రాహుల్ - పున‌ర్న‌వి కాంబినేష‌న్‌లో మూవీ నిజ‌మేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Nov 2019 5:53 AM GMT
రాహుల్ - పున‌ర్న‌వి కాంబినేష‌న్‌లో మూవీ నిజ‌మేనా..?

బిగ్ బాస్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో బాగా పాపుల‌రైన రాహుల్ వ‌రుస‌గా ఇంట‌ర్‌ వ్యూలు ఇస్తూ... ఫుల్ బిజీ అయ్యాడు. అయితే... ఎక్క‌డ‌కెళ్లినా.. ఏ ఇంట‌ర్ వ్యూ చేసినా రాహుల్ ని అంద‌రూ అడిగే ప్ర‌శ్న పున‌ర్న‌వితో ప్రేమ‌లో ఉన్నార‌ని..? అడుగుతున్నారు.

ఇలా అడిగిన ప్ర‌శ్న‌కు ఎలాంటి మొహ‌మాటం లేకుండా.. మేమిద్ద‌రం మంచి స్నేహితులం మాత్ర‌మే అని రాహుల్‌ సమాధానం ఇచ్చాడు. కాగా..మా మ‌ధ్య అలాంటిది ఏమీ లేదు అని రాహుల్ చెప్పాడు. రాహుల్ అలా చెప్పిన‌ప్ప‌టికీ... వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.

అయితే పునర్నవికి ఇంతకు ముందే బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని.. తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని రాహుల్‌ స్పష్టం చేశాడు. కానీ.. బయట వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ అయ్యాడు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... పునర్నవితో కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా?' అని రాహుల్ ని అడిగారు. దీనికి బదులుగా రాహుల్‌..నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే ఎంతమాత్రం వదులుకోను అని తన మనసులో మాట బ‌య‌ట పెట్టాడు. మరి... రాహుల్ - పునర్న‌వి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుందేమో చూడాలి.

Next Story
Share it