వార ఫలాలు 13-9-2020 ఆదివారం నుండి 19-9-2020 శనివారం వరకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2020 3:29 AM GMT
వార ఫలాలు 13-9-2020 ఆదివారం నుండి 19-9-2020 శనివారం వరకు

విశేషాంశాలు :

13-9-2020 ఆదివారం *ఏకాదశి* పర్వదినం తోపాటు ఆరు గ్రహాలు *స్వక్షేత్రంలో* ఉన్నాయి, బుధ గ్రహం *ఉచ్ఛలో* కూడా ఉంది. కాబట్టి ఈరోజు మంచి యోగంగా కనిపిస్తున్నది. ఈరోజు 11 గంటల నుంచి 11:45 లోపు ఏదైనా దైవానికి సంబంధించిన కార్యక్రమాన్ని చేయడానికి మంచిది. (భాద్రపద మాసంలో పడటంవల్ల ఆ యోగం తాలూకా ఫలితాలు తక్కువగా ఉన్నాయి.)

14-9-2020 సోమవారం యతి మహాలయం. యతీశ్వరులు సన్యాసులు భోజనం పెట్టడానికి మంచి రోజు.

16-9-2020 బుధవారం మాసశివరాత్రి. శివుని అభిషేకానికి చాలా మంచిది.

17-9-2020 గురువారం అమావాస్య. కొన్ని ప్రాంతాల్లో *పొలాల అమావాస్య* పోలేరు వ్రతం కన్యా సంక్రమణం.

మేష రాశి :

ఈ రాశి వారికి ధన లాభం శత్రునాశనం అలంకార ప్రాప్తి స్త్రీ సౌఖ్యం ఇవి ఆనందాన్ని అనుభూతిని కలిగించి గొప్ప ఉత్సాహంతో ప్రోత్సహిస్తాయి. 17వ తేదీ తేదీ నుండి రవి కన్య సంక్రమణం నుంచి నెలరోజులపాటు వాళ్ళకి చాలా సౌకర్యంగా మార్పులు వచ్చి వ్యతిరేకులు అందరూ కూడా అనుకూలంగా మారుతారు. బుధ గురు శుక్రులు చాలా పనులన్నీ నెరవేర్చడానికి అనుకూలంగా ఉన్నారు. రాహువు కూడా సర్వసంపదలను తెచ్చి పెడతాడు. చాలా కాలంగా జరిగని పనులు ఈనాడు నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విశేష ధనసంపాదన వల్ల ఇంట్లోను బయట వ్యతిరేకత లేకుండా అందరూ అనుకూలంగా కూడా వర్తిస్తారు. శని ప్రభావం చేతనే అనుకోని రాజకీయ ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల పనులు కోసం పరిగెట్ట కండి. మీ పనులను నెరవేర్చకుంటే బాగుంటుంది. ఈవారం మీకు 54 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు నైధనతార అయింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి అన్ని పనులు నెరవేరుతాయి. కృత్తిక కృత్తిక ఒకటో పాదం వారికి మాత్రమే ప్రత్యక్తార అయింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం: ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి పూజ చేయించండి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి, నవగ్రహ దర్శనం చేయండి. ఆదివారం నాడు 11 నుంచి 11 45 మధ్యలో దైవ ధ్యానానికి వినియోగించండి.

వృషభ రాశి :

ఈ రాశి వారికి ధన లాభం మాత్రమే కనిపిస్తుంది. అయినా వీరికి గ్రహాల ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాపభీతి వీరిలో నడుస్తుంది. వీరి కుటుంబంలో పెద్దలకి వీరికి కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని కష్టాలు నాకే వచ్చాయా అన్నంత బాధ ఈ వారంలో పొందుతున్నారు. అనుకోని ఖర్చులు వల్ల ఆదాయం తగ్గిపోవడం వ్యయం పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అకారణంగా మాటలు పడడం నిందారోపణలు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం మాట తడబాటు ఇవన్నీ వీరిని మరింత బాధిస్తాయి. వీరికి ఈ వారంలో 22 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరము. కృత్తిక 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి శుభఫలితాలు ఎక్కువగా పొందుతున్నారు. మృగశిర 1 2 పాదాలు వారికి మాత్రము విపత్తు తార అయింది కాబట్టి అశుభ ఫలితాలు.

పరిహారం : నవగ్రహ దర్శనం చేయండి. ప్రతిరోజూ ఏదో ఒక దైవ స్తోత్రం పారాయణ పెట్టుకోండి. ఈ వారంలో గురు దర్శనం చేయండి. ఆదివారంనాడు మాత్రము 11 నుంచి 11:45 మధ్యలో భగవధ్యానం కాలాన్ని వినియోగించండి. మంచి ఫలితాలు వస్తాయి.

మిధున రాశి :

ఈ రాశి వారికి సంపదలు ధనలాభము ఆభరణ ప్రాప్తి సౌఖ్యము మంచిగా సాగి వీరిని మరింత ఆనందింప చేస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి . ప్రతి పనిలో కూడా ఎదురు దెబ్బలు వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం. శత్రుభయం ఉన్నది. బంధు వర్గాల్లో విలువైన గౌరవప్రదమైన వ్యక్తిని పోగొట్టుకునే అవకాశం ఉంది. మానసికంగా శారీరకంగా కూడా కొంచెం ఒత్తిడి ఎక్కువై విరక్తి భావాలు కలుగుతాయి. మీరు ఇచ్చిన బాకీలు వసూలు కాకపోగా తీర్చ వలసిన కూడా మీరు ఇవ్వలేని స్థితిలోకి వస్తారు.

మీరు ఈ వారంలో ఏ నిర్ణయం తీసుకున్న ఏ పని చేయాలనుకున్నా అనుకూలత చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి పనిని సాధ్యమైనంతవరకు వాయిదా వేయండి. లేదా ఆచితూచి అడుగు వేయండి పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులు లేకుండా ఏ పనులకు తొందరపడవద్దు. ఈ జాతకులకు 38 శాతం మాత్రమే ఈ వారం లో శుభ ఫలితాలు ఉన్నాయి. మృగశిర 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి అశుభఫలితాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి అనుకూల ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పునర్వసు 1 2 3 పాదాలు వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి.

పరిహారం : శనికి జపం చేయించండి. శనికి నువ్వుల నూనెతో అభిషేకము, శివునకు రుద్ర అభిషేకము మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదివారం నాడు 11 నుంచి 11:45 మధ్యలో దైవదర్శనానికి వినియోగించండి.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికి సంపదలు మృష్టాన్నముతో ధనలాభము సంతోషము వీటితో వీరు ముందుకు నడుస్తారు. ఇతః పూర్వం వీరికి వ్యతిరేకించిన వ్యక్తులు ఈ వారంలో కొద్దిగా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. వాయిదా పడిన పనులు కొన్నింటిని సాధించే ప్రయత్నంలో కి వెళతారు. ఆరోగ్యాన్ని ఒక కంట కనిపెట్టి భయంగా ఉంటుంది ఆ భయాన్ని వీడండి. శత్రువు యొక్క బాధలు ఎక్కువగా ఉన్నాయి వాటికి దూరంగా ఉండాలి ప్రయత్నించండి. నానారకాలైన ఆలోచన లేకుండా ఏదో ఒక విషయం మీరు మీరు స్పందించినట్లు అయితే మీకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ఏదో ఒక పెద్ద పని మీకు వాయిదా పడి చాలా ఇబ్బందిని నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. బుధ గురు శని గ్రహాల ప్రభావం మీపై పని చేయటం వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశివారికి ఈ వారంలో 46 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. పునర్వసు ఒకటో పాదం వారికి జన్మతార అయింది. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. పుష్యమి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలతలు వర్తిస్తున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి చక్కని ఫలితాలను మీరు పొందగలుగుతారు.

పరిహారం : నవగ్రహాల దర్శనం చేయండి. శనివారం నాడు శనికి పూజ చేయండి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయకాలం లోని సూర్య దర్శనం చేయండి. ఆదివారం నాడు 11 గంటల నుంచి 11 45 నిమిషముల వరకు దైవ ధ్యానానికి దైవదర్శనానికి వినియోగించండి.

సింహ రాశి :

ఈ రాశి వారికి ధనలాభము ఉత్సాహము కలగలిసి వీరిని ముందుకు నడిపిస్తాయి. ఈ రాశి వారి లో ఎక్కడలేని ఆనందము కనిపిస్తుంది. అయినా వీరికి శని తాలూకా ప్రభావం చేత కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పరువు మర్యాద కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఎంత సంపాదించుకున్నారు అంత ధనము వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు మీరు సంపాదించినది కూడా నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఎవరికైనా ఇచ్చినట్లయితే అది కూడా మీకు వసూలు కాకుండా ఈ వారం ఇబ్బందిని కలిగిస్తుంది. శని రాహు గ్రహం చేత మీరు విశేష ధనాన్ని శుక్రుని ప్రభావం చేత ఉత్సాహాన్ని పొందగలుగుతారు. ఇంటా బయట కూడా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. ఈ వారంలో మీరు 54% శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మఖా నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి శుభఫలితాలు తక్కువ. పుబ్బ నక్షత్ర జాతకులకు సాధన తారయింది ప్రతికూలతలు లేకుండా అన్ని విధాలా అనుకూలంగా నెరవేరుతాయి. ఉత్తర 1వ పాదం వారికి ప్రత్యక్ తారయింది కాబట్టే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ప్రతిరోజూ సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది. మంగళవారం నియమాలు పాటించండి. ఖడ్గమాల పారాయణ దేవి అర్చన చేయండి. ఆదివారం నాడు ఉదయం 11 నుంచి 11 45 నిమిషాల మధ్యలో దైవ ధ్యానానికి దైవదర్శనానికి వినియోగించండి.

కన్యా రాశి :

ఈ రాశి వారికి ధనలాభము కుటుంబసౌఖ్యం సంతోషము వీరిని ఈ వారం ముందుకు నడిపిస్తాయి. రవి ప్రభావం చేత వారాంతాల్లో స్థానచలనం ఉండొచ్చు. కుటుంబంతో ఉంటారు కనుక అన్ని బాధలు కష్టాలు మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. గురుడు కూడా ధననష్టం కలిగిస్తాడు. బుధుడు ఆపద తెచ్చి పెడుతున్నాడు. శని ప్రభావము రాహుకేతు ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంది. ఈ వారంలో వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రహ ప్రభావం చేత మీరు కొంచెం నిరాదరణకు గురి అవుతారు. వాటి నుంచి కొంచెం జాగ్రత్త వహించండి. పురుషుల కంటే స్త్రీలు ఈ వారంలో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని గ్రహముల యొక్క ప్రభావము మీకు వ్యతిరేకంగానే ఉన్నట్లుగా చెప్పాలి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మాట తగ్గిపోకుండా చూసుకోండి. శరీర ఆరోగ్యం కూడా చూసుకోండి. పెద్దల ఆరోగ్యం ఒక కంట కనిపెడుతూ ఉండండి. మిత్రులు బంధువులు దగ్గర కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇవి ముందస్తు హెచ్చరికలు గా భావించండి. మీకు ఈ వారంలో 22 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తర 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్తార అయింది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. చిత్త నక్షత్ర జాతకులకు 1 2 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : ప్రతిరోజు వీలైనంతవరకు రుద్రాభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. నవ గ్రహాలు దర్శనం గాని నవగ్రహస్తోత్రం గాని చదవండి. ఆదివారం నాడు 11:00 నుండి 11 45 నిమిషముల వరకు దైవదర్శనం గాని దైవధ్యానం గాని చేయండి.

తులారాశి :

ఈ రాశివారికి ధనలాభము సంతోషము సర్వసంపదలు ఆనందాన్ని కలిగిస్తాయి. 17వ తేదీ నుంచి వీరు తాలూకా ఆదాయ వ్యయాల్లో మార్పు వస్తుంది. వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సౌఖ్యాలను కూడా చక్కగా పొందే అవకాశం ఈ వారంలో వీరికి ఎక్కువగా ఉంది. ఆలోచించిన ప్రతి పని బుధుడు వ్యయ స్థానంలో ఉండడం కుజుడు సప్తమంలో ఉండటం చేత వాటికి ఆటంకం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం కూడా వీరి పైన ఎక్కువగా ఉండటం చేత వీరికి ఉదరరోగం వచ్చే అవకాశం ఉంది. అలాగే గురు ప్రభావం కూడా వీరికి తగ్గింది దానివల్ల హాని. శుక్ర ప్రభావము బావుంది కనక దానివల్ల సంతోషం కలుగుతుంది. శత్రు భావం ఎక్కువగా ఉంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహరించినట్లు అయితే మీకు చాలా వరకు పనులు అనుకూలంగా మారతాయి. ఈ వారంలో 54 శాతం శుభములు చేకూరుస్తూ ఉన్నాయి. చిత్త 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలత ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది కాబట్టి మంచి ఫలితాలు కలుగుతాయి. విశాఖ1 2 3 పాదాల వారికి మాత్రం జన్మతార అయింది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

పరిహారం : శనికి జపం చేయించండి. నువ్వులు నువ్వులు నూనె దానం చెయ్యండి. రుద్రాభిషేకం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంగళవారం నియమాలు పాటిస్తే మంచిది. ఆదివారం నాడు 11 నుంచి 11:45 మధ్యలో దైవదర్శనం గాని దైవప్రార్థన గాని చేయండి.

వృశ్చిక రాశి :

ఈ రాశి వారికి ఈ వారము సౌఖ్యము ధనప్రాప్తి ఆనందము ఒకటేమిటి అన్నీ కూడా వీళ్ళకి ఇబ్బడిముబ్బడిగా వచ్చి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కలిగిస్తాయి. మూడు వారాల నుండి మీరు గ్రహస్థితి లో చాలా మార్పు వచ్చింది. ఆ ఫలితాన్ని ఇప్పుడు మీరు ఆనందిస్తూ అనుభవిస్తున్నారు. అయితే అకారణంగా వీరు కొన్ని విషయాలలో దూరి ఆ బాధ్యతను నెత్తిన వేసుకొని ఇబ్బందుల్ని కోరి తెచ్చుకుంటారు. ఒక విలువైన వస్తువును పోగొట్టుకొనే అవకాశం కూడా లేకపోలేదు. అన్ని విధాల వీరు అందరికీ ఆనందాన్ని చేకూరుస్తారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మానసికంగా కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇతరుల యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకు లాభం చేయడం ద్వారా మీరు మంచి మంచి ఫలితాలని చాలా తొందరగా పొంది అభ్యున్నతిని సాగిస్తారు. సమాజంలో వీరి తాలూకా విలువలు పెరుగుతాయి. ఈ వారంలో మీకు 70 శాతం శుభ ఫలితాలు ఉన్నాయి అంతకంటే మంచి సమయం దొరకదు. అన్ని పనులు చక్కగా చేస్తారు. విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి మాత్రమే జన్మతార అయింది ఆరోగ్యం జాగ్రత్త వహించండి. అనూరాధ నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి మంచి విషయాలు వింటారు. జ్యేష్ట నక్షత్ర జాతకులకు మిత్ర తార అయింది కాబట్టి పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.

పరిహారం: రుద్రాభిషేకం చెయ్యండి వేద రుద్ర నామ పారాయణ చేసిన మంచిది. రాహుకేతువుల దర్శించండి లేదా నువ్వులు మినుములు దానం చేయండి ఆదివారం నాడు 11 నుంచి 11:45 మధ్యలో దైవ ధ్యానాన్ని దైవ దర్శనం చేయండి.

ధను రాశి :

ఈ రాశి వారికి కార్య అనుకూలత సౌఖ్యము లాభము సంతోషం ఇవి వారిని ముందుకు నడిపిస్తాయి. ఈ వారంలో రవి ప్రభావం చేత శుక్రవారం లోగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువులు భయాన్ని కూడా చవిచూడక తప్పనిసరి పరిస్థితి వస్తుంది. గురు ప్రభావం చేత వీరు ఏమైనా స్థానచలనం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. భూసంపద ఎంత ఉన్నప్పటికీ కూడా అనుభవించే యోగము ప్రస్తుతానికి లేదు. ఏవైనా సరే మీరు కష్టేఫలి అన్నట్టుగా ఉండాలి. ఈ వారంలో శత్రువులతో ఇబ్బందులను కూడా ఎదుర్కోక తప్పదు. కుజ రాహు శని ప్రభావం చేత వీరికి కొన్ని ఇబ్బందులు అలాగే కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతాయి. సరైన వ్యక్తులు మీకు సకాలంలో లభించక మీకు ఉన్నటువంటి స్థాయిని దిగజార్చు కో వలసిన పరిస్థితి వస్తుంది. ఈ వారంలో వీరు 38 శాతం మాత్రమే శుభఫలితాలను పొందగలుగుతారు. గురు శుక్రుల పైన దుష్టగ్రహ దృష్టి ఉండటం వల్ల వీరికి కొన్ని దురదృష్ట సంఘటనలు ఎదురవుతాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం చేత ధనవ్యయం ఎక్కువ అవుతుంది. మూలా నక్షత్ర జాతకులకు నైధన తార అయింది ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. పూర్వాషాడ నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి పనులు అన్నీ అనుకూలంగా సాగిపోతాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి మాత్రమే ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పరిహారం : శనికి జపం చేయండి నువ్వులను దానం చేయండి తైలాభిషేకం శనికి జరిపించండి. రుద్రాభిషేకం మంచిది. ఆదివారం నాడు 11 గంటల నుండి 11 45 మధ్యలో దైవదర్శనం గాని దైవ పూజ గాని దైవ ఆరాధన గాని లేదా నామ మంత్ర జపం గాని చేస్తే సత్ఫలితాలు వస్తాయి.

మకర రాశి :

ఈ రాశి వారికి సౌఖ్యము సుఖ జీవనం ఉన్నప్పటికీ కూడా గ్రహ ప్రభావం చేత వీరు కొన్ని వ్యతిరేకంగా మారుతున్నాయి. ముఖ్యంగా శరీరానికి మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. శత్రువులు కూడా ఒకేసారి ఇబ్బంది పెడతారు. వీరి కుటుంబంలో ఉండే ముసలి వాళ్లకి అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి అది కూడా గ్రహించాలి. అలాగే ఉద్యోగం లో ఇబ్బందులు ఎదురయ్యే వాటికి పరిష్కార మార్గాల ద్వారా తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఎక్కువగా ఉంది. దీనికి కారణం 8 గ్రహములు ప్రతికూలంగా ఉండడం మాత్రమే అని గ్రహించండి. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరము. వాహనాలు నడిపే ఇటువంటి వారికి మరీ హెచ్చరికలు ముందుగా చేయడం చాలా అవసరం. ఈవారం మీరు 22 శాతం మాత్రమే శుభఫలితాలను పొందగలుగుతారు. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. శ్రవణా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి శుభ అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

పరిహారం : శనికి తైలాభిషేకము నువ్వులు, నువ్వుల నూనె దానం చెయ్యండి. బ్రాహ్మణ భోజనాలు ఏర్పాటు చేయండి వారి సేవ మీకు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఆదివారం 11 నుంచి 11:45 భగవధ్యానము గాని భగవద్దర్శనం గాని లేదా మంత్ర జపం చేయండి.

కుంభ రాశి :

ఈ రాశి వారికి ధనలాభము పొగరు తను అనుకున్నది నెరవేర్చుకునే స్థితి ఉంది కాబట్టి మీరు కొంచెం ఆనందంతో ముందడుగు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుభ పరిణామాలు ఉన్నాయి. వీరికి 17వ తేదీ దాటిన తర్వాత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితులు ఒక నెల రోజుల వరకు కొనసాగే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో చంద్రుని తాలూకా ప్రభావం కూడా బాగు లేదు గనుక ఆరోగ్యం కోసం జాగ్రత్తలు ఎక్కువగా వహించండి. మీకు అన్ని సౌకర్యాలు ఇంటిదగ్గర కుదురుతాయి కానీ మీరు ఇంట్లో అనుభవించే యోగం తక్కువగా ఉంటుంది. స్థానచలన అవకాశం కూడా ఉంది గనుక అలా వెళ్ళవలసి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన హెచ్చరికలు చాలా అవసరము. మీకు ఈ వారంలో 46 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. శతభిషా నక్షత్ర జాతకులకు సంపత్ తార అయింది కాబట్టి అన్ని అనుకూలంగా జరుగుతాయి. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి మాత్రమే జన్మతార అయింది ఆరోగ్యం సరిచూసుకోండి.

పరిహారం : శని ప్రభావం తగ్గడం కోసం తైలాభిషేకము లేదా రుద్రాభిషేకము జరిపించండి శుక్రవారం నాడు అమ్మవారి పూజలు ఖడ్గమాల పారాయణ మంచి ఫలితాలనిస్తాయి. ఆదివారం నాడు మధ్యాహ్నం 11 నుంచి 11:45 మధ్యలో దైవధ్యానంలో దైవదర్శనం చేసి నా మంత్ర జపం చేయండి.

మీన రాశి :

ఈ రాశి వారికి బంధుమిత్రుల దర్శనం వీరిని చక్కగా సుఖజీవనం తో నడిచిపోతుంది వారాంతాల్లో రవి ప్రభావం మాత్రం వీరికి ఇబ్బందులు కలిగించడం మొదలుపెడుతుంది. చంద్రుడు కూడా ఎక్కువగా అనారోగ్య భయాన్ని కలిగిస్తాడు. కుజుని పరిస్థితులు బాగోలేదు మీకు ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తున్నాడు. గురుని ప్రభావం చేత మీరు శ్రమకు తగిన ఫలితాన్ని ఈ వారంలో పొందలేకపోతే, బంధుమిత్రుల ద్వారా మీరు కొంత వరకు ఆనందాన్ని పొందుతారు. ధనవ్యయం మీకు ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఆదాయం ఉంది దాని ద్వారా మీరు ఆనందాన్ని అనుభూతిని పొంది సుఖసంతోషాలు కొనితెచ్చుకుంటారు. ఇవి మీ కుటుంబంతో పాటు అందరికీ పంచి పెడతారు. మీరు మిత్రులకు గతంలో చేసిన మేలు తో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే కుటుంబంలో ఇటువంటి అవకాశాలు తక్కువ. మీకు ఈ వారం 46 శాతం మాత్రమే శుభ పరిణామాలు ఉన్నాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి జన్మతార అయింది కాబట్టి ఆరోగ్యం సరిచూసుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పరమ మిత్రతార అయింది కాబట్టి ఫలితాలు చాలా బాగుంటాయి. రేవతీ నక్షత్ర జాతకులకు మిత్రతార అయింది కాబట్టి ఫలితాలు అనుకూలంగా చాలా బాగుంటాయి.

పరిహారము : రవి కొరకు యోగ సాధన చేయండి సూర్యనమస్కారాలు చేయండి. గురు మంత్రాన్ని పారాయణ చేయండి మంచి ఫలితాలు పొందగలరు ఆదివారం నుంచి 11:45 మధ్యలో దైవధ్యానం గాని లైవ్ దర్శనం గాని నామ మంత్రజపం గాని చేయండి మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు.

Next Story