రజనీ - ఖుష్బూ జోడీ తెరపైకి రాబోతుందా..!
By Newsmeter.Network
చెన్నై: రజనీకాంత్ 'దర్భార్' మూవీ కోసం ఆయన అభిమానులంతా వేయు కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలకి సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే మరో వైపు శివ దర్శకత్వంలో.. రజనీ 168వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ చిత్రంలో రజనీ సరసన ఖుష్భూ నటించే అవకాశాలున్నాయని జోరుగా వినిపిస్తోంది. ఈ మేరకు ఖుష్బూని సంప్రదించారని సమాచారం. అయితే తమిళనాట రజనీకాంత్- ఖుష్బూ జోడికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. మళ్లీ ఇంతకాలానికి ఈ జోడీని తెరపై చూసే అవకాశం లభించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.
కాగా.. కొంతకాలంగా రజనీ సరసన కుర్ర హీరోయిన్లు కాకుండా.. సీనియర్ హీరోయిన్స్ వుండేలా చిత్రబృందం ఎంపిక చేస్లున్నారు. రజనీ ఇటీవలే నటించిన 'కాలా', 'పేట' చిత్రాల్లో సీనియర్ నాయికలే మెరిసి అలరించారు. ఈ నేపథ్యంలో రజనీ సరసన ఖుష్బూ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. శివ- రజనీ కలయికలో చిత్రం వస్తుందనే విషయం తెలిసిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అయితే మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో ఖుష్బూ అడుగుపెడుతుందో, లేదో వేచి చూడాలి.