వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఎప్పుడు ఎలాంటి వివాదాలు సృష్టిస్తాడో ఎవ్వరికి తెలియదు. ఇక తాజాగా పవన్‌ కల్యాణ్‌ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత దిల్‌రాజు, బోనీకపూర్‌ నిర్మాణంలో వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘వకీల్‌ సాబ్‌’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ‘వకీల్ సాబ్’ మూవీ లుక్‌ఫై అభిమానులతో పాటు సినీ వర్గాలు సైతం పాటిజివ్‌గా స్పందిస్తుండగా, ఇక రాంగోపాల్‌ వర్మ ఈ లుక్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ.. సెటైర్లు వేశారు.

వకీల్‌ సాబ్‌గా పవన్‌ కల్యాణ్‌ ఒక కుర్చీలో కూర్చోని కాలుపై మరో కాలు వేసుకుని కేసు విచారిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ లుక్‌ ఉంది. కాగా, పవన్‌ కల్యాణ్‌ లుక్‌ ఉన్నట్లే రామ్‌గోపాల్‌ వర్మ కూడా కాలుపై కాలు వేసుకుని కుర్చీపైక కూర్చోని వ్యంగ్యంగా ” డైరెక్టర్‌ సాబ్‌” అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశాడు. కాగా, వర్మ.. పవన్‌ను టార్గెట్‌ చేయడం ఇది కొత్తేమి కాదు. ఒక్క పవన్‌ కల్యాణే కాదు..ఎందరినో టార్గెట్‌ చేయడం అందరికి తెలిసిందే. ప్రస్తుతం వర్మ దిశ అత్యాచారం ఘటనపై ‘దిశ’ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.