ఆస్పత్రిలో బ్రిటన్‌ ప్రధాని.. రాణి ఎలిజిబెత్‌ కీలక వ్యాఖ్యలు

By Newsmeter.Network  Published on  6 April 2020 5:55 AM GMT
ఆస్పత్రిలో బ్రిటన్‌ ప్రధాని.. రాణి ఎలిజిబెత్‌ కీలక వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. ఈ వైరస్‌ రోజురోజుకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ వ్యాప్తితో బ్రిటన్‌ అతలాకుతలం అవుతుంది. ఈ కరోనా వైరస్‌ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను వదలలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ప్రధానిని ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రధాని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సమయంలో బ్రిటన్‌ ప్రజలనుద్దేశించి రాణి ఎలిజిబెత్‌ మాట్లాడారు.

Also Read :లాక్‌డౌన్‌ బూచీతో అడ్డగోలుగా ధరలు.. కొండెక్కిన కోడిగుడ్డు

దేశంలో 40వేల మందికిపైగా కరోనా భారిన పడగా, 4వేల మందికిపైగా మృత్యువాత పడ్డారని ఆమె అన్నారు. దేశంలో జనజీవనం అస్తవ్యస్తమైందని, కొందరికి దుఖం మిగిల్చిగా, అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపింది. మనందరి నిత్యజీవితంలో అనేక మార్పులొచ్చాయని, అయితే ఈ సవాళ్లను ఎదుర్కొని మనం ఎలా నిలదొక్కుకున్నామన్నది రానున్న రోజుల్లో మనకే గర్వకారణమౌతుందని బ్రిటన్‌ రాణి అన్నారు. మనం ఎంతటి శక్తివంతులమో భవిష్యత్తు తరాలు గుర్త్తుంచుకుంటాయని ఆమె పేర్కొన్నారు. ఎలిజిబెత్‌ గత 66సంవత్సరాలలో ప్రజలనుద్దేశించి మాట్లాడటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. ఇదిలా ఉంటే ఎలిజిబెత్‌ తనయుడు ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా వైరస్‌ సోకింది. దీంతో వారం రోజుల పాటు అతను ఐసోలేషన్‌లో గడిపారు. మరోవైపు జాన్సన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ క్వారీ సైమండ్స్‌కు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఆమెకు 32ఏళ్లు. ప్రస్తుతం ఆమె గర్భవతి. దీంతో ఆమెను ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు.

Next Story