వ‌ర్మ బ‌యోపిక్. డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..?

By Newsmeter.Network  Published on  2 Dec 2019 7:39 AM GMT
వ‌ర్మ బ‌యోపిక్. డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా..?

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎలాంటి సినిమాలు తీస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. తాజాగా తెర‌కెక్కించిన క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు సెన్సార్ ద‌గ్గ‌ర ఆగింది. అయితే... ఎదుట వ్య‌క్తి ఎలా ఫీల‌వుతాడో.. అని ఆలోచించ‌కుండా.. త‌న ఇష్టం వ‌చ్చినట్లు సినిమాలు తీసే వ‌ర్మ పై సినిమా తీయ‌డానికి ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత‌, క‌వి జొన్న‌విత్తుల స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది.

ఈ సినిమాని తెలుగుతో పాటు త‌మిళ్, హిందీ భాష‌ల్లో కూడా రిలీజ్ చేయాల‌నికుంటున్నార‌ని టాక్ వినిపిస్తోంది. వ‌ర్మ పాత్ర పోషించే న‌టుడు కోసం వెతికి ఆఖ‌రికి వ‌ర్మ‌లా ఉన్న మ‌ధ్య ప్ర‌దేశ్ లో ఉండే వ్య‌క్తిని క‌లిసి ఈ చిత్రంలో న‌టించేందుకు ఒప్పించిన‌ట్టు స‌మాచారం. వ‌ర్మ వితండ‌వాదన‌లు, పోర్న్ సినిమా తీయ‌డం, వివాద‌స్ప‌ద సినిమాలు తీయ‌డం... ఇలా వ‌ర్మ‌కు సంబంధించిన అన్ని అంశాల‌తో వ‌ర్మ‌కు కౌంట‌ర్ అనిపించేలా ఈ క‌థ‌ను రెడీ చేస్తున్నార‌ని సమాచారం.

ఈ సినిమా కోసం జొన్న‌విత్తులకు సాయం చేస్తామ‌ని... వ‌ర్మ అంటే ప‌డ‌ని కొంత మంది ముందుకు వ‌చ్చినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే... ఈ సినిమాని కాస్త సీరియ‌స్ గానే తీసుకున్న‌ట్టు అనిపిస్తుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

Next Story
Share it