‘రఫేల్ ‘ భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రం. ‘రఫేల్’రాకతో ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌కు ఎక్కడలేని బలం వచ్చినట్లైంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యుద్ధ విమానాల్లో ‘రఫేల్’ అత్యాధునికమైంది. ఆకాశాన్ని ఏలాలంటే అత్యాధునిక యుద్ధ విమానాలు అవసరమని రక్షణ నిపుణులు భారత ప్రభుత్వానికి ఎప్పుడో సూచించారు. ఫ్రాన్స్‌లోని ‘డసో ‘ ఏవియేషన్ కంపెనీతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘రఫేల్’ యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే..ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత అనేక ఆరోపణలు వచ్చాయి. చివరకు సుప్రీం కోర్ట్ కూడా ఈ డీల్‌లో కల్పించుకోవాల్సి వచ్చింది. చివరకు ..రక్షణ వ్యవహారాలు, ఒప్పందాలు బయట చర్చించకూడదు అని సుప్రీం కోర్టే అభిప్రాయపడింది. మొత్తం 36 యుద్ధ విమానాలకు ఒప్పందం కుదుర్చకోగా..అక్టోబర్ 8 అంటే ఇండియన్ ఏవియేషన్ డే రోజు మొదటి విమానాన్ని అందుకున్నారు. భారత రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్..ఫ్రాన్స్‌కు స్వయంగా వెళ్లి విమానాన్ని అందుకున్నారు. ఒప్పందంలో భాగంగా మొదటి విమానం భారత్ చేతికి వచ్చింది. మిగిలిన 35 విమానాలు మరో రెండేళ్లలో భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి.

 

‘రఫేల్’కు ఉన్న అడ్వంటేజెస్‌

1. ‘రఫేల్’ కు రెండు ఇంజిన్లు ఉన్నాయి. ఒక్కటి పని చేయకపోయినా ఇమ్మిడియేట్‌గా మరొకటి పని చేస్తుంది.దాడుల సమయంలో రెండు ఇంజిన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

2.ఏ ఆయుధాన్నైనా దీనిలో మర్చవచ్చు. ఒక్కసారి గురి చూసిందంటే..ఆ లక్ష్యాన్ని రఫేల్ ఛేదిస్తుంది. గురి తప్పని బాణం అన్న మాట

3.దాడులు చేయడమే కాదు…ప్రత్యర్దుల దాడుల నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకునే సామర్ధ్యం రఫేల్ సొంతం.

 

4. ఫ్రాన్సే కాదు..ఖతార్‌ , ఈజిప్ట్‌లు ఈ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాయి. దీని పని తీరు చూసి ఈ మూడు దేశాలే కాదు..ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

5. యుద్ధం చేస్తుండగానే ఆకాశంలో ఆయిల్ నింపుకునే వెసులుబాటు ఈ విమానాలకు ఉంది.

6. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల పరిసరాల్లో యుద్ధం చేయాల్పి వస్తే.. రఫేల్‌లో భారత రక్షణకు పెట్టని కోటలా ఉంటాయి. సముద్ర మట్టానికి ఎత్తులో బాగా యుద్దం చేయడం వీటి ప్రత్యేకత.

 

7.పుల్వామా ఎటాక్ తరువాత సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరిగిన సంగతి తెలిసిందే. మన యుద్ధ విమానాలు బాలా కోట్ మీద దాడి చేసిన తరువాత..పాక్‌ ఎఫ్ -16లతో భారత్‌ పై దాడి చేసింది. ఇప్పుడు రఫేల్ రాకతో పాక్‌ మీద భారత్ ఆధిపత్యం ఉంటుంవది. ఎఫ్‌ 16ల కంటే రఫేల్ ఎంతో మెరుగైంది.

8.ముఖ్యమైనది ఏమంటే ఆన్ బోర్డ్‌లోనే ఆక్సిజన్ ఉంటుంది.

9. ఫైలట్లకు కూడా వెసలు బాటు ఉంటుంది. ప్రత్యర్దుల పై ఎటాక్‌కు , లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతో ఈజీగా ఉంటుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort