ర్యాప్ సాంగ్ పాడిన రకుల్.. వీడియో వైర‌ల్‌

By సుభాష్  Published on  28 Oct 2020 2:36 PM IST
ర్యాప్ సాంగ్ పాడిన రకుల్.. వీడియో వైర‌ల్‌

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ర‌కుల్ ప్రీత్ ‌సింగ్‌. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సామాజిక అంశాల‌పై స్పందిస్తూ ఉంటుంది. ఇక

లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న ఇంట్లో చేసే ప‌నుల‌తో పాటు వ‌ర్కౌట్లు వీడియోలు అభిమానుల‌తో పంచుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అమ్మడు త‌న‌లోని కొత్త ట్యాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసింది. 'కరే ని కర్దా రాప్' ఛాలెంజ్‌లో పాల్గొని అద్భుతంగా ర్యాప్ సాంగ్ పాడింది. ఆ పాటకు రకుల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు, పాడిన విధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నుంచి రకుల్ ఈ ఛాలెంజ్‌ను స్వీకరించింది. ''కరే ని కర్దా రాప్'కు నన్ను నామినేట్ చేసినందుకు, వీడియోను రూపొందించడానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు అర్జున్ కపూర్. నాకు మీలా చాలా సహాయం చేశారు. అందువల్లే మీలా సగం సగం కాకుండా పూర్తిగా ర్యాప్‌ను పాడగలిగాన'ని రకుల్ పేర్కొంది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అనంతరం ఈ ఛాలెంజ్‌కు నటుడు, టీవీ హోస్ట్ అపరశక్తి ఖురానాని నామినేట్ చేసింది.

Next Story