ఏప్రిల్ 26వ‌ తేది ఆదివారం నుండి మే 2వ‌ తేదీ శనివారం వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 April 2020 4:37 PM GMT
ఏప్రిల్ 26వ‌ తేది ఆదివారం నుండి మే 2వ‌ తేదీ శనివారం వరకు

మేషరాశి :- ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం బాగుంటుంది. ఖర్చు కూడా దానికి తగ్గట్టుగా ఉండొచ్చు. సంతోషాన్ని పొందగలుగుతారు. శ్రమకు తగిన ఫలితం ఒక్కొక్కసారి దక్కకపోవచ్చు. తృతీయ మందున రాహువు మీ సంపదల్ని సమకూరుస్తాడు. ఏ కార్యాన్నైనా తల పెట్టేటప్పుడు లోటుపాట్లు ముందుగా చర్చించు కొన్నట్లయితే మీరు ముందుకు సావధానంగా వెళ్లగలుగుతారు. శని మీకు కొన్ని ఇబ్బందుల్ని కలుగజేయడానికి అవకాశం ఉన్నది. కానీ కుజుడు సంతోషాన్ని కలుగజేసే స్థితి కూడా ఉంది కాబట్టి మీరు ఈ వారాన్ని కొంతవరకు శుభాశుభాల మధ్యమంలో నెరవేర్చుకుంటారు. అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయి లగ్నంలో బుధుడుండమే దీనికి కారణమవుతోంది. స్త్రీలకు వస్తు వాహన ప్రాప్తి అవకాశం ఉన్నది. అశ్విని వారికి క్షేమ తారైంది ఫలితాలు చాలా బావుంటాయి. భరణి వారికి విపత్తారయింది కాబట్టి ఫలితాలు వ్యతిరేకంగా ఉంటున్నాయి. కృత్తికా ఒకటో పాదం వారికి సంపత్తార కాబట్టి ఫలితములు ధన సంపదకు అవకాశాలు ఉన్నాయి.

పరిహారం :- అమ్మవారికి ప్రీతి పాత్రంగా మంగళవారం నియమాన్ని పాటించండి. దగ్గర్లో ఉన్న గ్రామదేవతను దర్శించండి ఫలితాలు బాగుంటాయి.

వృషభ రాశి :- ఈ రాశివారికి లగ్నంలో శుక్రుడున్నప్పటికీ సౌఖ్యములు కంటే ఇబ్బందులు ఎక్కువగా కలిగే అవకాశం కనిపిస్తోంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఒక ప్రియమైన వస్తునష్టం ధననష్టం కూడా ఉంది.రవి బుధుల కలయిక వల్ల వీరికి అనారోగ్యము తద్వారా ధన వ్యయం రెండు కూడా ఉన్నాయి. ఆది సోమవారాల్లో చంద్రబలం బాగుంది రవి సహకరించడం వల్ల మీకు కొంత వరకు ఆదాయ విషయంలో అవకాశం ఉన్నది. మాట్లాడటంలో జాగ్రత్త వహించండి దాని వల్ల మీకు ధన సమృద్ధి చేకూరే అవకాశం ఉంటుంది. మీ మాట నేర్పరితనంతో మీరు ధనలాభాన్ని పొందుతారు వ్యయాన్ని తగ్గించుకో గలుగుతారు రోగాన్ని కూడా తగ్గించుకో గలుగుతారు. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి సంపత్తు తయారైంది కాబట్టి ఫలితాలు సుఖప్రదంగా ఉన్నాయి. రోహిణి వారికి జన్మ తయారైంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి మృగశిర నక్షత్ర ఒకటి రెండు పాదాల వారికి పరమ మిత్రతార మధ్యమ ఫలితాలు పొందగలుగుతున్నారు.

పరిహారం :- అక్షయ తృతీయ నాడు సూర్య నమస్కారాలు చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ బుధవారం నాడు చేయండి సత్ఫలితాలు ఉంటాయి.

మిధున రాశి :- ఈ రాశి వారికి ఉచ్చక్షేత్రంలో ఉన్న రవి బుధుల కలయిక ఆనందాన్ని ధనలాభాన్ని కలిగిస్తోంది. అలాగే శుకుడు వ్యయ మందున్నప్పటికీ ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని కలిగిస్తాడు. చంద్రుడు వీరికి మానసిక దుర్బలత్వాన్ని కలిగిస్తూ అధిక ధన వ్యయానికి కారకుడవుతాడు. శత్రు వృద్ధి ఇంతకు ముందు మీదట పెరిగింది. కాబట్టి జాగ్రత్త వహించడంమంచిది. ఆరోగ్య విషయంలోనే కాదు ప్రయాణాలు చేసేటప్పుడు మీ శని ప్రభావం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. కాబట్టి ఏ రూపంలోనైనా ఆఖరికి జంతువులు వల్లనైనా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది అవసరమైతే శస్త్ర చికిత్స కూడా పొందుతారు.. కాలసర్పదోషం వర్తిస్తుంది గనుక ఒంటరిగా ఉండకండి. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి పరమమిత్రతార కాబట్టి మధ్యమ ఫలితాలున్నాయి. ఆరుద్ర వారికి మిత్రతారైంది అందువల్ల శుభ పరిణామాలు చాలా ఎక్కువ. పునర్వసు ఒకట్రెండు మూడు పాదాల వారికి నైధన తార కాబట్టి వ్యతి రిక్త ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం :- విష్ణు సహస్రనామ పారాయణ సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక దేవుని దర్శనం చేయండి.

కర్కాటక రాశి :- ఈ రాశివారికి అదృష్టాన్ని ఒకేసారి కలిసి వచ్చాయా అన్నట్లుంటుంది. చిన్నచిన్న కార్య విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా సుఖ జీవనం సౌఖ్యము సంతోషము కార్యం ధనలాభం ఇవన్నీ ఒకేసారి కలిసొస్తున్నాయి. కుటుంబంతో సుఖ సౌఖ్యాన్ని పొందుతారు. మీ జీవన విధానంలో కొన్ని నూతన పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీతెలివిని నమ్ముకున్నంత వరకు మీ వ్యూహ రచన బాగుంటుంది. వ్యూహ రచన సరిగా చేసుకోలేకపోవటం వల్ల శని ప్రభావంతో అనుకున్నది వాయిదా పడుతుంది. అలాగే కుజుడు స్థితి బాగా లేకపోవడం వల్ల కూడా మీరు చిన్నచిన్న ఆటంకాల్ని ఎదుర్కోవాల్సివస్తోంది. మొత్తంమీద ఈ వారంలో మాత్రం మీకు ఎక్కువ రోజులు శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. రవి బుధుల కలయిక మీకు స్థిరమైన కార్య లాభాన్ని కార్య జయాన్ని సూచిస్తున్నాయి. పునర్వసు నాలుగో పాదం వారికి నైధన తారైంది వ్యతి రిక్త ఫలితాలున్నాయి. పుష్యమి వారికి సాధన ద్వారా అన్ని పనులు నెరవేరుతాయి. ఆశ్రేష వారికి ప్రత్యక్ కాబట్టి కొన్ని పనులు వాయిదా పడతాయి.

పరిహారం :- నానవేసిన పెసలు బెల్లంతో కలిపి బుధవారం నాడు ఆవుకు తినిపించండి సూర్యుణ్ని ఉపాసన చేయండి కార్య జయం కలుగుతుంది.

సింహరాశి :- ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే. మృష్టాన్న భోజనం ధనప్రాప్తి సౌఖ్యము సంతోషముఅన్ని మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆలోచనలు మాత్రం మిమ్మల్ని సరిగా నిలవ నివ్వట్లేదు రవి స్థితి మాత్రం ఈ కష్టాన్ని కలిగిస్తుంది. బుధుడు కూడా మీకు నష్టాన్ని సూచిస్తున్నాడు. శని మాత్రం విశేష ధనాన్ని ఇస్తాడు గనుక అందివచ్చిన అవకాశాన్ని దేన్నీ జారు విరుచుకోకండి. ఐదు గ్రహాలు మీరు అనుకున్న పనులన్నీ నెరవేర్చే స్థితిలో ఉంటే ఒకటి రెండింటి వల్ల మీరు మీ ఆలోచనా విధానం సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. సమయానికి మీ తెలివితేటలు మీకు పనికి రాకపోవడం వల్ల మీ ఆలోచనలు లోపం వల్ల ముందు చూపుని కలిగి ఉండకపోవడం వల్ల మాత్రమే మీరు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకున్న తెలివితేటల్ని మీకై వినియోగించుకోండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. మఖా నక్షత్రానికి క్షేమ తారైంది సత్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పుబ్బ వారికి విపత్తార ఐంది కాబట్టి దుష్ఫలితాలు ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి సంపత్ తారైంది ఫలితాలు బాగున్నాయి.

పరిహారం :- రవికి ప్రీతిగా గోధుమలు దానం చేయండి, విష్ణుసహస్రనామం పారాయణ చేయండి.

కన్యా రాశి :- ఈరాశి వారికి ఆకస్మిక ధనలాభము కోరికలు నెరవేరేవి ఎక్కువగా ఉన్నాయి. ధన సంపాదన కోరికలు నెరవేరడం ఆకస్మిక పుత్ర మిత్ర లాభాదులు అన్ని ఒక్కసారిగా మీకు కలిసొస్తున్నయి. ఉద్యోగులైతే వారికి అభివృద్ధి ఈ వారంలో కనిపిస్తోంది. చంద్రుని స్థితి వల్ల కూడా మీరు ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. కొన్నిసమయాల్లో ఉద్యోగస్థులైతే అధికారుల వల్ల కుటుంబ సభ్యులైతే పెద్దల వల్ల మీరు అవమానాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో కుటుంబ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. గురుడు మీ కావలసినంత సంపదని తెచ్చిపెట్టడానికి స్థిరమైన ఆదాయానికి దోహదపడతాడు. అలాగే మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. చేతిలో ఉన్నదానికంటే మీరు ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి సంపత్ తారైంది విశేష ఫలితాలున్నాయి. హస్త వారికి జన్మ తారైంది ఆరోగ్యం సరిచూసుకోండి. చిత్త ఒకటి రెండు పాదాల వారికి పరమ మిత్రతార యింది ఫలితాలు మధ్యమంగా ఉంటాయి.

పరిహారం :- శనికి జపం చేయించడం గానీ లేదా శనివారం నియమాన్ని పాటించడం చాలా అవసరం. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి.

తులా రాశి :- ఈ రాశివారికి ధనలాభం భూలాభం రెండూ కలిసొస్తాయి. ఎప్పట్నించో పరిష్కారం కాకుండా ఉన్న పనులు నెరవేరబోతున్నాయి. శత్రువులు ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ ఈ వారంలో వారి పీడ తగ్గుముఖం పడుతుంది. ధనం పోయినా మీ ఆరోగ్యాన్ని మళ్లీ మీరు పొందగలుగుతారు. వారం మధ్యలో మీరు సుఖ సౌఖ్యాల్ని ఎక్కువగా పొందగలరు. మీరాశికి చంద్రస్థితి కారణంగా మానసికంగా అనుభవించిన సంఘటనల వల్ల ప్రాణ భయం పట్టుకుంటుంది. దాన్ని అధిగమించాలి అంటే దైవం తప్ప ఇంకో మార్గం మీకు లేదు. మృత్యు భయానికి రాజదండనకు చంద్రుని స్థితే కారణం. చాలా వ్యవహారాల్లో వాయిదా పద్ధతికి మీరు సంసిద్ధులై ఉండాలి. ఒక మంచి విషయం మీకు ఆనందాన్ని కలిగించి ఈ వారాన్ని శుభ ప్రదంగా పూర్తిగా చేసుకుంటారు. చిత్త మూడు నాలుగు పాదాలు వారికి పరమమిత్రతార అయింది ఫలితాలు బాగుంటాయి స్వాతి నక్షత్ర జాతకులకు మిత్ర తయారైంది చాలా మంచి ఫలితాలను అందుకుంటారు విశాఖ ఒకట రెండు మూడు పాదాల వారికి నైధన తార అయింది కాబట్టి ఫలితాలు వ్యతిరిక్తంగా ఉన్నాయి.

పరిహారం :- మృత్యుంజయ జపం చేయండి. పెరుగుతో కూడిన చంద్రుని బింబం దానం చేయండి.

వృశ్చిక రాశి :- ఈ రాశివారికి సకల భోగాలు పొందుతారు. ధన లాభం కూడా ఉంది. శత్రునాశనం కూడా జరుగుతుంది. మీకు మీరే శిక్ష వేసుకుని అనుభవించడాన్ని ప్రయత్నం చేస్తారు. విశేష ధనాన్ని విశేష గౌరవాన్ని ఈవారంలో పొందబోతున్నారు. ఆరోగ్య వి విషయంలో మీరు జాగ్రత్త వహించండి. మీరు విద్యా అలంకారాన్ని పొందబోతున్నారు. మానసికంగా ఒత్తిళ్లు ఎక్కువౌతాయి కుటుంబంలో మధ్య మధ్యలో చిన్న అవగాహనలోపాదులు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని మాత్రం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. పెద్దవాళ్లతో విభేదాలు శుభప్రదం కాదు కాబట్టి మీరు సాధ్యమైనంతవరకు మౌనాన్ని వహించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. విశాఖ నాల్గవ పాదం వారికి నైధన తారైంది వ్యతిరిక్త ఫలితాలు ఉన్నాయి. అనూరాధ నక్షత్ర జాతకులకు సాధన తారైంది కాబట్టి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి. జ్యేష్ట వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి వ్యతిరేకత ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పరిహారం:- ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయండి. సోమవారం నాడు శివునకు పాలతో అభిషేకం చేయండి. బియ్యం దానం చేయడం అటుకులు బెల్లం ఆవుకు తినిపించడం మంచిది.

ధనూ రాశి :- ఈ రాశివారికి రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయి. ధనం వృద్ధి చెందినప్పటికీ అనేకానేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కుజుడు బుధుడు రవి వీరు ముగ్గురు కూడా వీరికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. రాహుకేతువులయితే శత్రు వృద్ది ద్వారా మహాభయాన్ని కలిగిస్తున్నారు. అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోయే పరిస్థితి వీరిది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. రావలసింది సమయానికి అందకపోవడము అపకీర్తి కలగలిసి మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బందిని కలుగజేస్తాయి. వీలైనంత వరకు మానసికంగా సంసిద్ధతను వ్యక్త పరుస్తూ గృహ నిర్బంధంలో ఉండటమే చాలా మంచిదిగా కనిపిస్తోంది. మూలా నక్షత్ర జాతకులకు క్షేమ తారైంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు విపత్తార కాబట్టి వ్యతిరేక ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి సంపత్ తారైంది శుభ ఫలితాలు ఉన్నాయి.

పరిహారం :- నానవేసిన పెసలు బుధవారం నాడు ఉదయమే ఆవుకి తినిపించండి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు మనస్సుని ని గ్రహించడానికి చంద్రునికి జపం చేయించండి.

మకర రాశి :- ఈ రాశివారికి బుధుడు చతుర్ధ స్థానంలోకి వెళ్లటంవల్ల శత్రువిజయం లభిస్తుంది. బంధుమిత్రుల్ని దర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి ధనలాభము పొందుతారు. కుటుంబంతో సుఖ జీవనాన్ని సాగిస్తారు బకాయిలు ఏమైనా ఉంటే మీకు అందుతాయి. కించిత్ కార్యవిఘ్నం ఉన్నప్పటికీ మనోధైర్యంతో మీరు వాటిని దాటుకుని వెళ్లేఅవకాశం ఉంది. గురు శని కుజుల కలయిక ఇబ్బందులనే సూచిస్తుంది. కుటుంబం కోసం లేదా బంధుమిత్రుల కోసం వ్యయాన్ని మీరు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. బంధువులచే అవమానం కూడా పొందే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనుల్లో కొన్ని వాయిదాపడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి సంపత్తారయింది శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి శ్రవణానక్షత్ర జాతకులకు జన్మతారైంది కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు పాదాలు వారికి పరమమిత్రతార యింది బావుంది శుభ ఫలితాల్ని పొందుతారు.

పరిహారం :- శనికి వీలైనంతవరకూ నువ్వుల దానం చేయండి నూనె దీపాలు వెలిగించండి అలాగే గురు స్తోత్రం పఠించండి మంచి ఫలితాన్ని పొందుతారు.

కుంభరాశి :- ఈరాశి వారికి సంపద విశేష ధన లాభం చక్కగా కనిపిస్తున్నాయి. రవి శుక్రులు మీకు శుభ స్థానాల్లో ఉండి విశేష ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. శారీరిక మానసిక కష్టాన్ని కుజుడు సంప్రాప్తం చేస్తాడు.వ్యయ మందున్న శని ప్రభావం మీపై ఎక్కువగా పనిచేస్తోంది. గురుడు కూడా మీకు వ్యతిరిక్తంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆర్థిక లాభాలు ఎంత ఉన్నప్పటికీ వ్యయం తప్పదు. కొన్ని పనులు ముందే వాయిదాలు వేసుకోవడం మంచిది. కొన్ని సమయాల్లో మీరు ఇంటి నుండి వెళ్లి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సమయంలోశత్రువులు రుణబాధ ఈ రెండు మీకు ఇబ్బందిని కలగజేసినా వారాంతంలో మీరు ధనలాభాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. శుభప్రదంగా వారం ముగుస్తుంది. ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వారికి పరమమిత్రతారయింది ఫలితాలు బావున్నాయి. శతభిషా జాతకులకు మిత్ర తారైంది శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి నైధన తారైంది కాబట్టి ఫలితాలు శూన్యమని చెప్పొచ్చు.

పరిహారం :- శని గ్రహానికి నువ్వులు నల్ల వస్త్రం దానం చేయించండి.ప్రతిరోజూ సూర్యోదయానికే సూర్యునికి నమస్కారం చేయండి.

మీన రాశి :- ఈ రాశివారికి స్వర్ణాభరణ ప్రాప్తి ధనలాభం ఎన్నో రకాలైన ఇటువంటి మేలులు పొందే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి. ద్వితీయ మందున్న బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తుంటే రవి మాత్రం కాస్తంత పాపభీతి తద్వారా గౌరవ భంగం కూడా సూచిస్తున్నాడు. కేతువు ధనలాభం సూచిస్తున్నాడు కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు మంచి లాభాన్ని పొందుగలరు. కుజుడు ఆకస్మిక ధనలాభాన్ని ఇస్తుంటే వస్త్రాది లాభాల్ని తదితర గ్రహాలు ఇవ్వబోతున్నాయి. చంద్రుడు మానసిక రుగ్మత నిస్తాడు కాబట్టి సాధ్యమైనంతవరకూ మీ పనులను మీరే చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి నైధన తారైంది కాబట్టి ఫలితాలు శూన్యమని చెప్పొచ్చు. ఉత్తరాభాద్ర వారికి సాధన తారైంది ఫలితాలు చక్కగా నెరవేర్చుకుంటారు. రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తారైంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త వహించండి.

పరిహారం :- విష్ణు సహస్ర నామ పారాయణ గురు స్తోత్ర పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి.

Next Story