రామారావు - రాజ‌మౌళి ఇంట్ర‌స్టింగ్ ట్వీట్. ఇంత‌కీ... ఏంటా ట్వీట్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Sep 2019 1:50 PM GMT
రామారావు - రాజ‌మౌళి ఇంట్ర‌స్టింగ్ ట్వీట్. ఇంత‌కీ... ఏంటా ట్వీట్..?

రామారావు - రాజ‌మౌళి ఇంట్ర‌స్టింగ్ ట్వీట్. ఇంత‌కీ... ఏంటా ట్వీట్..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొందిన తొలి చిత్రం 'స్టూడెంట్ నెం 1'. ఈ సినిమా విజ‌యం సాధించి ఇద్ద‌రికీ మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సింహాద్రి, య‌మ‌దొంగ చిత్రాలు చేయ‌డం.. ఈ రెండు సినిమాలు కూడా సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డం తెలిసిందే. తాజాగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్ఆర్ఆర్' లో చ‌ర‌ణ్ తో పాటు తార‌క్ కూడా న‌టిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

Image

అయితే... ఎన్టీఆర్ - రాజ‌మౌళిల 'స్టూడెంట్ నెం 1' సినిమా 18 సంవ‌త్స‌రాల క్రితం స‌రిగ్గా ఇదే రోజున రిలీజైంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంట్ర‌స్టింగ్ గా ట్వీట్ చేశారు. 'స్టూడెంట్ నెం.1' షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు. అయితే ..ఈ 18 ఏళ్లలో ఎంతో మారిపోయింది .కానీ..రాజమౌళితో కలిసి పనిచేస్తున్నప్పుడు లభించే వినోదం మాత్రం మారలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా... 'స్టూడెంట్ నెం.1' చిత్రంలో ఫుట్ పాత్ పై పడిపోయిన హీరోయిన్ కు తాను చేయందిస్తున్న ఫొటోను కూడా ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Image

అదే సీన్ ను ఇప్పుడు రాజమౌళితో రిపీట్ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఆ ఫొటోలో చూడొచ్చు. రాజ‌మౌళి కూడా ట్విట్ట‌ర్ లో ఇదే విష‌యం గురించి స్పందించారు. ఇదే రోజున 18 సంవ‌త్స‌రాల క్రితం స్టూడెంట్ నెం 1 రిలీజ్ అయ్యింది. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాం. తార‌క్ లో చాలా మార్పు వ‌చ్చింది అంటూ తార‌క్ తో ఉన్న‌ నాటి ఫొటో, నేటి ఫొటో షేర్ చేశారు.

Next Story
Share it