కొత్త అవతారం ఎత్తబోతున్న రజనీకాంత్‌.. పూర్తి డైలాగులన్నీ..

By సుభాష్  Published on  14 Oct 2020 6:05 AM GMT
కొత్త అవతారం ఎత్తబోతున్న రజనీకాంత్‌.. పూర్తి డైలాగులన్నీ..

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవడ్‌లో ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో రజనీ అన్నాత్తే అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మాస్‌ ఎంటర్‌టైన్‌నర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీ పాత్ర కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌ గ్రామ సర్పంచ్‌గా కనిపించనుండగా, ఈ క్రమంలోరజనీకాంత్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. అన్నాత్తే మూవీలో రజనీ పాత్రకు సంబంధించిన పూర్తి డైలాగ్‌లు ఆయనే రాసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై దర్శకుడు శివతో సంప్రదింపులు జరిగాయని, అదుకు శివ కూడా అంగీకరించినట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం.

అంతేకాకుండా తన డైలాగ్‌లు రాసే పనిలో రజనీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే రజనీ రైటర్‌ కోణం అభిమానులకు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా, ఈ సినిమాలో నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్‌, సూరి తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు జాక్రీష్రాఫ్‌ నటిస్తుండగా, డి. ఇమ్మన్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story