ఆ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో ముందుగా వచ్చిన 'సామజవరగమన' పాట బన్నీ ఫ్యాన్స్, లవర్స్ తో పాటు సంగీత ప్రియులను కూడా బాగా ఆకట్టుకుంది. దాని తర్వాత బాగా పాపులర్ అయిన పాట బుట్టబొమ్మ. ఈ పాటను చాలా మంది యువకులు తమ ప్రియురాళ్లకు అంకితం చేస్తూ..చేసిన వీడియోలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్..కాదు యూత్ నడిపిస్తోన్న ట్రెండ్ టిక్ టాక్. ఇందులో ఒక సాంగ్ పాపులర్ అయిందంటే చాలు. ప్రతిఒక్కరూ దానికే స్టెప్పులేసేస్తుంటారు. అదే పంథాలో మన తెలుగు బుట్టబొమ్మ పాట భాషతో సంబంధం లేకుండా ఉత్తరాదిన, దక్షిణాదిన కూడా బాగా ట్రెండ్ అవుతోంది. ఇటీవలే బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా ఈ పాటకు స్టెప్పులెయ్యగా..ఆ వీడియో బాగా వైరల్ అయింది. సామాన్యులైతే వదిలేస్తారు గానీ...ఇలాంటి బ్యూటీ స్టెప్పులేసిందంటే..ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తారో తెలిసిన సంగతే కదా. ఇక విషయానికొస్తే తాజాగా..టిక్ టాక్ లో వచ్చిన ఒక డ్యూయెట్ వీడియో బన్నీకి చేరిందట. బుట్టబొమ్మ సాంగ్ కి ఒక యువకుడు, యువతి డ్యూయెట్ చేశారు. ఇందులో ఏముంది వింత..అందరూ చేసేదేగా అనుకుంటే పొరపాటేనండోయ్..

ఈ వీడియోలో డ్యూయెట్ చేసింది ఇద్దరు దివ్యాంగులు. కాళ్లు లేని యువకుడు బుట్టబొమ్మ పాటకు తన చేతులతో స్టెప్పులేసి టిక్ టాక్ లో పోస్ట్ చేయగా..ఆ వీడియోకి చేతుల్లేని యువతి డ్యూయెట్ చేసింది. ఈ డ్యూయెట్ వీడియో అటు తిరిగి..ఇటు తిరిగి హీరో అల్లు అర్జున్ కంటపడింది. వీడియో చూసిన బన్నీ భావోద్వేగానికి గురయ్యానని బన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అలాగే ఈ వీడియోని సంగీత దర్శకుడు తమన్ కూడా షేర్ చేశారు.Next Story