ఖతార్‌ ఓపెన్‌ : తొలి రౌండ్‌లోనే సానియా ఔట్‌

By Newsmeter.Network  Published on  26 Feb 2020 7:36 AM GMT
ఖతార్‌ ఓపెన్‌ : తొలి రౌండ్‌లోనే సానియా ఔట్‌

ఖతార్‌ ఓపెన్‌ తొలి రౌండర్‌లోనే సానియా నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌లో ఫ్రెంచ్‌ క్రీడాకారిణి కరోలిన్‌ గార్సియాతో కలిసి బరిలోకి దిగిన సానియా.. లారా(జర్మనీ)-కాగ్లా(టర్కీ) జంట చేతిలో 4-6,5-7 తేడాతో ఓడిపోయింది. వరుస సెట్లలో ఈ జంట ఓటమి పాలై ఖతార్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌ నుంచే నిష్క్రమించింది.

అంతముందు దుబాయ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌ షిప్‌లోనూ సానియా రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. రెండేళ్ల విరామం తరువాత బరిలోకి దిగిన సానియా మీర్జా.. ఇటీవల హోబర్ట్ అంతర్జాతీయ చాంఫియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.. ఆతరువాత మరే టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోలేదు. 2017లో మోకాలి గాయం, ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం కారణంగా సానియా రెండేళ్లకు పైగా ఆటకు దూరమైంది.

Next Story
Share it