నాసా మూన్ మిషన్‌లో ఇండియన్ అమెరికన్

By Newsmeter.Network  Published on  12 Jan 2020 5:33 AM GMT
నాసా మూన్ మిషన్‌లో ఇండియన్ అమెరికన్

ముఖ్యాంశాలు

  • నాసా మూన్ మిషన్ లో ఇండియన్ ఆస్ట్రొనాట్
  • అరుదైన ఘనత సాధించిన తెలంగాణ బిడ్డ
  • రాజా యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో కల్నల్
  • 2005లో అధికారికంగా బెంగళూరుకు వచ్చిన రాజా
  • ఎయిర్ షోలో పాల్గొన్న తర్వాత తిరిగి వెళ్లిన రాజా

హైదరాబాద్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డా తెలుగు కుటుంబానికి చెందిన రాజాజాన్ విర్ పుత్తూర్ చారి నాసా వ్యోమగామి ట్రైనింగ్ ను పూర్తి చేసుకుని మూన్ మిషన్ కు ఎంపికయ్యారు. నాసా మూన్ మిషన్ కోసం ఎంపిక చేసిన పదకొండుమందిలో రాజా ఒకరు కావడం విశేషం.

వ్యోమగామిగా మారడం 42 సంవత్సరాల రాజా చిన్ననాటి కల. పదకొండేళ్ల వయసులో స్కూల్లో వ్యోమగామి బొమ్మను గీయమని టీచర్ చెప్పినప్పుడు వ్యోమగామి బొమ్మకు తన తలను అంటించిన రాజా అప్పట్నుంచే ఎలాగైనా సరే అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కంటూ వచ్చారు.

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు రాజా. 1950లో ఉస్మానియాలో ఇంజినీరింగ్ చేసిన రాజా తండ్రి శ్రీనివాస్ చారి ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ లో నర్స్ గా పనిచేస్తున్న పెగ్గీ ఎగ్బర్ట్ ని వివాహం చేసుకున్నారాయన అప్పట్లో.

1976లో చారికి, పెగ్గీకి వివాహం జరిగింది. యూఎస్ లోనే పుట్టిన రాజా తన కలను నెరవేర్చుకునే దిశగానే మొదటినుంచీ అడుగులు వేశారు. ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి 1999లో యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేరారు. మసాచుయేట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో నాటిక్ టెక్నాలజీ నుంచి పి.జి పట్టాను పొందారు.

యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో కల్నల్ గా పనిచేస్తూ 2005లో అధికారికంగా బెంగళూరులో జరిగిన ఎయిర్ షోకు తరలివచ్చారు. ఆ సమయంలో ఇండియాలో ఉన్న నానమ్మను కలుసుకున్నారు. యాస్ట్రొనాట్ ట్రైనింగ్ కోసం 18వేలమంది దరఖాస్తులు చేసుకుంటే అంత టఫ్ కాంపిటీషన్ లోకూడా యూఎస్ మిలటరీలో పైలట్ గా పనిచేస్తున్న రాజాకు అవకాశం దక్కింది.

రాజాకూడా అమెరికాలో స్థిరపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఏప్రియల్ 2010లో చారి తండ్రి మరణించారు. చంద్రుడిపై అడుగుపెట్టి, పరిశోధనలు చేసే అదృష్టం కలగడం నిజంగా ఓ వరమని రాజా అంటున్నారు. తన చిన్న నాటి కల నిజమయ్యిందన్న సంతోషం ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

Next Story