ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై మ‌ళ్లీ మొద‌లైన ర‌చ్చ‌.. ఆందోళ‌న క‌లిగిస్తోన్న వైర‌ల్ లేఖ‌

By సుభాష్  Published on  30 Oct 2020 5:42 AM GMT
ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై మ‌ళ్లీ మొద‌లైన ర‌చ్చ‌.. ఆందోళ‌న క‌లిగిస్తోన్న వైర‌ల్ లేఖ‌

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం కోసం ఆయ‌న అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని.. ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన అరంగేట్రం మొదలకముందే ముగియనుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిన్నటి వైర‌ల్‌గా మారిన ఆ లేఖ‌పై ర‌జ‌నీకాంత్ స్పందించారు. ఆ లేఖ తాను రాసింది కాద‌న్నారు. స‌రైన స‌మ‌యంలో రాజ‌కీయ ప్ర‌వేశంపైనా స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు.

వైర‌ల్ అయిన లేఖ‌లో ఏం ఉందంటే..?

రజనీ పేరిట వచ్చిన లేఖలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించిన సమాచారం ఉంది. 2011లో రజనీకాంత్ కిడ్నీ వ్యాధి బారినపడడంతో సింగపూర్ లో వైద్యం చేయించుకున్నారని, 2016లో కిడ్నీ సమస్య తిరగబెట్టడంతో ఈసారి అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్నారని అందులో వివరించారు. అంతేకాదు, ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున, కిడ్నీ వ్యాధిగ్రస్తుడైన రజనీకాంత్ ఎంతమాత్రం బయట తిరగలేని పరిస్థితి ఉందని, ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా బయట తిరగడం సాధ్యం కాకపోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి వల్ల రోగనిరోధక శక్తి కనిష్టస్థాయికి చేరిందని, ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం ఉన్నందున బహిరంగ సభల్లో పాల్గొనడం ప్రాణాలకే ముప్పు అని లేఖలో వివరించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో నేను ఏ నిర్ణ‌యం తీసుకోవాలి అనేది అభిమానులు, ప్ర‌జ‌ల‌కే వ‌దిలేస్తున్నా అని ర‌జ‌నీ కోరిన‌ట్లు ఆలేఖ‌లో ఉంది. దీంతో ర‌జ‌నీకాంత్ అభిమానుల్లో ఆందోళ‌న మొద‌లైంది.

స్పందించిన ర‌జ‌నీ..

ఆ లేఖ తాను రాసింది కాన్నారు. అయితే.. అందులో త‌న ఆరోగ్యం గురించిన స‌మాచారం నిజమేన‌ని చెప్పారు. ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా డాక్ట‌ర్ల‌ను క‌లిసి వారి సూచ‌న‌ల‌ను పాటిస్తున్న‌ట్లు చెప్పారు. రాజ‌కీయ ప్ర‌వేశం గురించి మాట్లాడుతూ.. దీనిపై ర‌జ‌నీ మక్క‌ల్ మండ్ర‌మ్‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నారు. త్వ‌ర‌లోనే పార్టీ, రాజ‌కీయ ప్ర‌వేశంపై త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తాన‌న్నారు.

Next Story