'క్లైమాక్స్' చిత్రానికి ఆన్‌లైన్ రేటు ఫిక్స్ చేసిన వ‌ర్మ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2020 3:50 PM GMT
క్లైమాక్స్ చిత్రానికి ఆన్‌లైన్ రేటు ఫిక్స్ చేసిన వ‌ర్మ‌

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌. నిత్యం ఏదో ఒక ఒక‌టి చేసి వార్త‌ల్లో ఉండ‌డం వ‌ర్మ‌కు అల‌వాటు. ట్విట్ట‌ర్‌లో ఎవ్వ‌రిని ఎప్పుడు తిడ‌తాడో.. పొగుడుతాడో వ‌ర్మ‌కే తెలియాలి. వ‌ర్మ తెర‌కెక్కించిన చిత్రం 'క్లైమాక్స్‌'.

శృంగార తార మియా మాల్కోవా, వ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తున్నరెండో చిత్రం. గ‌తంలో 'జీఎస్టీ' అనే చిత్రం తీశాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్లు, ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో ట్రైల‌ర్ శ‌నివారం సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 6న రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చెప్పాడు వ‌ర్మ.

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయ‌నున్నాడు. డిజిటల్ పార్మాట్ లో స్పెషల్ గా ‘ఆర్జీవీ వరల్డ్’ అనే యాప్ ను డిజైన్ చేయించి శ్రేయాస్ ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లతో కలిసి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నాడు. ''మియా మాల్కోవా 'క్లైమాక్స్' మూవీ జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నా. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా అని త‌న ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. అంటే రెండు సార్లు ఈ చిత్రాన్ని చూడాలంటే రూ.200 పే చేయాల‌న్న‌మాట‌.Next Story