రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్ జరుగుతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలోనే ఉందని చెప్పాలి. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 164 బంతుల్లో 117 పరుగులు చేశాడు. శతకంతో సఫారీ బౌలర్లకు చక్కలు చూపించాడు.రోహాత్ క్రీజ్‌లోనే ఉన్నాడు. ఇక..వైస్ కెప్టెన్ రహానే 135బంతుల్లో 83 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. అయితే…ఆట మొదట్లో సౌతాఫ్రికా బౌలర్లు దూకుడు ప్రదర్శించారు .దక్షిణాఫ్రికా ఫేస్ బౌలర్ రబాడ ధాటికి మయాంక్‌ (10), పూజారా(0) వెను వెంటనే పెవిలియన్ చేరుకున్నారు. కోహ్లీ (12)కూడా అవుట్ కావడంతో టీమిండియాలో టెన్షన్ మొదలైంది. 39 పరుగులకే మూడు ప్రధాన వికెట్లను భారత్ కోల్పోయింది.

Kagiso Rabada delivered early strikes after India opted to bat

Virat Kohli became the maiden Test scalp for Anrich Nortje, leaving India reeling at 39 for 3

Rohit Sharma and Ajinkya Rahane steadied India with a good partnership

Both Ajinkya Rahane and Rohit Sharma registered solid half-centuries to lead India's fightback

Rohit Sharma was happy to take on the spinners as he extended his tally of sixes in the series

అయితే…కోహ్లీ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన రహానే ఇన్నింగ్స్ ఆచితూచి ఆడుతూ..రోహిత్‌కు సహకరించాడు. రహానే – రోహిత్ నాలుగో వికెట్‌కు అజేయంగా 185 పరుగులు జోడించి, భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చారు. సౌతాఫ్రికాపై నాలుగో వికెట్ కు ఇదే అతి పెద్ద భాగస్వామ్యం. మొదటి రోజు ఆట కేవలం 58 ఓవర్లు మాత్రమే ఆడారు.

Both Rohit Sharma and Ajinkya Rahane were unbeaten, having added 185 for the fourth wicket, when rain led to early Stumps

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.