సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడికి అసలు కారణమిదే..

By రాణి  Published on  5 March 2020 12:10 PM GMT
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడికి అసలు కారణమిదే..

సింగర్, బిగబాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై బుధవారం ఆర్థరాత్రి ప్రిజమ్ పబ్ లో బీరు బాటిళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ విషయంపై రాహుల్ గురువారం మధ్యాహ్నం వరకూ ఎలాంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడంతో..పోలీసులో సుమోటాగా కేసు నమోదు చేస్తామన్నారు. గురువారం మధ్యాహ్నం రాహుల్ సిప్లిగంజ్ మాదాపూర్ పీఎస్ లో తనపై జరిగిన దాడి ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పీఎస్ బయట ఉన్న మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానమిచ్చారు.

అసలు దాడి జరగడానికి కారణమేమిటని రాహుల్ ను మీడియా ప్రతినిధి ప్రశ్నించగా..దాడి చేసే ముందు వారంతా వాష్ రూమ్ కు వెళ్లి తిరిగొస్తూ..అనవసరంగా అసభ్య పదజాలంతో కామెంట్ చేస్తూ డాష్ ఇచ్చారని తెలిపాడు. వెంటనే ఒకతని చేయి పట్టుకుని ఆపదామని ప్రయత్నించగా వెనక్కి నెట్టడంతో..సర్లే మనకెందుకులే అని నేనూ ఏమీ మాట్లాడలేదన్నాడు రాహుల్. కాసేపటికి వాళ్లే కావాలని తనను తిడుతుండగా..ఎందుకు తిడుతున్నారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా మీదపడి బాటిల్ తో దాడి చేశారని చెప్పాడు.

వారు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారా అని అడుగగా..అవన్నీ తెలియదు కానీ..వారిక పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందన్న కారణంతో రెచ్చిపోయారని తెలిపాడు రాహుల్. ఎక్కడికెళ్లినా తమ హవా నడవాలని చూసే ఇలాంటి వారి గురించి తానూ ఒక రోజు మాట్లాడవలసి వస్తుందని ఊహించలేదన్నాడు. అలాగే గతంలో వారినెప్పుడూ తాను కలవలేదని స్పష్టం చేశాడు. తన తెలిసిన దాని ప్రకారం..తనపై దాడి చేసిన వారు తరచూ పబ్ లకు వెళ్లి గొడవలు పడుతుంటారట. తనతో పాటు అక్కడున్న అమ్మాయిలను కూడా అసభ్యపదజాలంతో తిట్టారని..ఇది నిజమో కాదో సంబంధిత వీడియోలో చూస్తే మీకే తెలుస్తుందని మీడియా ప్రతినిధులకు బదులిచ్చారు.

అంత జరిగాకా మర్యాదగా మాట్లాడాలా ?

వాళ్లు 10మంది ఉంటే..నేనొక్కడినే అయిపోయాను. అది తెలిసి..వారు నాపై బీరు బాటిళ్లతో దాడి చేశారని వాపోయాడు రాహుల్. దెబ్బలు తగిలిన వెంటనే తాను ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్నాక తనపై దాడి చేసినవారి వివరాలు తెలుసుకున్నానన్నారు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని తెలిసి..మళ్లీ ఆ వీడియో కోసం పబ్ కు వెళ్లానన్నారు. ఎందుకంటే పలుకుబడిని అడ్డంపెట్టుకుని ఆ వీడియోని ఎక్కడ మాయం చేస్తారోననే వీడియో తీసుకున్నట్లు తెలిపారు. తనపై దాడి చేసింది రితేశ్ రెడ్డి, అతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు.

కేవలం మాటతీరు, వ్యవహార శైలి కారణంగానే వారు దాడిచేశారా అని ప్రశ్నించగా..అక్కడ అంత రాద్ధాంతం జరిగాక కూడా వారితో మర్యాదగా మాట్లాడాలా ? అని ప్రశ్నించాడు రాహుల్. తనపై బీరు బాటిల్ తో దాడి చేశాక కూడా మాట్లాడకపోతే ఎలా అన్నాడు. జనాలు తనను ఊరికే బిగ్ బాస్ 3 విన్నర్ ను చేయలేదని, తనపై ప్రేమతో..తనలో ఉన్న నిజాయితీని మెచ్చుకుని గెలిపించారన్నాడు. తనపై దాడి చేసిన వ్యక్తి గురించి మాట్లాడి..ఇప్పుడు అతడిని పాపులర్ చేస్తున్నట్లుందన్నాడు రాహుల్ సిప్లిగంజ్.

అలాగే అందరి లాగానే తనకు కూడా ఎమోషన్ ఉంటుందని..తనపై దాడి చేసిన వెంటనే కోపం వచ్చి తిట్టానన్నాడు. మీ వెంట వచ్చిన వారికి వారేవరైనా కామన్ ఫ్రెండ్స్ అవుతారా అని ప్రశ్నించగా..ఎవరూ లేరన్నారు. ఈ ఘటనపై తప్పకుండా రాజకీయ ప్రభావం ఉంటుంది కానీ..ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఇప్పటికే ఈ వివాదం పెద్ద పెద్దవాళ్ల వద్దకు వెళ్లిందన్నారు.

అందరి లాగానే తాను కూడా ఎంజాయ్ చేసేందుకు పబ్ కు వెళ్తే..వాళ్లు రుబాబు చేస్తా..దాడి చేశారన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోనని..అలా భయపడి కేస్ విత్ డ్రా చేసుకుంటే..ఇలాంటి వారు పెరుగుతారని తెలిపారు. పబ్ లో ఉన్న సెక్యూరిటీ ఆపేందుకు ప్రయత్నించలేదా అని అడుగగా..వారు ఇద్దరు మాత్రమే ఉంటే పది మందిని ఎలా ఆపగలరన్నారు. పబ్ క్లోజింగ్ టైమ్ లో ఓ పోలీస్ వచ్చి చెక్ చేసే సమయానికి తనపై దాడి జరగడంతో..ముందు ఈ విషయం పోలీసులకు తెలిసిందన్నారు. తాను ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నానన్నారు.

Next Story
Share it