రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్‌.. క్వారంటైన్‌లో కరోనా

By సుభాష్  Published on  5 Jun 2020 2:53 PM IST
రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్‌..  క్వారంటైన్‌లో కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ ఎవ్వరిని వదలడం లేదు. అయితే సౌత్ ‌ఇండియా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు అంటూ బాలీవుడ్‌ నటుడు రోహిత్‌ రాయ్‌ సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చాడు. దీంతో రజనీ అభిమానులంతా ఇక్కసారిగా కంగారు పడ్డారు. తర్వాత ఇది అబ్దమని తెలియడంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రోహిత్‌పై రజినీ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

కాగా, నటుడు రోహిత్‌రాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో 'రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కానీ కరోనా క్వారంటైన్‌లో ఉంది' అని పోస్ట్‌ చేశాడు. ముందు ఇది ట్వీట్‌ను చదివిన నెటిజన్లు అది జోక్‌ అంటూ దుమ్మెత్తిపోతున్నారు. జోక్‌ చెత్తగా ఉంది, ఇలాంటి జోక్‌ భారతీయ సంస్ఖృతికాదు, కరోనా కామెడీ కాదు, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అంటూ విమర్శల వర్షం కురిపించారు.

దీంతో నెటిజన్లు మండిపడుతుండటంతో రోహిత రాయ్‌ స్పందించారు. ఎందుకంత ఆవేశపడుతున్నారు. ఈ పోస్టు వెనుక నా ఉద్దేశం కేవలం మిమ్మల్ని నవ్వించడం మాత్రమే. కామెంట్‌ చేసే ముందు నా ఉద్దేశం ఏమిటో గమనించగలరు. నేను వేసిన జోక్‌ పేలకుండా ఉండి, మిమ్మల్ని బాధ పెట్టిందంటే .. ఆ బాధ నన్ను ఇంకా బాధ పెట్టింది.. కానీ ఇలా అవుతుందనుకోలేదు. అందుకు క్షమించండి అంటూ సమాధానం ఇచ్చుకున్నాడు.

Next Story