సూపర్ స్టార్ రజనీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం ద‌ర్బార్. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పోలీస్ పాత్రలో సరికొత్తగా… అభిమానుల‌కు కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ర‌జ‌నీ – మురుగుదాస్ కాంబినేష‌న్ లో మూవీ అని ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… దర్బార్ సినిమా షూటింగ్ పార్ట్ ని పూర్తి అయ్యింది. చిత్ర యూనిట్ త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టనుంది. పొంగల్ కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ముందు నుంచి అభిమానులకు అప్డేట్ ఇస్తున్న దర్బార్ టీమ్ ప్రమోషన్స్ కి కూడా స్పెషల్ ప్లాన్ వేసుకుంటోంది. ఆడియెన్స్ టీజర్ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

షూటింగ్ పూర్తవ్వడంతో నెక్స్ట్ టీజర్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నివేత థామస్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. అనిరుద్ రవిచందర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మ‌రి… ఈ ద‌ర్బార్ తో బాక్సాఫీస్ వ‌ద్ద ర‌జ‌నీకాంత్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.