రావణుడిగా ప్రభాస్..సీతగా ఎవరు..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 11:51 AM GMT
రావణుడిగా ప్రభాస్..సీతగా ఎవరు..?!

ముంబై: ప్రబాస్‌కు ఉన్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో పడింది బాలీవుడ్. బాహూబలితో భళా అనిపించుకున్న ప్రభాస్..సాహోతో బాలీవుడ్‌లో కలెక్షన్లు బాగానే రాబట్టాడు .దీంతో బాలీవుడ్ మనసు ప్రభాస్‌పై పడింది.

ప్రభాస్‌ను రామాయణంలోని రావణ్ పాత్రలో నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించబోతున్న సినిమాలో ప్రభాస్‌ రావణుడిగా కనిపించే అవకాశముందంటున్నారు. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో మూడు భాగాలుగా బాలీవుడ్ రామాయణం తెరకెక్కనుంది. అయితే, ఇప్పటివరకు ప్రభాస్‌ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఆయన టీమ్‌ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్‌ చేయొచ్చా లేదా? అన్నది బేరిజు వేసే పనిలో ఉందని ఓ వెబ్‌సైట్‌ కథనాన్ని ప్రచురించింది.

రూ.600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్‌కు ఉన్న దేశవ్యాప్త స్టార్‌డమ్‌తోపాటు హైట్‌, పర్సనాలిటీ పరంగా రావణుడి పాత్రకు పర్ఫెక్ట్‌గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ...మరోవైపు రాముడిగా హృతిక్‌ రోషన్‌, సీతగా దీపికా పదుకోణ్‌ నటించే అవకాశముందంటున్నారు. వారికి దీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్‌ అలరించే అవకాశముంటుందని బాలీవుడ్‌ టాక్‌ .

Next Story
Share it