ఆర్జీవీని ఆటపట్టించిన దర్శకధీరుడు
By రాణి
ఆర్జీవీ. ఈ పేరు సినీ ఇండస్ర్టీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఆర్జీసీ అంటేనే గుర్తొచ్చేవి వివాదాలే. అలాంటి వివాదాస్పద దర్శకుడిని ఆటపట్టిస్తూ దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. విషయం ఏమిటంటే..వర్మ తాతయ్యారు. అమెరికా ఉన్న ఆయన కూతురు రేవతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇది తెలిసిన రాజమౌళి ‘‘కంగ్యాట్యులేషన్స్ రాము తాతగారు. మీకు కళ్లెం వేయబోతున్న మీ మనవరాలికి నా అభినందనలు. మరి మీకేం కావాలి రాము నాన్నా లేక రాము తాతయ్య’’ అని ట్వీట్ చేసి ఆటపట్టించారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు తెగ కామెంట్లు, రీ ట్వీట్లు చేసేస్తున్నారు. వర్మను ఆడుకోవడానికి విమర్శకులకు మంచి ఛాన్స్ దొరికినట్లయింది.
కాగా..ఇటీవలే రామ్ గోపాల్ వర్మ సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య పై సినిమా తీయబోతున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కూడా ఆయన కలిసినట్లు తెలిపారు. దిశ ఒక్కదానికే కాకుండా అతని భార్యకు కూడా చెన్నకేశవులు అన్యాయం చేశాడని, చిన్న పిల్ల మరో పసిప్రాణానికి జన్మనివ్వబోతోందని ట్విట్టర్ లో తెలిపారు.