తిరుమల: టీటీడీ ఆలయ ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు నియమితులయ్యారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రమణ దీక్షితులు ఆలయ ప్రవేశానికి మార్గం సుగమమైంది. గతంలో రమణదీక్షితులు ఆలయ ప్రధానార్చకుడిగా పనిచేశారు. సుమారు ఏడాదిన్నర విరామం తర్వాత ఆయనకు మళ్లీ టీటీడీలో చోటు కల్పించారు. దీనితో పాటు యువ అర్చకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను కూడా రమణ దీక్షితులు నిర్వర్తించనున్నారు. అలాగే ఆయన కుమారులు వెంకట కుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులను గోవిందరాజ స్వామి ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి బదిలీ చేశారు. రమణ దీక్షితులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన నలుగురికి కూడా శ్రీవారి ఆలయంలో పున:ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది. అయితే తన నియమాకం నేపథ్యంలో రమణదీక్షితులు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిశారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.